మీనరాశివారితో ప్రేమలో పడ్డారా? అయితే ఏ రాశివారికి ఎలా ఉంటుందంటే..
మీనం రాశిచక్రంలో పన్నెండోది, చివరి రాశి. ఇది దాని ముందు ఉన్న 11 రాశి చక్రాలకున్న అన్ని విభిన్న లక్షణాలను తీసుకుంటుంది. మీనరాశి అన్నింటిలోనూ సంతోషకరమైనది, మీనరాశివారు నిజంగా నిస్వార్థంగా ఉంటారు. ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. ఆధ్యాత్మికం, శాంతి, సామరస్యాన్ని కనుగొనే అంతర్గత ప్రయాణంపై చాలా దృష్టి పెడతారు. ఇన్ని లక్షణాలున్న మీనరాశితో మిగతా రాశివారికి ప్రేమ ఎలా ఉంటుందో చూస్తే..

Aries Zodiac
మేషరాశితో మీనం
ప్రేమలో వీరు చాలా ఉన్నతంగా, అనుకూలంగా ఉంటారు. మేషరాశి బలమైన భాగస్వామిగా ఉంటుంది. తన భాగస్వామిపట్ల శ్రద్ధ ప్రేమ ఎక్కువగా చూపిస్తారు. దీనికి వల్ల మీనరాశివారు వీరివైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. వీరికి ఎక్కువగా పొగుడుతారు. ఇదే వీరిద్దరి మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందించి.. జీవితంలో ఆ మెరుపును సజీవంగా ఉంచుతుంది.
మొత్తం : 4
సెక్స్ : 5
ప్రేమ : 4
కమ్యూనికేషన్ : 3
Taurus Zodiac
వృషభరాశితో మీనరాశి
ఈ రాశుల వారిద్దరూ ఒకరినొకరు నిజంగా అర్థం చేసుకుంటారు. అందుకే వీరి జంటను చూసి అసూయపడుతుంటారు. ప్రతీ చిన్న విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు. ఆరాధిస్తారు. ఎంజాయ్ చేస్తారు. మరపురాని అనుభూతిని కలిగించడానికి ప్రయత్నిస్తారు. ఈ రెండు రాశులు శృంగారభరితమైనవి. అత్యంత తెలివైనవి. సెక్స్‌కు ముందు మానసికంగా ఉత్సాహంగా ఉండడం వీరికి చాలా ముఖ్యం.
మొత్తం : 5
సెక్స్ : 4
ప్రేమ : 5
కమ్యూనికేషన్ : 4
Gemini Zodiac
మిధునరాశితో మీనం
సృజనాత్మకత, కళ, సంస్కృతిపై ఇద్దరికీ ఆసక్తి ఉన్నందున వారి మధ్య పరస్పర ఆసక్తికి సంబంధించిన మెరుపు కనిపిస్తుంది. కానీ వీరిద్దరూ కలిసే అవకాశాలు చాలా తక్కువ. సంబంధం బాగుంటుంది. భవిష్యత్తులో చాలా సంతృప్తికరంగా ఉంటారు. మొత్తంమీద, వారు మాట్లాడుకోవడం, పరస్పరం క్షమించుకోవడం, రాజీ పడడం నేర్చుకోవాలి. లేకుంటే వారి ప్రేమ విచారాంతం అవుతుంది.
మొత్తం : 4
సెక్స్ : 2
ప్రేమ : 4
కమ్యూనికేషన్ : 4
కర్కాటక రాశితో మీనం
వీరిద్దరి మధ్య సంబంధం నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. ప్రేమా, దోమా అనే వాటిమీద.. సడెన్ భావోద్వేగాల మీద వీరికి సరైన అభిప్రాయం ఉండదు. ప్రేమ సంబంధిత రిలేషన్స్ విషయంలో చాలా పికీగా ఉంటారు. అందుకే అంత తొందరగా ప్రేమలో పడరు. కానీ నమ్మితే.. ప్రాణాలిస్తారు.
మొత్తం : 4
సెక్స్ : 4
ప్రేమ : 3
కమ్యూనికేషన్ :3
Leo
సింహరాశితో మీనం
జంటగా వీరు చాలా బాగుంటారు. వీరి లక్షణాలు విచిత్రంగా ఉంటాయి. ఆధ్యాత్మికతో, మాయో తెలియని అంశాలు వీరిలో కనిపిస్తాయి. ఒకరినొకరు విశ్వసించే విషయంలో వీరికి అనేక అనుమానాలుంటాయి. అర్థం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. మొత్తంమీద, సంబంధం వారికి సంతృప్తికరంగానే ఉంటుంది.
మొత్తం : 4
సెక్స్ : 3
ప్రేమ : 4
కమ్యూనికేషన్ : 3
Virgo Zodiac
కన్యారాశితో మీనం
ప్రేమలో, చాలా శృంగారభరితంగా ఉంటారు. మొత్తంగా కాకపోయినా ప్రారంభంలోనైనా సరే. ఇద్దరూ సమానం కాకపోవడాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకరికొకరు సలహాలు, సూచనలు ఇచ్చుకుంటారు. ఒకరిమీద ఒకరికి ఆసక్తిని కలిగి ఉంటారు. భావోద్వేగాలు బలంగా ఉండవచ్చు, దీనివల్ల లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. మొత్తంమీద, అపార్థాలు, పరస్పర వాదనలు మామూలే.
మొత్తం : 3
సెక్స్ : 3
ప్రేమ : 3
కమ్యూనికేషన్ : 2
Libra Zodiac
మీనరాశి తులారాశి
ఇద్దరూ పెద్ద రొమాంటిక్స్, కాబట్టి వారి డేటింగ్ రోజులు అసాధారణంగా ఉంటాయి. మీనం అద్భుతమైన కలలు కంటారు. తమ భాగస్వామిని ఆదర్శంగా తీసుకుంటారు. తమ బంధానికంటే ముందున్న విషయాల్ని పట్టించుకోవద్దనుకుంటారు. జీవితాంతం కలిసి ఉండాలనుకుంటారు.
మొత్తం : 3
సెక్స్ : 4
ప్రేమ : 3
కమ్యూనికేషన్ : 3
Scorpio Zodiac
మీన రాశి వృశ్చిక రాశి
ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వీరికి మాటలు అక్కర్లేదు. ఇద్దరూ సామరస్యపూర్వకంగా ఉంటారు. కలిసి ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. విశ్వసనీయతను కొనసాగిస్తూ ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటారు., వృశ్చికం కొన్నిసార్లు చిరాకు, షార్ట్ టెంపర్ కలిగి ఉంటుంది. అయితే మీనరాశి వారు.. కోపం వల్ల ఎక్కువ నష్టం కలగకుండా కూల్ చేస్తారు.
మొత్తం : 5
సెక్స్ : 5
ప్రేమ : 4
కమ్యూనికేషన్ : 4
Sagittarius Zodiac
ధనుస్సు రాశితో మీనం
పరస్పర శారీరక ఆకర్షణతో వీరి ప్రేమ మొదలవుతుంది. కానీ తరువాత మానసికానుబంధంగా బలపడుతుంది. శృంగారంలో అనివార్యంగా తార్కిక ముగింపుకు వెడతారు. దీనివల్ల ఒకరి విశ్వసనీయత మీద అనుమానాలు మొదలవుతాయి. అందుకే వీరి బంధంలో స్థిరత్వం, నమ్మకం ఉండవు.
మొత్తం : 3
సెక్స్ : 4
ప్రేమ : 3
కమ్యూనికేషన్ : 2
Capricorn Zodiac
మీనరాశి మకరరాశి
వీరిద్దరి మధ్య ప్రేమ చిన్నపాటి ఆప్యాయతతో మొదలవుతుంది. మీనం శృంగార స్వభావం కలిగి ఉంటుంది. అందుకే మనసుకు నచ్చే బహుమతులు, డేట్ లతో తమ ప్రియమైన వారిని ఆశ్చర్యపరిచేందుకు ప్రయత్నిస్తుంది. ఇక మకరరాశి బాధ్యతాయుతంగా ఉంటుంది కాబట్టి.. తమ భాగస్వామిని విలాసవంతమైన, ఖరీదైన ఆశ్చర్యాలతో ఆశ్చర్యపరుస్తుంది.
మొత్తం: 5
సెక్స్: 4
ప్రేమ: 5
కమ్యూనికేషన్: 4
Aquarius
కుంభరాశితో మీనం
జంటగా వారు ఒకరినొకరు ఇష్టపడతారు. ఒకరికొకరు గుర్తింపు ఉంటుంది. శృంగార కోర్ట్‌షిప్ ఇద్దరినీ ఆకర్షిస్తుంది. వారు ఇతరులను హృదయపూర్వకంగా ఆరాధిస్తారు. కుంభరాశివారి జీవితంలో అనేక ఆసక్తి కర అంశాలుంటాయి. ఇవి మీనరాశివారిని ఆకట్టుకుంటాయి.
మొత్తం: 4
సెక్స్: 4
ప్రేమ: 3
కమ్యూనికేషన్: 3
Pisces Zodiac
మీనరాశితో మీనం
జంటగా, వారు సానుకూల లక్షణాలను, లోపాలను చూస్తారు. కానీ వాటిని పెద్దగా పట్టించుకోరు. ఆధ్యాత్మిక ఆసక్తి కలిగి ఉంటారు, కాబట్టి అందం, సౌందర్యం, అనేక రకాల సృజనాత్మకతపై ఆసక్తిని కలిగి ఉంటారు. మొత్తంమీద, వారు తరచుగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.
మొత్తం : 4
సెక్స్ : 4
ప్రేమ : 5
కమ్యూనికేషన్ : 4