MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac signs: ఒకే రాశిలోకి బుధ, శుక్ర గ్రహం కలయిక...మూడు రాశులకు అష్ట ఐశ్వర్యాలు

Zodiac signs: ఒకే రాశిలోకి బుధ, శుక్ర గ్రహం కలయిక...మూడు రాశులకు అష్ట ఐశ్వర్యాలు

బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో సంచరించనున్నాయి. దీని వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 09 2025, 07:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
zodiac signs
Image Credit : Asianet News

zodiac signs

జోతిష్యశాస్త్రంలో గ్రహాలు తరచూ మారుతూ ఉంటాయి. ఒక్కో గ్రహానికి ఒక్కో కాల పరిమితి ఉంటుంది. వాటి ప్రకారం అవి రాశులను మార్చుకుంటూ ఉంటాయి. ఒక్కోసారి గ్రహాలు అనుకోకుండా.. ఒకే రాశిలోకి అడుగుపెడతాయి. ఇలా రెండు, మూడు గ్రహాల కలయిక కారణంగా యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. త్వరలో బుధ, శక్ర గ్రహాలు ఒకే రాశిలో కలవనున్నాయి.

జోతిష్యశాస్త్రంలో బుధుడుని గ్రహాలకు అధిపతిగా, శుక్రుడిని అత్యంత శుభ ప్రదమైన గ్రహంగా పరిగణిస్తారు. శుక్రుడు శుభస్థానంలో ఉన్నప్పుడు విలాసవంతమైన జీవితం, ఆనందం లభిస్తాయి. బుధుడు జాతకంలో అనుకూలంగా ఉన్నప్పుడు ఉద్యోగాల్లో పురోగతి, వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. ఈ రెండు గ్రహాలు శుభ స్థానంలో కలిస్తే.. అదృష్టం, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. ఈ అరుదైన కలయిక ఆగస్టు 21న ఏర్పడనుంది. బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో సంచరించనున్నాయి. దీని వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. మరి, ఈ సంచారం ఏయే రాశులకు లాభం కలిగించనుందో తెలుసుకుందామా...

24
తుల రాశి..
Image Credit : Asianet News

తుల రాశి..

తుల రాశి వారికి ఈ లక్ష్మీ నారాయణ యోగం చాలా బాగా కలిసొస్తుంది. ఈ యోగం కారణంగా తుల రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు కలిగే అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడులకు లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో భార్యభర్తల మధ్య సంబంధాలు మెరుగౌతాయి. మీ జీవిత భాగస్వామి నుంచి విలువైన బహుమతులు లభించవచ్చు. ఆర్థిక సమస్యలతో ఉన్న వారికి తోబుట్టువుల సహాయం అందుతుంది. కెరీర్ లో మంచి అవకాశాలు, మార్కెట్ లో పెట్టుబడుల ద్వారా గణనీయమైన ఆదాయం లభించే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Birth Date: ఏ తేదీల్లో పుట్టిన వారి మైండ్ సైట్ ఎలా ఉంటుందో తెలుసా?
Related image2
Zodiac signs: ఈ రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి..!
34
కర్కాటక రాశి...
Image Credit : Asianet News

కర్కాటక రాశి...

కర్కాటక రాశి వారికి కొత్త ఆదాయ వనరులు లభించే సమయం ఇది. కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు వస్తాయి. ఉద్యోగ మార్పులు కోరుకునే వారికి ఇది శుభఫలితాలను అందిస్తుంది. భార్యతో కలిసి వ్యాపారం విస్తరించే అవకాశముంది. ప్రయాణాలు, కొత్త ప్రణాళికలు, విశ్వాసం పెరగడం వంటి అనేక శుభప్రద ఫలితాలు లభిస్తాయి.

44
కుంభ రాశి...
Image Credit : Asianet News

కుంభ రాశి...

కుంభరాశి వారికి ఈ యోగం ఆస్తుల విషయంలో ప్రయోజనాలు అందిస్తుంది. కొత్త ఆదాయ వనరులు, ఆర్థిక లాభాలు వేగంగా లభిస్తాయి. కొత్త ప్రణాళికలు, పెద్ద పెట్టుబడులతో వ్యాపారాల్లో విజయాలు సాధించవచ్చు. ఉద్యోగ అవకాశాలు లభించడం, కుటుంబంతో ప్రయాణాలు చేయడం వంటి సానుకూల ఫలితాలు కలుగుతాయి.

ఈ విధంగా, లక్ష్మీనారాయణ రాజయోగం ఈ మూడు రాశుల వారికి ఆర్థిక, వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో శుభప్రదమైన మార్పులను తీసుకువస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నిరుద్యోగులకు మంచి అవకాశాలు!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారికి ఈ రోజు అప్పుల బాధ నుంచి ఉపశమనం
Related Stories
Recommended image1
Birth Date: ఏ తేదీల్లో పుట్టిన వారి మైండ్ సైట్ ఎలా ఉంటుందో తెలుసా?
Recommended image2
Zodiac signs: ఈ రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved