Astrology: మార్చి 28 నుంచి ఈ రాశుల వారి జీవితాలు మారిపోనున్నాయి.. ఊహకందని మార్పు ఖాయం.
బుధ, రాహువులు మనిషి జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతాయని పండితులు చెబుతుంటారు. వీటిలో వచ్చే మార్పులు పలు రాశులపై ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ రెండు గ్రహాలు కలవనున్నాయి. దీనినే జ్యోతిష్య శాస్త్రంలో యుతిగా చెబుతుంటారు. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు జరుగనున్నాయని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బుధ, రాహువులు కలవడాన్ని బుధ రాహువుల యుతిగా చెబుతుంటారు. ఈ నెల 28వ తేదీ (శుక్రవారం)న ప్రారంభమై మే 6వ తేదీ వరకు కొనసాగుతుంది. దీని కారణంగా వృషభం, కన్య, మిథునం, మకరం, ధనుస్సు, కుంభం వంటి రాశులపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది. ఇంతకీ బుధ రాహువుల యతి కారణంగా ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

మకరం:
బుధ రాహువుల యుతి కారణంగా మకర రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికంగా బలోపేతమవుతారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వివిధ ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఉద్యోగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. దీంతో మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా రాణిస్తారు.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో బుధ రాహువుల యుతి జరగనుంది. దీంతో ఉద్యోగ జీవితంలో రాణిస్తారు. సరికొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఆస్తి వ్యవహారాలను చక్క బెట్టుకుంటారు. పోటీదారుల నుంచి వచ్చే పోటీని తట్టుకొని మీమీ రంగాల్లో నిలబడతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు.

వృషభం:
వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగపరంగా కలిసొస్తుంది. ఉన్నత స్థానాలకు చేరుకునే క్రమంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో కొత్త మార్పులు, పద్ధతులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఆర్థికంగా బలోపేతమవుతారు. ఆదాయ మార్గాలు ఎక్కువవుతాయి.

కుంభం:
ఈ రాశి వారికి ధన స్థానంలో బుధ రాహువుల కలయిక జరగనుంది. దీంతో వీరు ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక మార్గాలను అనుసరిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో వీరిది పైచేయి ఉంటుంది. విదేశీ ప్రయాణం సాకారమవుతుంది. ఎన్నో రోజుల నుంచి ఉన్న కోరికలు ఫలిస్తాయి.

మిథున రాశి:
దహమంలో బుధుడు, రాహువు కలయిక ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఎదుగుదల కనిపిస్తుంది. సొంతంగా ఏదైనా స్థాపించాలన్న ఆశ నెరవేరుతుంది. విదేశీ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొత్త పద్ధతులు నేర్చుకోవడం ద్వారా ఆర్థికంగా లాభపడుతారు.

కన్య:
వీరికి సప్తమ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో రాహువు కలయిక ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం సాధించాలన్న కోరిక నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గుర్తించాలి.

