Marriage Date: ఈ తేదీల్లో పెళ్లి చేసుకుంటే మీ జీవితం నరకమే..!
పెళ్లి తర్వాత మీ జీవితం ఎలా ఉంటుంది? మీ భాగస్వామితో కలిసి ఉండగలరా లేదా? సంఖ్యాశాస్త్రంలో దీనికి సమాధానం ఉంది. మీ పెళ్లి తేదీతో మీ భవిష్యత్తు తెలుసుకోండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
marriage
పెళ్లి విషయంలో ప్రతి ఒక్కరికీ కొన్ని ఆశలు, కలలు ఉంటాయి. పెళ్లి తర్వాత తమ జీవితం అలా ఉండాలి... ఇలా ఉండాలి.. తమ జీవితంలోకి అడుగుపెట్టే వ్యక్తి తమను బాగా అర్థం చేసుకోవాలని, సంతోషంగా జీవితం సాగాలి అని.. ఇలా చాలా ఊహించుకుంటారు. కానీ.. అలా ఊహించినట్లు, కలలు కన్నట్లు అందరికీ ఉండకపోవచ్చు. పెళ్లి తర్వాత మీ జీవితం ఆనందంగా లేదు అంటే మీరు పెళ్లి చేసుకున్న తేదీ కూడా కారణం కావచ్చు అంటే మీరు నమ్ముతారా? అవును.. న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని తేదీల్లో పెళ్లి చేసుకున్న వారి జీవితం అంత సంతోషంగా ఏమీ ఉండదట. మరి, ఆ తేదీలేంటో ఓసారి తెలుసుకుందామా...
Daily Numerology
నెంబర్ 1..
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పెళ్లి చేసుకున్నవారంతా న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 1 కిందకు వస్తారు. అయితే.. ఈ తేదీల్లో వివాహం చేసుకున్న జంటలు పెళ్లి తర్వాత అంత సంతోషంగా ఉండకపోవచ్చు. వీరి మధ్య ప్రతి విషయంలోనూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే.. గొడవలు ఎన్ని జరిగినా వీరు విడిపోరు. గొడవల తర్వాత మళ్లీ కలిసిపోతారు. దీని వల్ల వీరి బంధం మరింత బలపడుతూనే ఉంటుంది.
Daily Numerology
నెంబర్ 2..
ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో పెళ్లయిన వాళ్ల సంఖ్య 2 అవుతుంది. ఈ సంఖ్య వాళ్లు ఒకరినొకరు బాగా ప్రేమిస్తారు. సంతోషంగా జీవితం గడుపుతారు. ఒకరినొకరిని అర్థం చేసుకొని జీవితంలో ముందుకు సాగుతారు.
Daily Numerology
నెంబర్ 3..
మీ పెళ్లి 3, 12, 21 లేదా 30 తేదీల్లో జరిగితే మీ సంఖ్య 3 అవుతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఈ జంటల వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.ఎలాంటి సమస్యలు వచ్చినా.. ఈ తేదీన పెళ్లి చేసుకున్న జంట వాటిని ఎదుర్కొని సంతోషంగా ఉండగలరు.
Daily Numerology
నెంబర్ 4..
4, 13, 22 లేదా 31 తేదీల్లో పెళ్లయిన వాళ్ల సంఖ్య 4 అవుతుంది. ఈ జంట ఒకరి మాట ఒకరు విని సంతోషంగా ఉంటారు. వీరి మధ్య మనస్పర్థలు రావు. ఒకరిని మరొకరు బాగా అర్థం చేసుకుంటారు.
Daily Numerology
నెంబర్ 5..
ఏ నెలలో అయినా 5, 14 లేదా 23 తేదీల్లో పెళ్లయిన వాళ్ల సంఖ్య 5. వీళ్లు తమ భాగస్వాములతో కొన్ని విభేదాలు కలిగి ఉంటారు. చిన్న చిన్న విషయాలకే వీరి మధ్య గొడవలు జరిగే అవకాశం ఎక్కువ.
Daily Numerology
నెంబర్ 6..
ఏ నెలలో అయినా మీ పెళ్లి తేదీ 6, 15 లేదా 24 అయితే మీ సంఖ్య 6 అవుతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం, వీళ్ల దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. జీవితాంతం సంతోషంగా ఉంటారు.
Daily Numerology
నెంబర్ 7..
ఏ నెలలో అయినా 7, 16 లేదా 25 తేదీల్లో పెళ్లయిన వాళ్ల సంఖ్య 7. వీళ్ల వైవాహిక జీవితం సంతోషంగా, విజయవంతంగా ఉంటుంది. వీరి మధ్య అసలు విభేదాలు రావు. సర్దుకుపోయే గుణం ఉంటుంది. వీరికి విడిపోవాలని ఉండదు. అందుకే.. ఎలాంటి విభేదాలు వచ్చినా వాటిని మర్చిపోయి సంతోషంగా ఉంటారు.
Daily Numerology
నెంబర్ 8..
ఏ నెలలో అయినా 8, 17 లేదా 26 తేదీల్లో పెళ్లయిన వాళ్ల సంఖ్య 8. వీళ్లు తమ భాగస్వామికి అన్ని విషయాల్లో అండగా ఉంటారు.డబ్బు ఉన్నా, లేకపోయినా.. భాగస్వామికి అండగా ఉంటారు.
Daily Numerology
నెంబర్ 9..
9, 18 లేదా 27 తేదీల్లో పెళ్లయిన వాళ్ల సంఖ్య 9. సంఖ్యాశాస్త్రం ప్రకారం, వీళ్ల వైవాహిక జీవితంలో గొడవలు ఎక్కువ అవుతాయి. చిన్నదానికీ, పెద్ద దానికీ గొడవలు పడుతూనే ఉంటారు. వీరికి విడిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.