MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Jupiter Transit: పునర్వసు నక్షత్రంలోకి గురుడు.. ఐదు రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్లే..!

Jupiter Transit: పునర్వసు నక్షత్రంలోకి గురుడు.. ఐదు రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్లే..!

Jupiter Transit: ఏప్రిల్ 20న గురు గ్రహం పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. తన సొంత నక్షత్రంలోకి అడుగుపెట్టడం వల్ల కొన్ని రాశులకు శుభ ఫలితాలను తీసుకురానుంది. ముఖ్యంగా ఆ రాశులవారి లైఫ్ లో గోల్డెన్ టైమ్ మొదలైనట్లే. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 01 2026, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Jupiter Transit
Image Credit : others

Jupiter Transit

జోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహాన్ని శుభ గ్రహంగా పరిగణిస్తారు. గురు గ్రహ బలం ఉంటే ఆర్థిక సమస్యలు రావు. అంతేకాకుండా.. ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అలాంటి ఈ గురు గ్రహం ఏప్రిల్ 20వ తేదీన తన సొంత నక్షత్రమైన పునర్వసులోకి అడుగుపెడుతోంది. దీని కారణంగా ఐదు రాశుల వారికి ఈ గురు గ్రహం శుభ ఫలితాలను అందించనుంది. ముఖ్యంగా ధన సమస్యలు తీరిపోతాయి. జీవితంలో మంచి పురోగతి కూడా సాధిస్తారు. మరి, ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1.మేష రాశి...
Image Credit : Asianet News

1.మేష రాశి...

మేష రాశిలో జన్మించిన వారికి గురు గ్రహ సంచారం కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా, చాలా కాలంగా ఈ రాశివారు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఈ కాలంలో నెమ్మదిగా తొలగిపోయే అవకాశం ఉంది. అప్పుల బాధ నుండి కూడా విముక్తి లభిస్తుంది. శుభవార్తలు వింటారు. అంతేకాకుండా.. ఈ సమయంలో ఈ రాశివారి మనసు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది.

ఉద్యోగం విషయానికి వస్తే.. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రమోషన్స్ అందుకునే అవకాశం ఉంది.దీని వల్ల మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

Related Articles

Related image1
Powerful Yoga: మీన రాశిలో అత్యంత శక్తివంతమైన రాజయోగం..ఈ మూడు రాశుల తలరాత మారినట్లే
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై రాహు ప్రభావం..శత్రువులపై ఎలా పగతీర్చుకుంటారో తెలుసా?
36
2.మిథున రాశి..
Image Credit : Asianet News

2.మిథున రాశి..

గురువు తన సొంత నక్షత్రంలోకి అడుగుపెట్టడం మిథున రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. విద్య, పోటీ పరీక్షలకు సన్నద్ధమౌతున్న మిథున రాశివారికి ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సంబంధాలు మెరుగౌతాయి. శుభవార్తలు వింటారు. గొప్ప విజయాలు కూడా ఈ సమయంలో వీరు సాధించగలరు.

46
3.కర్కాటక రాశి..
Image Credit : Asianet News

3.కర్కాటక రాశి..

గురు గ్రహం పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల, కర్కాటక రాశివారికి ఈ సమయంలో అదృష్టం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో కర్కాటక రాశివారి వృత్తి జీవితం కూడా ఆనందంగా మారుతుంది. అనేక అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు మంచి లాభాలు అందుకుంటారు. గురు గ్రహ అనుగ్రహం పెరిగి.. ఆదాయం పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ పనితీరును అందరూ మెచ్చుకుంటారు.

56
4.తుల రాశి...
Image Credit : Asianet News

4.తుల రాశి...

గురు గ్రహం పునర్వసు నక్షత్రంలోకి అడుగుపెట్టడం వల్ల తుల రాశివారు ఈ సమయంలో కొత్త శిఖరాలను అధిరోహించగలుగుతారు. వీరు శుభవార్తలు వింటారు. ఉద్యోగ, వ్యాపారాలు చాలా అనుకూలంగా మారతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ కాలంలో, తుల రాశిలో జన్మించిన వారి ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. కొత్త భాగస్వామ్యాల ద్వారా కూడా వారు అపారమైన ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో మీరు సంతోషకరమైన, అనుకూలమైన కాలాన్ని గడిపే అవకాశం ఉంది.

66
ధనుస్సు రాశి....
Image Credit : Asianet News

ధనుస్సు రాశి....

గురు గ్రహ నక్షత్ర మార్పు ధనుస్సు రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు సంబంధించిన పనులు చేస్తున్నట్లయితే... ఈ కాలంలో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా రుణ బాధలు కూడా తీరతాయి.

ధనుస్సు రాశిలో జన్మించినవారు తమ ఇళ్లలో సంతోషం, ప్రశాంతత , సానుకూల వాతావరణాన్ని అనుభవిస్తారు. ఈ సమయంలో, ఆధ్యాత్మికత పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. దీనివల్ల, మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ కాలంలో, మీ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. తెలివిగా పనిచేయడం భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
Powerful Yoga: మీన రాశిలో అత్యంత శక్తివంతమైన రాజయోగం..ఈ మూడు రాశుల తలరాత మారినట్లే
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై రాహు ప్రభావం..శత్రువులపై ఎలా పగతీర్చుకుంటారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved