MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Jupiter Transit: సింహ రాశిలోకి గురుగ్రహం ఎంట్రీ.. ఈ 4 రాశుల వారికి పట్టబోతున్న ధనయోగం

Jupiter Transit: సింహ రాశిలోకి గురుగ్రహం ఎంట్రీ.. ఈ 4 రాశుల వారికి పట్టబోతున్న ధనయోగం

Jupiter Transit: దేవగురువు బృహస్పతి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. గురు గ్రహ సంచారం వల్ల 4 రాశుల వారి జీవితాల్లో ధనయోగం పట్టనుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో తిరుగులేని లాభాలు వస్తాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 17 2026, 07:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేష రాశి వారికి గురు గ్రహం 5వ ఇంట్లో సంచరించనున్నాడు. ఈ స్థానం విద్య, సృజనాత్మకత, సంతాన భాగ్యానికి ప్రతీక. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు గురుడి కృపతో అద్భుత విజయాలు సాధిస్తారు. కళలు, రచన, సాహిత్యం, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారిని కొత్త, పెద్ద అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబంలో ఒకరికొకరు ప్రేమ, ఆప్యాయతలు పంచుకుంటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి గురుడు 2వ ఇంట్లోకి (ధన స్థానం) ప్రవేశించనున్నాడు. ఇది సంపద, కుటుంబం, వాక్చాతుర్యాన్ని సూచిస్తుంది. ఈ రాశివారికి ఆదాయానికి కొత్త మార్గాలు పుట్టుకొస్తాయి. ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా పోతాయి. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో ఈ రాశివారికి మాటకు మంచి గుర్తింపు దక్కుతుంది. వీరి కమ్యూనికేషన్ స్కిల్స్‌తోనే పెద్ద పెద్ద డీల్స్ సొంతం చేసుకుంటారు. ఆదాయం పెరుగుతోంది కదా అని అనవసర ఖర్చులు చేయకుండా, డబ్బును పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం.

34
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

గురు భగవానుడు సింహ రాశిలోకే (లగ్న స్థానం) ప్రవేశిస్తుండటంతో, సింహ రాశి వారికి ఇది నిజంగా గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పటికే పనిచేస్తున్న వారికి ఉన్నత పదవులు, ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు దక్కుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీలోని నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. కొత్త వ్యాపారం లేదా ప్రాజెక్టులు మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకుంటే, దానికి ఇదే సరైన సమయం.

44
తులా రాశి
Image Credit : Gemini Ai

తులా రాశి

తులా రాశి వారికి లాభ స్థానంలో గురుడి సంచారం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు కొత్త పరిచయాలు, కొత్త భాగస్వామ్యాలు (Partnerships) భారీ స్థాయిలో లాభాలను తెచ్చిపెడతాయి. చాలా రోజులుగా సగంలోనే ఆగిపోయిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగం మారాలని ఎదురుచూస్తున్న వారికి మంచి జీతంతో కొత్త ఆఫర్లు వస్తాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది!
Recommended image3
Kubera Yogam: గురు, కేతువుల కలయికతో కుబేర యోగం.. ఈ 5 రాశులవారిని ఎవ్వరూ ఆపలేరు!
Related Stories
Recommended image1
Golden Tree: పసిఫిక్ మహాసముద్రంలో బంగారు చెట్టు.. కొత్తగా కనిపెట్టిన శాస్త్రవేత్తలు
Recommended image2
Dangerous Tree: ప్రమాదకరమైన చెట్టు.. ఆకు నుంచి పండు వరకు అంతా విషమే, నీడలో నిలబడినా ప్రమాదమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved