- Home
- Astrology
- Jupiter Transit: గురు గ్రహ అస్తమయం.. ఈ నాలుగు రాశులకు రాజయోగం, ఉద్యోగ, వ్యాపారాల్లో ధనయోగం..!
Jupiter Transit: గురు గ్రహ అస్తమయం.. ఈ నాలుగు రాశులకు రాజయోగం, ఉద్యోగ, వ్యాపారాల్లో ధనయోగం..!
ప్రస్తుతం గురు గ్రహం అస్తమించింది. మరి కొద్ది రోజుల్లో మళ్లీ గురు గ్రహం ఉదయించనుంది. అయితే..ఈ గ్యాప్ లో కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాలు కలగనున్నాయి.ఈ సమయంలో ఏ రాశివారు శుభ ఫలితాలు అందుకుంటారో ఓసారి చూద్దాం..

గురుగ్రహ అస్తమయం..
జోతిష్యశాస్త్రంలో గ్రహాలు తరచుగా మారిపోతూ ఉంటాయి. ఈ గ్రహాల మార్పులు రాశులపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు గురు గ్రహంలో మార్పులు వస్తున్నాయి. జూన్ 12వ తేదీన గురు గ్రహం అస్తమించింది. మళ్లీ జులై 9 వ తేదీన ఉదయం 04:44 గంటలకు ఉదయిస్తుంది. నిజానికి, ఏదైనా గ్రహం అస్తమించినప్పుడు, దాని శుభ ఫలితాలు తగ్గుతాయి. కానీ గురు గ్రహ అస్తమయం మాత్రం నాలుగు రాశుల వారికి శుభ ఫలితాలు మోసుకొస్తోంది. సహజంగా గురు గ్రహ అస్తమయం కుంభ రాశికి చాలా మేలు చేస్తుంది. అయితే, ఈ కుంభ రాశితో పాటు.. మరో నాలుగు రాశులకు కూడా ఈసారి లాభాలు కలగనున్నాయి. మరి, ఆ రాశులు ఏంటంటే...
1.వృశ్చిక రాశి...
గురువు అస్తమయం వల్ల వృశ్చిక రాశి వారి జీవితంలో చాలా మంచి మార్పులు వస్తాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. వారికి అందాల్సిన డబ్బు సరైన సమయంలో అందుతుంది. తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటాయి. అయితే.. ఈ సమయంలో ప్రేమ వ్యవహారాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వారిని ఇబ్బంది పెట్టడం, వారితో గొడవలు పడటం లాంటివి చేయకూడదు.పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధి చూస్తారు. ఎవైనా అడ్డంకులు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి.
2.మేష రాశి..
గురువు అస్తమయం వల్ల మేష రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. ఈ సమయంలో మేష రాశివారికి ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. జీవితంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. వ్యక్తిగత జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగం లో మంచి పొజిషన్ కి వెళతారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఎప్పుడూ చూడని లాభాలు ఈ సమయంలో వీరికి లభించే అవకాశం ఉంది.
3.మకర రాశి...
గరు గ్రహ అస్తమయం మకర రాశివారికి చాలా మేలు చేయనుంది. ముఖ్యంగా మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో ఏవైనా అప్పులు ఉంటే వారికి ఈ సమయంలో తీరే అవకాశం ఉంది. నచ్చిన ప్రదేశానికి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మంచి ట్రిప్ లను ఎంజాయ్ చేస్తారు. కొత్తగా ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. శుభ వార్తలు వింటారు. ఇది వీరికి చాలా శుభ సమయం. పిల్లలు కూడా మీకు బాగా సహకరించే అవకాశం ఉంది.
4.కర్కాటక రాశి..
గురు గ్రహ అస్తమయ ప్రభావం కర్కాటక రాశి వారికి చాలా మేలు చేయనుంది. ఈ అస్తమయ సమయం కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి అదనపు ఖర్చులు అన్నీ తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు ఎక్కువ ఆదా చేయగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగం లో ఉన్నత స్థాయికి ఎదగగలరు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. వారు ఏ పని చేసినా.. మంచి విజయం సాధిస్తారు.