Vastu Tips: వాస్తు శాస్త్ర ప్రకారం ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే...అదృష్టం మీదే!
ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కొన్ని ప్రత్యేక మొక్కలు పెట్టడం వల్ల శ్రేయస్సు, అదృష్టం, సానుకూల శక్తులు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో ప్రశాంతత, ఆనందం
ఏ ఇంటికైనా ముఖ్యమైనది ప్రవేశ ద్వారం. ఇంట్లోకి ఎలాంటి శక్తులు ప్రవేశించాలన్నా ఆ గుమ్మం నుంచే వస్తాయి.అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం..ఈ మొక్కలను ముఖద్వారం వద్ద ఉంటే ఇంటివాతావరణాన్నిపూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి. కొందరు జ్యోతిష్య నిపుణులు ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచాల్సిన కొన్ని ముఖ్యమైన మొక్కల గురించి వివరించారు. ఈ మొక్కలు ఉంటేశ్రేయస్సును పెంచడమే కాదు, ఇంట్లో ప్రశాంతత, ఆనందం నెలకొల్పుతాయని నిపుణులు చెబుతున్నారు.
వెదురు మొక్క
పాజిటివ్ ఎనర్జీ కోసం మొదటిగా వెదురు మొక్కనే చెబుతారు నిపుణులు. ఈ మొక్కను గుమ్మం వద్ద ఉంచడం వల్ల ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తిని అడ్డుకుంటుందని నమ్మకం. చాలామంది దీన్ని బహుమతిగా ఇస్తుంటారు, కానీ మీరు వ్యక్తిగతంగా వెదురును కొనుగోలు చేస్తే, అది మరింత శక్తివంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
లావెండర్
లావెండర్ గురించి చాలామందికి తెలుసు, కానీ దీని సువాసనతో పాటు ఇది ప్రశాంతతను తీసుకురాగలదు. ఇంటి గుమ్మం వద్ద లేదా ఆవరణంలో లావెండర్ మొక్క పెట్టడం వల్ల ఇంట్లో ప్రశాంతత, ఆర్థిక ప్రగతి పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రబ్బరు మొక్క
రబ్బరు మొక్కలు కూడా శ్రేయస్సుకు చిహ్నంగా నిలుస్తాయి. ఇవి ఇంట్లో స్థిరమైన శక్తిని నిలిపేందుకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా సంపద, ఆనందానికి ఈ మొక్క చిహ్నంగా ఉండడం విశేషం.
ట్యూలిప్స్
బయటా ప్రదేశాలకు ట్యూలిప్స్ అద్భుతమైన ఎంపిక. ఇవి ఇంటి ముందు భాగంలో ఉంచినప్పుడు, ఉల్లాసం, పాజిటివ్ వాతావరణాన్ని కలిగిస్తాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, ఇవి లోపల పెట్టకూడదు కానీ బయట వాతావరణాన్ని లాఘవంగా మార్చేందుకు ఉపయోగపడతాయి.
తులసి మొక్క
భారతీయ గృహాల్లో ఆధ్యాత్మికతకు ప్రతీకగా ఉన్న ఈ మొక్క, ఇంట్లోని వాతావరణాన్ని శుద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తూర్పు దిశలో తులసిని పెట్టడం వల్ల ఆధ్యాత్మిక శక్తులు ఉద్భవిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
బ్రెజిల్‌వుడ్
ఇంకొక ఆసక్తికరమైన మొక్క బ్రెజిల్‌వుడ్. ఈ మొక్కను నీటిలో ఉంచినప్పుడు, అదృష్టానికి మార్గం తెరుచుకుంటుందనే నమ్మకం ఉంది. ముఖ్యంగా ఇంటి గుమ్మం లేదా ఆఫీస్ వద్ద ఉంచితే అవకాశాలను ఆకర్షిస్తుందని చెబుతున్నారు
దానిమ్మ చెట్టు
ఇక మనం ఇంట్లో నాటకూడని మొక్కల గురించి కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు దానిమ్మ చెట్టు. దీన్ని ఇంట్లో ఉంచితే అది శక్తి పరంగా దూకుడు, అశాంతిని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇంటి వాతావరణంలో సామరస్యాన్ని దెబ్బతీసే అవకాశముంది.
జాడే మొక్క
ఆర్థిక శ్రేయస్సుకు జాడే మొక్కను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఫెంగ్ షుయ్ లో ఇది ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. వాస్తు ప్రకారం ఇది ధనసంపదను ఆకర్షించే శక్తివంతమైన అయస్కాంతంగా పనిచేస్తుంది.
మందార మొక్క
ఇక మందార మొక్క గురించి మాట్లాడితే, ఇది శక్తిని పెంచే మొక్కగా పేరుగాంచింది. ఇంట్లో వాతావరణం మోసపోయినట్లుగా అనిపించినప్పుడు, మందార మొక్క జీవశక్తిని పునరుజ్జీవింపజేస్తుంది.
తూర్పు దిశకు తులసి, లిల్లీ
దిశకు అనుగుణంగా మొక్కల ఎంపిక కూడా చాలా ముఖ్యం. తూర్పు దిశకు తులసి, లిల్లీలు బాగా సరిపోతాయి. ఈశాన్యం దిశకు అశోక వృక్షాలు శాంతిని తీసుకురాగలవు. ఉత్తరం దిశలో మనీ ప్లాంట్, మల్లె, మర్రి వంటివి గాలి శుద్ధి చేస్తూనే, శ్రద్ధ, ఆధ్యాత్మికత పెంచుతాయి.
స్నేక్ ప్లాంట్.
శ్రేయస్సు కోసం గుర్తించాల్సిన మరో మొక్క స్నేక్ ప్లాంట్. ఇది తక్కువ సంరక్షణతో ఎక్కువ లాభాలిచ్చే మొక్క. గాలి శుద్ధి చేయడంలో అగ్రగామిగా నిలిచే ఈ మొక్క, జీవన భాగస్వామ్య శక్తిని సమతుల్యం చేస్తుంది.
అలోవెరా
చివరగా, అలోవెరా గురించి చెప్పుకోవాలి. ఇది కేవలం చర్మ సమస్యలకు మాత్రంగా కాదు. ఇది పాజిటివ్ ఎనర్జీని నిలిపే విలువైన మొక్క. కలబంద చెట్టు చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని శోషించి, మంచి వైబ్స్‌ను ప్రసరింపజేస్తుంది.
సంప్రదాయ వాస్తు ,ఆధునిక ఆధ్యాత్మికత కలిసినప్పుడు, ఈ తరహా మొక్కలు మన ఇంటిని ఒక శక్తిమంతమైన శ్రేయస్సు కేంద్రంగా మారుస్తాయి. ఒక చిన్న మొక్క పెట్టడమే కాదు, దానిపై శ్రద్ధ చూపించి, నమ్మకంతో పెంచినప్పుడు దాని ప్రభావం మరింత గొప్పగా ఉంటుంది.
ఇంట్లో ప్రశాంతత, ఆనందం, ఆర్థిక శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ వాస్తు చిట్కాలను పరిశీలించాలి. మీ ఇంటి గుమ్మానికి సరైన మొక్కను ఎంచుకుని మంచి మార్పు తీసుకురావచ్చు.