Astrology: సింహ రాశిలోకి కేతువు.. 3 రోజులు ఆగితే ఈ రాశుల వారి జీవితం మారుతుంది.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహు, కేతు పాపగ్రహాలుగా గుర్తిస్తారు. వీటిని శుభఫలితాల కంటే ఎక్కువగా కష్టాలను కలిగించేవిగా భావిస్తారు. ముఖ్యంగా కేతువు క్రూర స్వభావాన్ని కలిగిన గ్రహంగా పరిగణిస్తారు. కానీ ప్రతి ఒక్క జాతకంలోనూ ఇది ప్రతికూల ప్రభావాలే కలిగిస్తుందని చెప్పలేము. కొన్ని సందర్భాల్లో కేతువు శుభ ఫలితాలనూ ప్రసాదిస్తాడు.

2025 మే 18న కేతువు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది ఒక నెమ్మదిగా ప్రయాణించే గ్రహం. శనిగ్రహంలా దీని సంచార ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది. సింహరాశిలో కేతువు గమనం వృషభం, తులా, కర్కాటక రాశుల వారికి అనుకూలమైన ఫలితాలను ఇవ్వనుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు ఈ కాలంలో చేపట్టిన ఏ పని అయినా విజయవంతం కావచ్చు. ప్రత్యేకంగా ఆర్థిక రంగంలో శుభ ఫలితాలు కనిపిస్తాయి. వ్యాపారాలు, పెట్టుబడుల విషయంలో లాభాల అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అభివృద్ధి అవకాశం ఉంది. వచ్చే ఏడాదిన్నర కాలం వరకు ఇది అద్భుతమైన సమయం కావొచ్చు.
వృషభ రాశి:
వృషభరాశి జాతకులకు కేతువు రాశి మార్పు ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా మారుతుంది. ఈ సమయంలో ఊహించని ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కొత్త వస్తువులు, వాహనాలు, స్థిరాస్తుల కొనుగోలు అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావచ్చు. కెరీర్ అభివృద్ధిలో ఇది కీలక దశగా మారుతుంది.
Taurus - Vrushaba
తులా రాశి:
తులారాశి వారికి ఈ కేతు గమనం అదృష్టాన్ని తీసుకొస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. పెట్టుబడుల నుంచి లాభాలు చేకూరతాయి. ఉద్యోగాలలో అభివృద్ధి అవకాశాలు కనిపిస్తాయి. సమాజంలో గౌరవం, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఈ కాలం విజయాల సమయంగా నిలుస్తుంది.