Lakshmi Rajayoga: కళా లక్ష్మీ రాజయోగంతో ఈ 3 రాశులకు విపరీతంగా ధన సూచన
Lakshmi Rajayoga: కళా లక్ష్మీ రాజయోగం ఎంతో కలిసివస్తుంది. ఆగస్టు 1న ఈ రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశించడం వల్ల అక్కడే ఉన్న బుధుడితో కలయిక ఏర్పడుతుంది. దీని వల్లే కళా లక్ష్మీ రాజయోగం ఏర్పడి 3 రాశులకు కలిసివస్తుంది.

వృషభ రాశి
వృషభ రాశి అధిపతి శుక్రుడు. కళా లక్ష్మీ రాజయోగం ఈ రాశి వారికి బాగా కలిసివస్తుంది. ఈ యోగం వల్ల వీరికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. చాలా కాలంగా ఉన్న మానసిక ఆందోళనలు తొలగిపోతుంది. జీవితంలో స్పష్టత వస్తుంది. ఈ రాశి వారి ముఖంలో కొత్త కళ ఏర్పడుతుంది. దంపతుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పెళ్లి ఆలస్యం అవుతున్న వారికి మంచి సంబంధాలు వస్తాయి.
మిథున రాశి
మిథున రాశికి అధిపతి బుధుడు. శుక్ర సంచారం వల్ల ఏర్పడే కళా లక్ష్మీ రాజయోగం మిథున రాశికి స్వర్ణయుగమే అని చెప్పాలి. చేస్తున్న ఉద్యోగం లేదా వ్యాపారాల్లో ఊహించని పురోగతి కనిపిస్తుంది. కొన్నేళ్లుగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈ రాశివారి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఈ రాశి వారికి తండ్రి వైపు నుంచి పూర్తి మద్దతు వస్తుంది. ఆస్తి సంబంధిత లాభాలు కలిగే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ కళా లక్ష్మీ రాజయోగం బాగా కలిసివస్తుంది. వీరు చేస్తున్న వృత్తిలో కలిసివస్తుంది. సమాజంలో హోదాను, డబ్బు రాబడిని పెరుగుతుంది. చేస్తున్న ఉద్యోగంలో కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. అలాగే జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. చాలా రోజులుగా కొనాలనుకుంటున్న విలాసవంతమైన వస్తువులు కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో స్నేహితులు, సోదరుల నుంచి ఊహించని సహాయం అందుతుంది.

