- Home
- Astrology
- Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Ramayana Astrology: రామాయణంలో అనేక పాత్రలు ఉన్నాయి. రాముడి నుంచి రావణుడి వరకు ఎవరిదో ఏ రాశో తెలుసా? అలాగే రామాయణంలోని ఏ పాత్ర ఏ రాశికి సెట్ అయిందో కూడా తెలుసుకోండి.

సీతా రాముల రాశులు ఏవి?
మేషం – రాముడు: నాయకత్వ లక్షణాలు, ధైర్యం, న్యాయం పట్ల నిబద్ధత మేష రాశి వారి ప్రధాన లక్షణాలు. రాముడు తన బాధ్యతలకు కట్టుబడి ఉండటమే కాకుండా, సీతను రక్షించేందుకు ఎంతో ధైర్యంగా పోరాడాడు. ఆయన నాయకత్వ లక్షణాలు, ధర్మాన్ని పాటించే తీరు మేష రాశితో సరిగ్గా సరిపోతాయి.
వృషభం – సీత: ఓర్పు, పట్టుదల, విధేయత, అందం వృషభ రాశి లక్షణాలు. రాముడిపై సీతకు ఉన్న ప్రేమ, లంకలో బందీగా ఉన్నప్పుడు ఆమె చూపించిన మనోబలం ఈ రాశి లక్షణాలతో సరిపోలుతాయి. అందుకే సీతమ్మను వృషభ రాశికి సరైన పాత్రగా భావిస్తారు.
మిథునం – లక్ష్మణుడు: చురుకుదనం, పరిస్థితులకు తగ్గట్టు మారడం, సవాళ్లను ఎదుర్కోవడం మిథున రాశి వారి లక్షణాలు. రాముడితో పాటు అరణ్యవాసానికి వెళ్లిన లక్ష్మణుడు, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అన్నకు అండగా నిలిచాడు. రక్షకుడిగా, సోదరుడిగా ఆయన పోషించిన పాత్ర మిథున రాశి స్వభావంతో సరిపోలుతుంది.
కర్కాటకం – హనుమంతుడు: ప్రేమ, రక్షణ భావం, భావోద్వేగ బంధం కర్కాటక రాశికి సంబంధించినవి. రాముడిపై హనుమంతుడికి ఉన్న భక్తి, ఆయనకు సాయం చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఈ రాశి లక్షణాలను గుర్తు చేస్తాయి. రాముడికి అండగా నిలిచి సీతను వెతికిన హనుమంతుడిని కర్కాటక రాశితో పోలుస్తారు.
రావణుడిది ఏ రాశి?
సింహం – రావణుడు: నాయకత్వం, అధికారం, గంభీరత, గర్వం సింహ రాశి లక్షణాలు. లంకాధిపతిగా బలమైన పాలన సాగించిన రావణుడు, తన వ్యక్తిత్వం, అధికారంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని ఆశయం, అధికార దాహం సింహ రాశి లక్షణాలతో సరిపోలుతాయి. అందుకే రామాయణంలో ప్రధాన ప్రతినాయకుడైన రావణుడిని సింహ రాశితో పోలుస్తారు.
కన్య – విభీషణుడు: విశ్లేషణాత్మక ఆలోచన, సూక్ష్మబుద్ధి, బాధ్యత కన్యా రాశికి సంబంధించినవి. రావణుడి సోదరుడైన విభీషణుడు, అన్న చేసిన తప్పులను ఎత్తిచూపి సలహాలు ఇచ్చాడు. ఆ తర్వాత రాముడి పక్షాన నిలబడ్డాడు. సరైన దాన్ని ఎంచుకునే అతని మనస్తత్వం కన్యా రాశి లక్షణాలతో సరిపోలుతుంది.
తుల – సుగ్రీవుడు: సమతుల్యత, పొత్తులు, న్యాయం, సంబంధాలను నిలబెట్టుకోవడం తులా రాశి లక్షణాలు. వాలి వల్ల మోసపోయిన సుగ్రీవుడు, రాముడితో స్నేహం చేశాడు. ఇద్దరూ ఒకరికొకరు సాయం చేసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకునేందుకు రాముడి సాయం తీసుకున్న సుగ్రీవుడి స్నేహబంధం తులా రాశి లక్షణాలతో సరిపోలుతుంది.
వృశ్చికం – కైకేయి: తీవ్రమైన భావోద్వేగాలు, పట్టుదల, మార్పును తీసుకొచ్చే పనులు వృశ్చిక రాశికి సంబంధించినవి. దశరథుడి భార్య కైకేయి, తన కోరికను నెరవేర్చుకునేందుకు రాముడిని అరణ్యవాసానికి పంపింది. ఆమె తీసుకున్న కఠిన నిర్ణయం, అయోధ్య రాజకుటుంబంలో తీసుకొచ్చిన మార్పులు వృశ్చిక రాశి లక్షణాలతో సరిపోలుతాయి.
దశరథుడి రాశి ఏది?
ధనుస్సు – భరతుడు: సత్యాన్వేషణ, నమ్మకం, నిజాయితీ ధనుస్సు రాశి లక్షణాలు. రాముడు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు, భరతుడు రాజ్యభారం మోయాల్సి వచ్చింది. కానీ, ఆయన రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి, అన్న తరపున మాత్రమే పాలన సాగించాడు. ధర్మాన్ని కాపాడటంలో ఆయన చూపించిన నిబద్ధత ధనుస్సు రాశి లక్షణాలతో సరిపోలుతుంది.
మకరం – దశరథుడు: బాధ్యత, నియంత్రణ, అధికారం, కర్తవ్య నిర్వహణ మకర రాశికి సంబంధించినవి. అయోధ్య మహారాజు దశరథుడు, తన రాజరిక బాధ్యతలను, కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. కైకేయికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రాముడిని అడవులకు పంపాల్సి వచ్చింది. ఆయన రాజరిక బాధ్యత, నిర్ణయాల భారం మకర రాశి లక్షణాలతో సరిపోలుతాయి.
కుంభం – శబల: వినూత్న ఆలోచనలు, ఇతరులకు సాయం చేసే గుణం, భిన్నంగా ఆలోచించడం కుంభ రాశి లక్షణాలు. రామాయణంలో వశిష్ట మహాముని దగ్గర ఉండే కామధేనువు పేరు శబల. తన అద్భుత శక్తులతో సాయం చేసే శబలను, కుంభ రాశి వారి వినూత్న, సేవా గుణాలతో పోలుస్తారు.
మీనం – వాల్మీకి: ఆధ్యాత్మికత, సృజనాత్మకత, దయ మీన రాశికి సంబంధించినవి. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి, లోతైన ఆధ్యాత్మిక చింతన, సృజనాత్మకత ఉన్న వ్యక్తిగా కీర్తి గడించారు. ఆయన సాహిత్య సేవ, ఆధ్యాత్మిక దృక్పథం మీన రాశి లక్షణాలతో సరిపోలుతాయి.





