Maha shivaratri: చతుర్గ్రాహి యోగం.. ఈ 3 రాశుల వారికి లక్కు మామూలుగా లేదు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది. మరికొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది. అయితే మహాశివరాత్రి నాడు ఏర్పడే చతుర్గ్రాహి యోగం వల్ల ఈ 3 రాశులవారికి అదృష్టం కలిసివస్తుందట. ఆ రాశులెంటో ఒకసారి చూసేయండి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలియిక, మార్పులు రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. ఇందులో అందరికీ మంచి జరగాలని లేదు. అలాగని అందరికీ చెడు కూడా జరగదు. ఒక గ్రహం అనుకూలంగా ఉంటే మంచి జరుగుతుంది. లేదంటే చెడు ఫలితాలు వస్తాయి.

ఈ చతుర్గ్రాహి యోగం
మహా శివరాత్రి రోజున సూర్యుడు, బుధుడు, చంద్రుడు, శని గ్రహాలు కుంభరాశిలో కలుస్తాయి. ఈ 4 గ్రహాలు కలవడం వల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ చతుర్గ్రాహి యోగం వల్ల ఈ 3 రాశుల వాళ్లకి బాగా కలిసి వస్తుంది. ఆ రాశులెంటో.. వారికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి
కుంభరాశిలో బుధుడు, శని, సూర్యుడు, చంద్రుడు కలవడం వల్ల ఏర్పడే చతుర్గ్రాహి యోగం వల్ల మిథున రాశికి మేలు జరుగుతుంది. వాళ్లకి విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కొడుకు లేదా కూతురికి విదేశాల్లో సంబంధం కుదరవచ్చు. ఆఫీసులో పనులు పూర్తి చేసి పై అధికారుల మెప్పు పొందుతారు. ఉద్యోగంలో మంచి ఎదుగుదల ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

తులా రాశి
చతుర్గ్రాహి యోగం తులా రాశిపై మంచి ప్రభావం చూపిస్తుంది. పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. చదువు పూర్తయిన వాళ్లకి ఉద్యోగం వస్తుంది. దూరం నుంచి శుభవార్త వింటారు. రాజకీయాల్లో ఉన్నవాళ్లకి మంచి పదవి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆఫీసులో మంచి పొజిషన్, జీతం పెరుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. విదేశాలకు వెళ్లే యోగం కూడా ఉంది.

మకర రాశి
చతుర్గ్రాహి యోగం వల్ల మకర రాశి వాళ్లకి శత్రువుల బాధ ఉండదు. ఆఫీసులో పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పిల్లలు లేని వాళ్లకి పిల్లలు పుడతారు.