MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Astrology
  • Lunar Eclipse: గ్రహణం రోజు దర్బలు ఎందుకు వేస్తారు...?

Lunar Eclipse: గ్రహణం రోజు దర్బలు ఎందుకు వేస్తారు...?

Lunar Eclipse: మార్చిన 3 చంద్రగ్రహణం. గ్రహణం అనగానే మొదట గుర్తొచ్చేది దర్భగడ్డి. గ్రహాణం ప్రారంభమయ్యే ముందు తినడానికి సంబంధించిన అన్ని వస్తువుల్లోనూ దీన్ని వేస్తారు. అలా ఎందుకు వేస్తారో తెలుసా?  

2 Min read
Author : Nandini Arava
Published : Mar 02 2026, 07:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మార్నింగ్ 11 లోపు భోజనం చేసేయాలి
Image Credit : Getty

మార్నింగ్ 11 లోపు భోజనం చేసేయాలి

చంద్రగ్రహణం, హోలీ కూడా ఇదే రోజు పడింది. మార్నింగ్ 11 లోపు భోజనం చేసేయాలని పండితులు చెబుతున్నారు. మధ్యాహ్న 3 నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గ్రహణానికి రెండు గంటల ముందే భోజనం చేసి, గ్రహణం వీడాక స్నానం చేసి, ఇళ్లు శుద్ధి చేయాలని పండితులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
భారతీయ సంప్రదాయాల్లో దర్భ గడ్డికి ప్రత్యేక స్థానం
Image Credit : Getty

భారతీయ సంప్రదాయాల్లో దర్భ గడ్డికి ప్రత్యేక స్థానం

భారతీయ సంప్రదాయాల్లో దర్భ గడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది మతపరమైన, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నమ్మకాలతో ముడిపడి ఉంది. హిందూ మత ఆచారాల్లో దర్భను శుద్ధి, రక్షణకు సూచికగా భావిస్తారు. హిందూ మతంలో దర్భ వినియోగం విస్తృతంగా కనిపిస్తుంది. పూజా స్థలాన్ని శుద్ధి చేయడానికి, యజ్ఞాల్లో అగ్నికి సమర్పణ చేసే సమయంలో, పూజారి చేతిలో లేదా వేళ్లలో దర్భతో చేసిన ఉంగరాన్ని ధరించడం వంటి ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వివాహాలు, ఉపనయనం వంటి శాస్త్రోక్త కార్యక్రమాల్లో కూడా దర్భకు స్థానం ఉంది. తర్పణం వంటి పితృకార్యాల్లో దర్భ లేకుండా ఆచారం పూర్తికాదని భావిస్తారు.

Related Articles

Related image1
Astro Tips : శని నుండి తప్పించుకోవాలంటే షూస్ దానం చేయాలా..! అదీ ఆ రంగువే..!
Related image2
Astro Tips: ఉదయం లేచిన వెంటనే వీటిని మాత్రం చూడకూడదు..!
34
దర్భగడ్డి ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్మకం
Image Credit : Getty

దర్భగడ్డి ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్మకం

దర్భగడ్డి కోసం పురాణాల ప్రకారం రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వృత్రాసురుడిని సంహరించడానికి బ్రహ్మ దేవుడు ఇంద్రుడి వజ్రాయుధాన్ని పవిత్ర జలంలో ముంచి శక్తినిచ్చినట్లు చెబుతారు. ఆ దైవిక శక్తి తాకిన జల వనరులు దర్భగా మారినట్టు పురాణాలు చెబుతున్నాయి. మరొక పురాణంలో గరుడుడు స్వర్గం నుంచి అమృతాన్ని తీసుకువస్తున్న సమయంలో కొన్ని చుక్కలు దర్భపై పడటంతో పడి పవిత్రతను పొందినట్లు చెబుతారు. అంతేకాకుండా క్షీరసాగర మథనం సమయంలో శ్రీ మహావిష్ణువు వెంట్రుకలు పడిపోతాయంట. అప్పుడు అవి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి వాటికి పవిత్రత వస్తుందని చెబుతారు. దర్భ గడ్డిని పూజా స్థల శుద్ధి కోసం ఉపయోగిస్తారు. ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్మకం. రాహుకేతువుల ప్రభావం పడకుండా ఈ దర్భ అడ్డుకుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

44
ఊరగాయలు, ఆహారం, నీటిపై దర్భ వేస్తారు
Image Credit : Asianet News

ఊరగాయలు, ఆహారం, నీటిపై దర్భ వేస్తారు

గ్రహణ కాలాన్ని హిందూ సంప్రదాయాలు కీడు సమయంగా పరిగణిస్తారు. అందువల్ల ఆ సమయంలో వంట, భోజనం చేయరు. ముందుగానే వండిన ఆహారంపై, ముఖ్యంగా ఊరగాయలపై, దర్భను ఉంచే ఆచారం ఉంది. ఇది ఆహారాన్ని అపవిత్రత నుంచి కాపాడుతుందని నమ్మకం. అలాగే నీటిలో దర్భ ఉంచడం ద్వారా నీరు కలుషితం కాకుండా ఉంటుందని విశ్వసిస్తారు. గ్రహణ వాతావరణంలో మార్పులు సంభవిస్తాయని విశ్వసిస్తారు. ఈ సమయంలో యూవీ కిరణాలు అధికంగా ప్రభావం చూపుతాయని భావించి, ఆహారం, నీరు, ధాన్యాలపై దర్భ గడ్డిని ఉంచే ఆచారం ఏర్పడింది. దర్భకు శుద్ధి చేసే స్వభావం ఉందని నమ్ముతారు. ఆహారం త్వరగా పాడవకుండా కాపాడుతుందని పెద్దలు చెబుతారు.ఈ ఆచారం ఇప్పటికీ అనేక ఇళ్లలో పాటిస్తున్నారు.

దర్భ గడ్డి నిటారుగా నిలబడుతుంది. అందువల్ల అది సూర్యశక్తిని గ్రహిస్తుంది. ముఖ్యంగా గ్రహణకాలంలో భూమికి చేరే హానికరమైన కిరణాలను దర్భ తన సహజ శక్తితో అడ్డుకుంటుందని చెబుతారు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ మూడు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్!
Recommended image3
Kitchen Vastu: ఇంట్లో 3 బర్నర్ల గ్యాస్ స్టవ్ ఉండకూడదా? ఖర్చులు పెరుగుతాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Related Stories
Recommended image1
Astro Tips : శని నుండి తప్పించుకోవాలంటే షూస్ దానం చేయాలా..! అదీ ఆ రంగువే..!
Recommended image2
Astro Tips: ఉదయం లేచిన వెంటనే వీటిని మాత్రం చూడకూడదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved