Jupiter Transit: మిథునరాశిలోకి గురువు.. ఈ రెండు రాశుల దశ తిరిగిపోయినట్లే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 14న గురువు.. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం వల్ల రెండు రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. వారి జీవితాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోనున్నాయి. మరి ఆ రాశులు ఏంటో.. వారికి కలిగే ప్రయోజనాలెంటో ఇక్కడ చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
గురువు రాశి మారినప్పుడల్లా వ్యక్తిగత, సమాజం, ప్రపంచ స్థాయిలో లోతైన మార్పులను తెస్తాడు. మే 14న గురు గ్రహం మిథున రాశిలోకి ప్రవేశించినుంది. దీనివల్ల జ్ఞానం, సాంకేతికత, విద్యకు సంబంధించిన కార్యకలాపాల్లో తీవ్ర మార్పులు రానున్నాయి. ఈ సంచారం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపును తెస్తుంది. మరీ ముఖ్యంగా గురుడి సంచారం రెండు రాశుల వారికి మంచి ఫలితాలు ఇవ్వనుంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం.
మిథున రాశి
మిథున రాశి తెలివితేటలు, సంభాషణ, వ్యాపారం, బహుముఖ ప్రజ్ఞను సూచిస్తుంది. గురువు ఈ రాశిలోకి ప్రవేశించినప్పుడు.. జ్ఞానం, తార్కిక ఆలోచనలతో ఒక ప్రత్యేకమైన కలయిక ఏర్పడుతుంది. దీనివల్ల ఈ రాశి వారికి వ్యాపారం, డిజిటల్ వేదికల్లో కొత్త అవకాశాలు వస్తాయి. విద్య, రచన, శిక్షణ, నెట్‌వర్కింగ్‌కు ఇది అనుకూలమైన సమయం. సిద్ధాంతపరమైన విభేదాలు, నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం.
మేష రాశి
గురువు సంచారం మీ మూడవ ఇంట్లో ఉంటుంది. ఇది ధైర్యం, బలం, తోబుట్టువులతో సంబంధాలను బలోపేతం చేస్తుంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి, మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో పురోగతి సాధించడానికి ఇది అనుకూలమైన సమయం. మీ ఆలోచనలను సమర్థవంతంగా ప్రదర్శించడంలో విజయం సాధిస్తారు. ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులను దానం చేయండి. ఉదయం 5 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది మానసిక స్పష్టత, సమతుల్యతను కాపాడుతుంది.
ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి
చిన్న ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం, భావోద్వేగ మద్దతు లభిస్తుంది. అయితే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఏ పనినీ వ్యూహం లేకుండా చేయద్దు. స్వీయ వ్యక్తీకరణలో అభివృద్ధి ఉంటుంది. కానీ అతిగా ఆత్మవిశ్వాసం అహంకారానికి దారితీస్తుంది.