MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Astro Tips: ఉదయం లేచిన వెంటనే వీటిని మాత్రం చూడకూడదు..!

Astro Tips: ఉదయం లేచిన వెంటనే వీటిని మాత్రం చూడకూడదు..!

 ఉదయం లేవగానే కొన్నింటిని అస్సలు చూడకూడదని మీకు తెలుసా? కొన్నింటిని చూడటం వల్ల ఆ రోజంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 21 2025, 05:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
లేవగానే ఏ పనులు చేయకూడదు?
Image Credit : others

లేవగానే ఏ పనులు చేయకూడదు?

ప్రతిరోజూ ఆనందంగా, సంతోషంగా, ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. కానీ, రోజంతా సంతోషంగా ఉండాలంట.. మనం ఉదయం లేవగానే చేసే పనులపై ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా? జోతిష్యశాస్త్రం ప్రకారం ఉదయం లేవగానే మన రోజు ఎలా ప్రారంభమౌతుందో.. అదే ఆ రోజు ని నిర్ణయిస్తుంది. అందుకే.. ప్రతిరోజూ ఉదయాన్ని చాలా పాజిటివ్ గా మొదలుపెట్టాలి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే.. ఉదయం లేవగానే మనం ఎలాంటివి చూస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. మన రోజంతా సంతోషం సాగాలి అంటే.. ఉదయంపూట కొన్నింటిని అస్సలు చూడకూడదట. మరి, వేటిని చూడకూడదో ఓసారి తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
 ఉదయం లేవగానే వీటిని చూడొద్దు..
Image Credit : freepik

ఉదయం లేవగానే వీటిని చూడొద్దు..

ఆగిపోయిన గడియారం

ఉదయాన్నే ఆగిపోయిన గడియారం చూడకూడదు. ఆగిపోయిన గడియారం.. జీవనప్రవాహం ఆగిపోయిందన్న సంకేతంగా పరిగణిస్తారు. అంటే.. దీనిని చూడటం వల్ల మనం పడిన కష్టానికి ఫలితం రాదు అని నమ్ముతారు. అంతేకాదు.. జీవితంలో ముందుకు సాగలేరని, చేయాలి అనుకున్న పని ఆగిపోవడం లాంటివి జరుగుతాయని భావిస్తారు. అందుకే అలాంటి గడియారం చూడకూడదు. అసలు ఇంట్లో ఉంచుకోకుండా ఉండటం మరింత ఉత్తమం.

36
  అద్దం (ముఖం కడుక్కోకముందు)
Image Credit : others

అద్దం (ముఖం కడుక్కోకముందు)

నిద్రలేచిన వెంటనే చాలా మందికి అద్దం చూసుకునే అలవాటు ఉంటుంది. అది కూడా మంచిది కాదట. లేవగానే చక్కగా మన అర చేతిని చూసుకొని ఆ తర్వాత కొద్ది సమయానికి ముఖాన్ని నీటితో కడుక్కొని ఆ తర్వాత అద్దంలో చూసుకుంటే ఏమీ కాదు. కానీ, ముందే అద్దంలో చూసుకుంటే నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

46
ఖాళీ పాత్రలు
Image Credit : freepik

ఖాళీ పాత్రలు

వంటగదిలో ఖాళీ పాత్రలు లక్ష్మీదేవికి అసంతృప్తిని కలిగిస్తాయి.అంటే.. రాత్రి మనం తినేసిన పాత్రలను శుభ్రం చేయకుండా ఖాళీగా వంటింట్లో, సింకుల్లో ఉంచకూడదు. ఉదయం లేచిన వెంటనే కడగని పాత్రలు కనిపించడం ఆర్థికంగా నష్టాలను, ఆర్దిక నిరాశను తెస్తుంది. కాబట్టి, రాత్రి పూట పాత్రలు శుభ్రంగా కడిగి ఉంచడం మంచిది.

56
చీపురు , చెత్తబుట్ట..
Image Credit : social media

చీపురు , చెత్తబుట్ట..

చాలా మంది ఉదయం పక్క మీద నుంచి లేవడం చీపురు పట్టుకొని ఊడ్చేస్తూ ఉంటారు. ఇంటిని శుభ్రం చేయడం మంచిదే కానీ.. ఉదయం లేవగానే చీపురు, చెత్తబుట్ట లాంటివి చూడకుండా ఉండటమే మంచిది. వీటి వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పెరగడం, ఇంట్లో దోషాలు తలెత్తడం లాంటివి జరిగే అవకాశం ఉంటుందట. అసలు ఉదయం లేవగానే ఇలాంటి వాటిని కనిపించకుండా పెట్టుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు.

క్రూర జంతువుల చిత్రాలు

పులి, సింహం, నక్క వంటి క్రూర జంతువుల ఫోటోలు ఉదయాన్నే కనిపిస్తే, మన మనసులో చిరాకు, కోపం, ఉద్వేగం పెరుగుతుందని నమ్మకం. మనసుకు ప్రశాంతత కలిగించే వాటిని మాత్రమే ఉదయాన్నే చూడటం మంచిది.

66
పాజిటివిటీ పెరగాలంటే ఏం చేయాలి?
Image Credit : Getty

పాజిటివిటీ పెరగాలంటే ఏం చేయాలి?

ఉదయం లేవగానే మనసుకు హాయి కలిగించే వాటిని చూడాలి. అంటే..కుటుంబసభ్యుల ఫోటోలు, దేవుడి విగ్రహం లేదా పచ్చని మొక్క లాంటివి చూస్తే చాలు.మంచి, మీలో పాజిటివిటీ పెంచే మాటలు మాట్లాడాలి. అదేవిధంగా ధ్యానం, యోగా, ప్రాణయామం లాంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా, ఆనందంగా సాగుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువ.. వీరికి డబ్బు కష్టాలు ఉండవు!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలకి మంచి భర్తలు వస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved