ఈ తేదీల్లో పుట్టినవారికి సెప్టెంబర్ నెల సూపర్ గా కలిసివస్తుంది!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టినవారికి కొన్ని నెలలు కలిసివస్తాయి. ఆ నెలలో వారు కోరుకున్నవి జరుగుతాయి. సంతోషంగా ఉంటారు. మరి ఏ తేదీల్లో పుట్టినవారికి సెప్టెంబర్ నెల కలిసివస్తుందో ఇక్కడ చూద్దాం.

సెప్టెంబర్ నెల ప్రత్యేకత
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితంలో నెలల ప్రభావం.. జాతకానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టినవారికి కొన్ని నెలలు అత్యంత శుభప్రదంగా మారుతాయి. అందులో సెప్టెంబర్ కూడా ఒకటి. ప్రగతి, ప్రశాంతతకి ప్రతీకగా భావించే సెప్టెంబర్ నెల కొన్నితేదీల్లో పుట్టిన వారికి సానుకూలంగా ఉంటుంది. మరి ఆ తేదీలేంటో చూద్దామా..
1, 5, 6, 9, 14, 15, 23, 24 తేదీల్లో జన్మించినవారు..
సెప్టెంబర్ నెలలో సూర్యుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ ప్రభావం వల్ల కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టినవారికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఏ నెలలో అయినా 1, 5, 6, 9, 14, 15, 23, 24 తేదీల్లో జన్మించినవారు మంచి ఫలితాలు పొందుతారు. సాధారణంగా ఈ తేదీల్లో పుట్టినవారు చాలా ధైర్యవంతులు, చాలా క్రియేటీవ్ గా ఆలోచిస్తారు.
ఎలాంటి లాభాలు ఉంటాయంటే?
ఈ తేదీల్లో పుట్టినవారు సెప్టెంబర్ నెలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లాభాలు పొందుతారు. ముఖ్యంగా వ్యాపారంలో రెట్టింపు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం ఉంది. మంచి పనితీరుతో గుర్తింపు కూడా పొందుతారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం దక్కుతుంది. సంబంధాలు బలపడతాయి.
కొత్త అవకాశాలతో..
1, 5, 6, 9, 14, 15, 23, 24 తేదీల్లో జన్మించినవారికి సెప్టెంబర్ నెల.. గొప్ప మార్గదర్శకంగా ఉంటుంది. కొత్త అవకాశాలు, సృజనాత్మక ఆలోచనలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. విద్యార్థులు చదువులో ఉత్తమ ఫలితాలు పొందుతారు. కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు.
గమనిక
ఈ సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించింది మాత్రమే.