Rahu Ketu Transit: జూలై 20 తర్వాత ఈ 3 రాశులకు తిరుగేలేదు.. పట్టిందల్లా బంగారమే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 20న కేతువు పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి, రాహువు పూర్వ భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించనున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఆ అదృష్ట రాశులేంటో చూద్దామా..

రాహువు, కేతువుల నక్షత్రాల మార్పు..
జ్యోతిష్యం ప్రకారం, రాహువు, కేతువులను ఛాయా గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు జూలై 20న నక్షత్రాలు మారనున్నాయి. కేతువు పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి, రాహువు పూర్వ భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాయి. ఒకే రోజు రెండు ఛాయా గ్రహాల నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ రాశుల వారు ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. మరి ఆ అదృష్ట రాశులేంటో వారికి కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కన్య రాశివారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే?
కన్య రాశి వారికి రాహు, కేతు నక్షత్ర సంచారం శుభప్రదం. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారులకు డబ్బు ఇబ్బందులు తొలగుతాయి. అదృష్టం పూర్తిగా అనుకూలిస్తుంది. ఐటీ, కంప్యూటర్, వైద్య రంగాల వారికి అభివృద్ధి ఉంటుంది. ఆస్తి, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారులు, సహోద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడుతాయి. ఎప్పటినుంచో ఉన్న కోరికలు నెరవేరుతాయి.
మకర రాశి
మకర రాశి వారికి ఛాయా గ్రహాల నక్షత్ర మార్పు శుభప్రదం. ఉద్యోగులకు పదోన్నతి దక్కుతుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆగిపోయిన పనులు చకచక పూర్తవుతాయి. వివాహితులకు కుటుంబ సభ్యుల మద్దతు దక్కుతుంది. డబ్బు ఆదా చేస్తారు. ఆలోచనలను విజయవంతంగా అమలు చేస్తారు.
తుల రాశి
తుల రాశి వారికి రాహు, కేతు నక్షత్ర మార్పు శుభప్రదం. ఆదాయంలో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారులకు మంచి లాభాలు దక్కుతాయి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితి బలపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో పెద్దలతో సంబంధాలు ఏర్పడతాయి.

