MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Venus Moon Conjunction: రెండు గ్రహాల అరుదైన కలయిక...ఈ రాశులకు ఊహించని ఆర్థిక లాభాలు..!

Venus Moon Conjunction: రెండు గ్రహాల అరుదైన కలయిక...ఈ రాశులకు ఊహించని ఆర్థిక లాభాలు..!

Venus Moon Conjunction: రెండు గ్రహాల అరుదైన కలయిక ప్రభావం జోతిష్యశాస్త్రంలో అన్ని రాశులపై ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు-చంద్రుడు కలయిక ఒక కళాత్మక యోగాన్ని సృష్టిస్తుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 03 2026, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కళాత్మక యోగం..
Image Credit : Getty

కళాత్మక యోగం..

జోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను, నక్షత్రాలను మార్చుకుంటూ ఉంటాయి. ఇలా మార్చుకోవడం వల్ల శుభ, అశుభ యోగాలను సృష్టిస్తాయి. మరో రెండు రోజుల్లో అంటే ఏప్రిల్ 5 వ తేదీన సంకష్ట చతుర్థి రోజున సంపదకు అధిపతి అయిన శుక్రుడు, చంద్రుడు వ్యతిరేక దిశలలో సంచరిస్తూ ఒక కళాత్మక యోగాన్ని ఏర్పరచనున్నాయి. శుక్రుడు మేష రాశిలో, చంద్రుడు తుల రాశిలో సంచరిస్తున్నారు. దీని వల్ల ఏర్పడిన కళాత్మక యోగం అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు కలగనున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1.వృశ్చిక రాశి...
Image Credit : Asianet News

1.వృశ్చిక రాశి...

శుక్ర- చంద్రుల కలయిక వృశ్చిక రాశివారికి మంచి ఫలితాలు అందిస్తాయి. ఈ సమయంలో ఈ రాశివారు అన్నీ శుభవార్తలే వింటారు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటారు. అంతేకాదు.. మునుపెన్నడూ చూడని ఆనందం, శాంతి ఇంట్లో పొందుతారు. పెళ్లికాని వారికి ఈ సమయంలో పెళ్లి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. వ్యాపారంలోనూ మంచి వృద్ధి సాధిస్తారు. అదృష్టం లభిస్తుంది. కెరీర్ లో మీరు కొత్త శిఖరాలను చేరుకుంటారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

Related Articles

Related image1
Jupiter Transit: పునర్వసు నక్షత్రంలోకి గురుడు.. ఐదు రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్లే..!
Related image2
Planet Retrograde: కర్కాటక రాశిలోకి గురుడు.. ఈ రాశుల పంట పండినట్లే,జూన్ నుంచి డబ్బే డబ్బు..!
36
2.మకర రాశి..
Image Credit : Asianet News

2.మకర రాశి..

మకర రాశి వారికి ఈ కళాత్మక యోగం చాలా శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ యోగం ఈ రాశి వారికి ఈ సమయంలో ధైర్యం పెరుగుతుంది. ఏ పని చేసినా విజయం అందుకుంటారు. సంతోషం పెరుగుతుంది. ఈ సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. మరి కొద్ది రోజుల్లో వీరికి డబుల్ జాక్ పాట్ తగిలే అవకాశం ఉంది. ముఖ్యంగా సంపద పెరుగుతుంది. ఈ సమయంలో పెళ్లి వారికి పెళ్లి జరిగే అవకాశం ఉంది. వ్యాపారం ప్రారంభిస్తే.. ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది.

46
మిథున రాశి...
Image Credit : Asianet News

మిథున రాశి...

కళాత్మక యోగం మిథున రాశి వారికి ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తుంది. ఆర్థికంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆలోచనను పై అధికారులు మెచ్చుకుంటారు. ఇంట్లో మునుపెన్నడూ చూడని ఆనందం వెల్లివిరుస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇంట్లో ఆనందం రెట్టింపు అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

56
తుల రాశి
Image Credit : Asianet News

తుల రాశి

ఈ కళాత్మక యోగం తుల రాశివారి జీవితంలోకి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. వినాయకుడి ఆశీస్సులు లభిస్తాయి. జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు. అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. ఈ సమయంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

66
 కన్యా రాశి..
Image Credit : Asianet News

కన్యా రాశి..

ఈ కళాత్మక యోగం కన్య రాశివారి జీవితంలోకి కూడా శుభ ఫలితాలను తెస్తుంది. ఏ పని చేసినా దాని నుంచి లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది. మీరు కుటుంబంతో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు. ఈ కాలంలో పూర్తికాని అనేక పనులు పూర్తవుతాయి. అవివాహితులు ఈ కాలంలో తగిన భాగస్వామిని పొందే అవకాశం ఉంది. ఆర్థిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మీరు చిన్న ప్రయత్నంతో పెద్ద లాభం పొందుతారు. గతంలో చేసిన అప్పులను తీర్చడానికి ఈ సమయంలో అనేక మార్గాలు తెరుచుకుంటాయి. మీరు ఇంట్లో శుభకార్యాలపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image3
Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ మంగళసూత్రం డిజైన్లు
Related Stories
Recommended image1
Jupiter Transit: పునర్వసు నక్షత్రంలోకి గురుడు.. ఐదు రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్లే..!
Recommended image2
Planet Retrograde: కర్కాటక రాశిలోకి గురుడు.. ఈ రాశుల పంట పండినట్లే,జూన్ నుంచి డబ్బే డబ్బు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved