MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • రాత్రి 01:13 కే భారత్‌ ఎందుకు దాడులకు దిగింది..జ్యోతిష్యశాస్త్రం ప్రకారం యుద్ధానికి నాంది పలికిందా?

రాత్రి 01:13 కే భారత్‌ ఎందుకు దాడులకు దిగింది..జ్యోతిష్యశాస్త్రం ప్రకారం యుద్ధానికి నాంది పలికిందా?

పహల్గామ్ దాడికి ప్రతిగా భారత సైన్యం పాక్‌లో ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. మే 7 అర్థరాత్రి 01:13 గంటలకే ఎందుకు దాడులకు దిగింది.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భారత  ఆర్మీ  ఈ దాడులు నిర్వహించిందా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Bhavana Thota
Published : May 07 2025, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆపరేషన్ సింధూర్

ఆపరేషన్ సింధూర్

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం మేలైన సమయాన్ని ఎంచుకొని ప్రతీకారం తీర్చుకుంది. మే 6-7 మధ్య రాత్రి 1:13 గంటలకు భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారీ దాడి చేసింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఈ దాడిలో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
విజయమే ఎదురుగా

విజయమే ఎదురుగా

దాడి జరిగిన మరుసటి రోజే భారత సైన్యం సోషల్ మీడియాలో ఒక సందేశం పోస్టు చేసింది:“ప్రహారాయ సన్నిహిత, జయ ప్రక్షిత”అంటే — దాడి సమీపంలో ఉంది, విజయమే ఎదురుగా ఉంది అని అర్థం.

Related Articles

Related image1
Now Playing
బోర్డర్ లో భారీగా ఆర్మీ.. జమ్మూ యువత సపోర్ట్ | Operation Sindoor | Indian Army | Asianet News Telugu
35
ఈ సమయాన్నే ఎందుకు ఎంచుకున్నారు?

ఈ సమయాన్నే ఎందుకు ఎంచుకున్నారు?

ఈ సమయాన్నే ఎందుకు ఎంచుకున్నారు?

పండిట్ నళిన్ శర్మ అనే జ్యోతిష్కుడి మాటల ప్రకారం, మే 6-7 రాత్రి శుక్ల పక్ష దశమి తేదీ. ఇది వైశాఖ మాసంలోని పవిత్రమైన తిథులలో ఒకటి. జ్యోతిష శాస్త్రంలో దశమి తిథికి యమధర్మరాజు అధిపతి. యముడు మృతి మరియు న్యాయం కోసం ప్రసిద్ధుడు.

ఈ రాత్రి "వ్యాఘాత యోగం" ఏర్పడిన సమయం కూడా. వ్యాఘాత అనగా రహస్యంగా దాడి చేయడం లేదా శత్రువులకు హాని కలిగించడం. ఇది విజయానికి అనుకూలమైన యోగంగా భావిస్తారు.

45
గ్రహస్థితి కూడా అనుకూలంగా ఉండటం విశేషం

గ్రహస్థితి కూడా అనుకూలంగా ఉండటం విశేషం

దాడి జరిగిన సమయంలో చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు. ఇది అత్యంత శక్తివంతమైన రాశిగా పరిగణిస్తారు.. దీనికి అధిపతి సూర్యుడు — తొమ్మిది గ్రహాలకూ నాయకుడు. సింహరాశిలో చంద్రుడి ఉనికి భారత సైన్యానికి శక్తిని, ధైర్యాన్ని ఇచ్చినదిగా విశ్వసిస్తున్నారు.

55
మంగళవారం-బుధవారం కలయిక శుభప్రదం

మంగళవారం-బుధవారం కలయిక శుభప్రదం

దాడి మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు జరిగింది. మంగళవారం దినాధిపతి మంగళుడు — యుద్ధాన్ని సూచించే గ్రహం. బుధవారం ఆర్థిక వ్యవస్థను సూచించే గ్రహం. పండితుల అభిప్రాయం ప్రకారం, ఈ రెండు కలయిక యుద్ధంలో విజయానికీ, శత్రువులకు నష్టానికి సంకేతం.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఆపరేషన్ సింధూర్
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bad Husbands: ఈ 4 రాశులకు చెందిన మగవారు భర్తలుగా ఫెయిల్ అవుతారు, భార్యను బాధపెడతారు
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి బాగా కలిసివస్తుందో చూడండి!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారు పాత స్నేహితులతో సంతోషంగా గడుపుతారు!
Related Stories
Recommended image1
Now Playing
బోర్డర్ లో భారీగా ఆర్మీ.. జమ్మూ యువత సపోర్ట్ | Operation Sindoor | Indian Army | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved