Dream: శనికి సంబంధించి ఈ కలలు వస్తున్నాయా? వాటి అర్థం ఏంటో తెలుసా?
Dream: శని గ్రహం పేరు వింటేనే చాలా మంది భయపడతారు. కానీ, శని దేవుడి దయ పొందితే ఊహించని శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. శని దేవుడు ప్రసన్నంగా ఉన్నప్పుడు ఎలాంటి కలలు వస్తాయో ఇప్పుడు చూద్దాం

శని దేవుడు..
జోతిష్యశాస్త్రంలో శనిని న్యాయ దేవతగా పరిగణిస్తారు. అంటే.. మనం చేసే తప్పులకు శిక్ష విధించేవాడు. అందుకే శని అనగానే చాలా మంది భయపడతారు. కానీ.. మన మంచి కర్మలకు శని అంతే శుభ ఫలితాలను కూడా అందించగలడు. శని మనం చేసే పనులకు సంతోషంగా ఉన్నప్పుడు కలల రూపంలో కొన్ని శుభ సంకేతాలు పంపుతాడు.
నల్ల కుక్కతో ఆడుకోవడం...
మీరు కలలో నల్ల కుక్కతో ఆడుకుంటున్నట్లు , ఆ కుక్క చాలా సంతోషంగా ఉన్నట్లు కల వస్తే.. శని దేవుడి ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థం. అలాంటి కల తర్వాత మీ జీవితంలోని చాలా సమస్యలు తీరిపోతాయి. మీ సంపద, శ్రేయస్సు కూడా పెరుగుతాయి.
ఏనుగు మీద స్వారీ చేయడం
స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో శని దేవుడు ఏనుగుపై స్వారీ చేస్తున్నట్టు కనిపిస్తే అది శుభసూచకం. మీ పనులతో శని దేవుడు సంతోషంగా ఉన్నాడని, మీకు శుభ ఫలితాలు ఇస్తాడని ఈ కల అర్థం. మీ జీవితంలో సంతోషం, శ్రేయస్సు వస్తాయి.
కలలో శివలింగం చూడటం
శివలింగం శివుడికి సంబంధించింది అయినా, కలలో కనిపిస్తే శివుని పరమ భక్తుడైన శని దేవుడి అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఇలాంటి కల మీకు ఆరోగ్యం, శ్రేయస్సును తెస్తుంది. మీ కుటుంబ జీవితంలో కూడా శుభ ఫలితాలు పొందుతారు.
కలలో శని దేవాలయం
కలలో శని దేవుడి ఆలయాన్ని చూడటం కూడా శుభ సంకేతంగా భావిస్తారు. శని దేవుడి ఆలయం కలలో కనిపిస్తే మీ కెరీర్, ఆర్థిక విషయాల్లో అనుకూల మార్పులు వస్తాయి.
శనిదేవుడిని ఆశీర్వాద భంగిమలో చూడటం
శని దేవుడు ఆశీర్వదిస్తున్నట్టు కలలో కనిపిస్తే మీ అదృష్టం మారబోతోందని అర్థం. మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి, ప్రతి విషయంలోనూ అనుకూల ఫలితాలు పొందుతారు.

