Jupiter Transit: జూన్ నెలలో ఈ రాశులకు డబ్బే డబ్బు
గురు గ్రహం రాశిని మార్చుకోవడం వల్ల జూన్ నెలలో మూడు రాశులకు అదృష్టయోగం పట్టనుంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూసేద్దామా...
- FB
- TW
- Linkdin
Follow Us
)
పిల్లలు,విద్య, జ్ఞానం లాంటి వాటికి గురు గ్రహాన్ని ప్రతీక గా చెబుతుంటారు. ఈ గురు గ్రహం. ఒక నిర్దిష్ట సమయం తర్వాత తన రాశి, నక్షత్రాన్ని మార్చుకుంటూ ఉంటుంది. మళ్లీ అదే రాశిలోకి గురు గ్రహం అడుగుపెట్టడానికి కనీసం 12 సంవత్సరాలు పడుతుంది. ఇలా రాశిని మార్చుకున్నప్పుడు గురు వక్ర, ప్రత్యక్ష గమంలో కూడా కదులుతుంది. గురు గ్రహం అస్తమయం, ఉదయించే స్థానాలను కూడా మారుస్తుంది. దీని వల్ల ఈ గ్రహం కదిలిన ప్రతిసారీ 12 రాశులను ప్రభావితం చేస్తుంది. జూన్ నెలలో గురు గ్రహం అస్తమయ స్థిలోకి వెళ్తుంది.
మే 14, 2025 న గురు గ్రహం బుధ రాశి అయిన మిథునానికి చేరుకుంది. ఇది జూన్ నెలలో ఈ రాశిలో అస్తమిస్తుంది. దృక్ పంచాంగం ప్రకారం, గురు గ్రహం జూన్ 12, గురువారం సాయంత్రం 7:37 గంటలకు మిథున రాశిలో అస్తమిస్తుంది. ఇది ఈ రాశిలో దాదాపు 27 రోజుల పాటు అస్తమయ స్థితిలో ఉంటుంది. ఈ కాలంలో, 12 రాశులపై సానుకూల , ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. గురువు అస్తమయం ఏ 3 రాశులకు ప్రయోజనకరంగా ఉంటుందో చూద్దాం.
మేష రాశి వారికి గురు గ్రహ అస్తమయం ప్రయోజనకరంగా ఉంటుంది. జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. మీరు కోరుకున్న ఫలితాలను పొందుతారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు కొత్త సవాళ్లు ఎదురవుతాయి, వాటిలో విజయం సాధిస్తారు. పదోన్నతితో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
వృషభ రాశి వారికి గురువు ప్రభావం శుభ ఫలితాలను ఇస్తుంది. జీవితంలో కొత్త మార్పులు వస్తాయి, మంచి ఫలితాలు పొందుతారు. జీతం పెరగవచ్చు. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. డబ్బు పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అన్ని రకాల సౌకర్యాలు, సుఖాలు అనుభవిస్తారు.
ధనుస్సు రాశి వారికి గురు గ్రహ అస్తమయం ఫలవంతంగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణం చేయాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీ జీవితంలో సానుకూల మార్పులు చూస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. కోర్టు కేసుల్లో శుభ ఫలితాలు పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చింతల నుండి బయటపడి కొత్త పనులు చేయాలని నిర్ణయించుకుంటారు.