Birth Date: ఏ తేదీల్లో పుట్టిన వారి మైండ్ సైట్ ఎలా ఉంటుందో తెలుసా?
మనం పుట్టిన తేదీ ఆధారంగా మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో న్యూమరాలజీ క్లియర్ గా తెలియజేస్తుంది..

Birth date
న్యూమరాలజీ మన భవిష్యత్తు మాత్రమే కాదు... మన వ్యక్తిత్వం, మన ఆలోచనా విధానం, మన ఆర్థిక ప్రవర్తన, సంపాదన పట్ల మన దృక్పథాన్ని కూడా తెలియజేస్తుంది. మనం పుట్టిన తేదీ ఆధారంగా ఈ విషయాలను తెలియజేస్తుంది. మరి, మనం పుట్టిన తేదీ ఆధారంగా మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసుకుందామా..
నెంబర్ 1..
ఏ నెలలో అయినా 1, 10, 29, 28 తేదీల్లో పుట్టిన వారు నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారు బాస్ మెంటాలిటీ కలిగి ఉంటారు. వీరిలో సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు చాలా స్వతంత్రంగా ఎవరి మీదా ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు. అందరి మీదా పెత్తనం చేయడంలో వీరు ముందుంటారు. వీరు వ్యాపారంలో బాగా రాణించగలరు. కెరీర్ లోనూ మంచి స్థాయికి వెళతారు. ఆర్థిక సమస్యలు ఉండవు.
నెంబర్ 2...
ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారు నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టినవారి స్వభావం చాలా సున్నితంగా ఉంటుంది.
కలల లోకంలో విహరిస్తూ ఉంటారు. ఇతరులు బాధపడుతున్నా కూడా వీరు తట్టుకోలేరు. అందరితోనూ చాలా ప్రేమగా వ్యవహరిస్తారు.
నెంబర్ 3...
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 3 కిందకు వస్తుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి డబ్బు సంబంధిత సమస్యలు అస్సలు రావు. వీరికి ఎప్పుడూ అవసరానికి డబ్బు అందుతుంది. వీరి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. సమాజంలో అందరితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. చాలా చురుకుగా ఉంటారు. వీరి చేతిలో డబ్బు ఎప్పుడూ ఉంటుంది.
నెంబర్ 4...
ఏ నెలలో అయినా 4, 13, 31 తేదీల్లో పుట్టిన వారు నెంబర్ 4 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారికి కృషి, పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. సంపద మొదట్లో లేకపోయినా.. నెమ్మదిగా పెరుగుతుంది. వారి వయసు పెరుగుతుంటే..సంపద కూడా పెరుగుతుంది. కష్టపడి విజయం సాధించగలరు.
నెంబర్ 5..
ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. వీరు అనుకున్నది సాధించగలరు. విజయం కోసం ఎంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి అయినా వీరు వెనకాడరు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో వీరు ముందుంటారు.వీరు లైఫ్ లో మంచి స్థాయికి వెళ్లగలరు.
నెంబర్ 6...
ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 6 కిందకు వస్తారు. వీరికి భవిష్యత్తులో కూడా డబ్బు సమస్యలు రావు. అలా రాకుండా ఉండేందుకు ముందుగానే ప్రణాళిక వేసుకుంటారు. చాలా తెలివిగా ఆర్థిక ప్రణాళిక వేసుకుంటారు.
నెంబర్ 7..
ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 7 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి జ్ఞానం చాలా ఎక్కువ. వీరికి తెలివి తేటలు కూడా చాలా ఎక్కువ. వారి తెలివి తేటలతోనే ఎక్కువ డబ్బు సంపాదించగలరు. తెలివిగా పెట్టుబడులు పెట్టి.. మంచి లాభాలు పొందుతారు. వ్యాపార నిర్ణయాలు కూడా చాలా తెలివిగా తీసుకుంటారు.
నెంబర్ 8...
ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 8 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు పుట్టుకతోనే ఆర్థిక వ్యూహరచన చేయగల నిపుణులు. వీరు పెద్ద ఆర్థిక ప్రాజెక్టులను సక్సెస్ ఫుల్ గా నడిపించగలరు. మంచి భవిష్యత్తును పొందుతారు.