Jupiter Transit: మిథున రాశిలోకి గురువు.. ఈ 5 రాశుల పంట పండినట్లే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పులు, కదలికల ద్వారా వ్యక్తుల జీవితంలో ఏం జరుగబోతుందో ముందుగా తెలుసుకోవచ్చు. జ్యోతిష్యం ప్రకారం త్వరలో గురువు మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావం 5 రాశులకు శుభ ఫలితాలు ఇవ్వనుంది. వారి జీవితంలో ఊహించని అదృష్టాన్ని మోసుకురానుంది. మరి ఆ రాశులెంటో తెలుసుకుందామా..

వృషభ రాశి
మే 25న గురువు మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల వృషభ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిత్వాన్ని మరింత తీర్చిదిద్దుకుంటారు. గురువు దృష్టి వృషభ రాశి వారి గౌరవాన్ని పెంచుతుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి గురువు రాశి మార్పు.. సంతోషాలను తెస్తుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం దక్కుతుంది. గురువు ప్రభావం వల్ల క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ధనుస్సు రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనుస్సు రాశి వారికి ఈ నెల చాలా కలిసివస్తుంది. ఊహించని అదృష్టం వారి వెంటే ఉంటుంది. పాత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థికంగా బలపడుతారు. ఇంటా, బయట సంతోషం వెల్లివిరుస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి గురు సంచారం మేలు చేస్తుంది. ఈ రాశి వారి కలలు నిజమవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా బలపడతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది.
కన్య రాశి
మిథున రాశిలోకి గురువు ప్రవేశించడం వల్ల కన్య రాశి వారికి అదృష్టం కలిసివస్తుంది. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.