- Home
- Astrology
- February Horoscope: ఫిబ్రవరిలో అద్భుతంగా కలిసొచ్చేది ఈ మూడు రాశులకే.. నెలంతా తిరుగుండదు..!
February Horoscope: ఫిబ్రవరిలో అద్భుతంగా కలిసొచ్చేది ఈ మూడు రాశులకే.. నెలంతా తిరుగుండదు..!
February Horoscope: ఫిబ్రవరిలో కుంభరాశిలో అంగారకుడు, సూర్యుడు కలవనున్నారు. ఈ కలయిక మూడు రాశుల జీవితాలను అద్భుతంగా మార్చనుంది. ముఖ్యంగా కెరీర్ పరంగా అద్భుతమైన అవకాశాలు పొందుతారు. ఆదాయం కూడా పెరుగుతుంది.

February Horoscope
జోతిష్యశాస్త్రంలో సూర్యుడు గౌరవం, ప్రతిష్ఠ, పరిపాలనా, ఆత్మ గౌరవం, ప్రభుత్వ ఉద్యోగం, పితృత్వానికి కారకంగా భావిస్తారు. మరోవైపు అంగారకుడు ధైర్యం, పరాక్రమం, ఆస్తి, అభిరుచి, ఉత్సాహం, వీరత్వం, కోపాన్ని సూచిస్తాడు. ఈ రెండు గ్రహాల అరుదైన కలయిక ఫిబ్రవరిలో కుంభ రాశిలో జరగనుంది. ఈ కలయిక మూడు రాశుల జీవితాన్ని పూర్తిగా మార్చనుంది. ఇప్పటి వరకు పడిన ఆర్థిక నష్టాలు మొత్తాన్ని పూడ్చనుంది. మరి, ఆ మూడు రాశులు ఏంటో చూద్దామా..
వృషభ రాశి...
కుంభ రాశిలో సూర్యుడు, అంగారకుడి కలయిక వృషభ రాశివారికి అనుకూల ఫలితాలు తీసుకురాగలదు. ఈ కలయిక మీ రాశిలో కెరీర్, వ్యాపారానికి సంబంధించిన స్థానంలో ఏర్పడుతుంది. అందువల్ల, ఈ సమయంలో మీరు మీ పని, వ్యాపారంలో అద్భుతమైన విజయాలను పొందుతారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వారికి ఎక్కువ లాభాలు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ రావచ్చు. అంతేకాదు.. ఈ సమయంలో సొంత ఇల్లు, లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
కుంభ రాశి...
కుంభ రాశిలో సూర్యుడు, అంగారకుడి కలయిక కుంభ రాశి వారి జీవితంలో సానుకూల ఫలితాలను తీసుకువస్తుంది.ఈ సమయంలో మీరు కొత్త వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకుంటారు. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ గౌరవ, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో మీరు ఒత్తిడి, ఆందోళనల నుండి విముక్తి పొందుతారు. వైవాహిక జీవితం కూడా ఆనందంగా సాగుతుంది.
ధనుస్సు రాశి...
కుంభ రాశిలో సూర్యుడు, అంగారకుడి కలయిక ధనుస్సు రాశి వారికి మరింత ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. మీ బ్యాంకు బ్యాలెన్స్ అకస్మాత్తుగా పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో లాభాలు సంపాదించడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీకు మీ తోబుట్టువుల నుండి కూడా సపోర్ట్ లభిస్తుంది. మీ ఆదాయం, లాభాల స్థానంలో కుజుడు , సూర్యుడి కలయిక ఏర్పడుతోంది. ఇది మీకు కొత్త ఆదాయ మార్గాలను తెరిచే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి జీతాల పెంపు, పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఆకస్మిక లాభాలకు బలమైన సూచనలు ఉన్నాయి. పెట్టుబడులు మంచి రాబడి అందిస్తాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు

