ప్రేమ ఫలితం: ఓ రాశి వారు ప్రియమైన వారితో ఇంకా ఎక్కువ సమయం మాట్లాడుతారు
ప్రేమ జీవితం ప్రకారం.. ఓ రాశివారికి ఈ వారం సమయం చాలా బాగుంటుంది. ఇది మీ ప్రేమ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో గ్రహాల శుభ స్థితి మీ ప్రేమ జీవితానికి అనువైన స్థానమని చెప్పొచ్చు.

telugu astrology
మేషరాశి
ఈ వారం మీకు, మీ ప్రియమైన వ్యక్తికి మధ్య సామరస్యం మెరుగుపడుతుంది. దీంతో మీ పవిత్ర సంబంధంలో వచ్చే అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీ ప్రియమైన వారితో మరిచిపోలేని సమయాన్ని గడుపుతారు. ఈ వారం పనిప్లేస్ లో అన్ని ఇబ్బందులను ఇంటికి వచ్చిన వెంటనే మర్చిపోతారు. ఎందుకంటే ఈ సమయంలో మీ బిడ్డ లేదా జీవిత భాగస్వామి నవ్వు ముఖం మిమ్మల్ని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే ఇలాంటి సందర్భంలో మీరు ఇంట్లో వారితో కొంత సమయం గడపాలని కూడా కోరుకుంటారు.
telugu astrology
వృషభం
మీరు, మీ ప్రేమికుడు వేర్వేరు నగరాల్లో నివసిస్తుంటే.. ఈ వారం మీరిద్దరూ ఫోన్‌లో లేదా ఇతర సోషల్ మీడియాలో రోజూ కంటే ఎక్కువగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఈ వారం మీరు మీ అత్తమామలతో ఆనందంగా ఉంటారు. దీనివల్ల మీ భాగస్వామి కూడా చాలా సంతోషంగా కనిపిస్తారు. అలాగే అత్తమామలలో మీ గౌరవం పెరగడంతో పాటుగా మీ వైవాహిక జీవితంలో కూడా ఆనందం ఉంటుంది.
telugu astrology
మిధునరాశి
మీ ప్రియమైన వ్యక్తి ముందు మీరు ఓడిపోయినందుకు ఎప్పుడూ కలత చెందుతారు. అయితే ఈ వారం మీరు ఈ విషయంలో ఉదారంగా ఉండకూడదు. ఎందుకంటే ప్రతిసారి మీరే తలొగ్గడం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. మీ ప్రేమను వారు అర్థం చేసుకోవాలి. ఈ వారం మీ అత్తమామల కారణంగా మీ జీవిత భాగస్వామితో వాగ్వాదం జరగొచ్చు. అయితే వారం చివరికల్లా ఆ వివాదం పోతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. మంచి సమయం కోసం వేచి ఉండండి.
telugu astrology
కర్కాటక రాశి
మిగతావాళ్లు మీలా ఉండటానికి, ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. మీరు మంచివారు అని అనుకుంటారు. ఇకపోగే మీ ప్రేమ వ్యవహారాలలో కూడా మీరు ఈ వారం కూడా అలాంటిదే చేస్తారు. ఇది మీ ప్రేమికుడికి కోపం తెప్పించొచ్చు. మీ ఇద్దరి మధ్య పనికిరాని వాదనలకు దారితీయొచ్చు. ఈ వారం చాలా మంది వివాహితుల జీవితంలో అత్యంత కష్టతరమైన సమయం. ఎందుకంటే ఈ సమయంలో ముఖ్యంగా వివాహితలు తమ వైవాహిక జీవితాన్ని విస్తరించుకునే సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
telugu astrology
సింహ రాశి
ఆ రాశి వారు ఈ సమయంలో కాస్త గందరగోలంగా ఉంటారు. ఇలాంటి సమయంలో మీరు సానుకూల ఆలోచనలు మాత్రమే చేయాలి. పెళ్లికి ముందు ఉన్న అందమైన జ్ఞాపకాలు ఈ వారం మీ వైవాహిక జీవితాన్ని రిఫ్రెష్ చేయగలవు. భాగస్వామితో సరసాలాడటం, లాంగ్ డ్రైవ్ కు వెళ్లడం, మీ భాగస్వామికి లవ్ ప్రపోజ్ చేయడం వంటి జ్ఞాపకాలు మిమ్మల్ని అందమైన వ్యక్తికి చేరువ చేయడంలో సహాయపడతాయి. మీ ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది.
telugu astrology
కన్యరాశి
ఈ వారం మీ మనస్సులో మానసికంగా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఇది మిమ్మల్ని కలవరపెట్టడమే కాకుండా మీ ప్రియమైన వ్యక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి వీలైతే వారితో కలిసి లాంగ్ ట్రిప్ వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. ఇది ఒకరికొకరు సన్నిహితంగా ఉండటానికి, సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి సహాయపడుతుంది. మీరు మీ వైవాహిక జీవితంలో స్థిరత్వం కోసం ప్రయత్నిస్తున్నట్టైతే ఈ వారం అలాంటి అనేక పరిస్థితులు తలెత్తుతాయి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో స్థిరత్వాన్ని తీసుకురాలేనప్పుడు మీరు కలత చెందుతారు. అయితే మీ జీవిత భాగస్వామిపై మీ కోపాన్నితగ్గించుకునే అవకాశం ఉంది.
telugu astrology
తులారాశి
మీరు, లవర్ వేర్వేరు నగరాల్లో నివసిస్తుంటే.. మీరు ఒంటరిగా ఫీలవుతారు. వారిని తెగ మిస్ అవుతారు. అందుకే ఈ వారం మీరు ఇతర సమయాల్లో కంటే ఇంకా ఎక్కువ సేపు మాట్లాడుకుంటారు. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇకపోతే పెళ్లైన జంటల మధ్య బంధం బలపడుతుంది.
telugu astrology
వృశ్చిక రాశి
ఈ వారం ప్రేమలో ఉన్న వారు తమ ప్రేమను బిడియం లేకుండా వ్యక్తపరుస్తారు. మీ ప్రేమలోని రసాన్ని కరిగించడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో మీ ప్రియమైనవారు తన మధురమైన మాటలతో మీ హృదయాన్ని సంతోషపరుస్తారు. ఈ వారం మీ ప్రేమ రెట్టింపు అవుతుంది. వైవాహిక జీవితంలోని ఆనందం ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. అందుకే మీకు మీకు సమయం దొరికినప్పుడల్లా మీ భాగస్వామితో గడుపుతారు.
telugu astrology
ధనుస్సు రాశి
ఈ వారం ఒంటరిగా ఉన్నవారు ప్రేమ కోసం ఎవరినైనా గుడ్డిగా నమ్మే అవకాశం ఉంది. దీని వల్ల తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఈ వారం మీరు శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ వారం మీరు మీ వైవాహిక జీవితంలో కొన్ని ప్రతికూల ఫలితాలను పొందొచ్చు. కానీ చెడు పరిస్థితుల నుంచి పారిపోవడం వాటి పరిష్కారం కాదని అర్థం చేసుకోవాలి.
telugu astrology
మకరరాశి
ఈ వారం మీ రొమాంటిక్ మూడ్‌లో ఆకస్మిక మార్పు మిమ్మల్ని చాలా విచారంగా, కలత చెందేలా చేస్తుంది. కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రించేటప్పుడు, భావోద్వేగాలలో మిమ్మల్ని మీరు ఎక్కువగా కోల్పోకండి. లేదంటే అది మీ జీవితంలోని ఎన్నో రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ వారం వైవాహిక జీవితంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా మీరు మానసిక ఆనందాన్ని వెతుక్కుంటూ మీ జీవిత భాగస్వామి కాకుండా వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. లేదంటే మీ వైవాహిక జీవితం ప్రభావితం అవుతుంది.
telugu astrology
కుంభ రాశి
మీ రాశిచక్రం ప్రేమికులకు ఈ సమయం చాలా బాగుంటుంది. ఇది మీ ప్రేమ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో గ్రహాల శుభ స్థితి మీ ప్రేమ జీవితానికి అనువైన స్థానమని చెప్పొచ్చు. ఈ రాశికి చెందిన కొంతమంది వివాహితులు ఈ వారం తమ జీవిత భాగస్వామితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఇది సంబంధానికి కొత్తదనాన్ని తెస్తుంది. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మతపరమైన స్థలాన్ని కూడా సందర్శించే అవకాశం ఉంది.
telugu astrology
మీనరాశి
ఈ వారం మీ స్వభావం ఉల్లాసంగా ఉంటుంది. అయితే మీకు ఇష్టం లేకపోయినా మీ ప్రియమైన వారితో గతంలో ఉన్న కొన్ని విభేదాలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు సాధారణం కంటే మీ భాగస్వామి అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం ఎక్కువ ఇబ్బంది పడుతారు. ఇలాంటి సందర్భంలో మీ నియంత్రణను కోల్పోవడం వల్ల మీ మధ్య సంఘర్షణను మరింత పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి చిన్న కోరికలు, విషయాలను విస్మరిస్తారు. ఈ వారం మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి.