షవర్ బాత్ చేస్తున్నారా? అయితే మీ రాశిని బట్టి మీరేం ఆలోచిస్తారంటే...
షవర్ బాత్.. శరీరానికి హాయిని.. మనసుకు ఉత్తేజాన్ని ఇస్తుంది. అయితే ఒక్కో రాశి వారు షవర్ కిందికి వెళ్లగానే ఒక్కో రకంగా ప్రవర్తిస్తారట. ఎలాగో చూడండి..

Aries Zodiac
మేషరాశి : ఈ రాశివారు ముందు చల్లటి నీటితో శరీరాన్ని చిల్ చేసుకుంటారు. దీంతో వీరి మనసు, శరీరం రెండూ హాయిగా మారిపోతాయి.
Taurus Zodiac
వృషభరాశి : షవర్ బాత్ చేసే సమయంలో వృషభరాశివారు ఆలోచనల్లోకి జారి పోతారు. ఇంకా చెప్పాలంటే జెన్ పొజిషన్ లోకి వెళ్లిపోతారు.
Gemini Zodiac
మిధునరాశి : షవర్ కింద నాట్యం చేయడం వీరికి ఇష్టం. కాళ్లు, చేతులు, బాడీ మొత్తం కదుపుతూ నీటి సంగీతానికి అలల్లా తాళం వేస్తారు.
Cancer Zodiac
కర్కాటకరాశి : షవర్ కింద కన్నీరు కనిపించదని.. ఎక్కువగా అక్కడే తమ మనసులోని భారాన్ని దించుకుంటారు. జీవితంలో మీకు ఎదురైన కష్టనష్టాలన్నింటకీ షవర్ కింద ఏడుస్తూ తగ్గించుకుంటారు
Leo
సింహరాశి : షవర్ కింద ఉన్నప్పుడు ప్రపంచాన్ని శాసించే నేతగా మిమ్మల్ని మీరు భావిస్తారు. దీంతో పాటు మీ స్పీచ్ లను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు.
Virgo Zodiac
కన్యారాశి : ఈ రాశివారు షవర్ బాత్ చేయాలంటే.. దీనికి వాడే సోప్, లిక్విడ్ సోప్.. షాంపూ.. ఏవైనా సరే బెస్ట్ ప్రాడక్ట్స్ అయి ఉండాలి. వీరు షవర్ కింద సోఫిస్టికేటేడె గా ఉంటారు.
Libra Zodiac
తులారాశి : తులారాశివారు షవర్ కిందికి వెళ్లగానే ఏదో మ్యూజిక్ కాన్సర్ట్ కు వెళ్లినట్టు ఊహించుకుంటారు. అంతే డ్యాన్స్ చేస్తూ ఉంటారు.
Scorpio Zodiac
వృశ్చికరాశి : షవర్ బాత్ అనేది మీ కోసం మీరు గడిపే అతి ప్రియమైన సమయంగా మీరు భావిస్తారు. అందుకే షవర్ కింద మిమ్మల్ని మీరు తెగ గారాబం చేస్తారు.
Sagittarius Zodiac
ధనుస్సురాశి : ఈ రాశివారు.. సరదాగా ఉండే ప్రేమైక జీవులు. షవర్ కిందికి వెళ్లగానే వీరిలోని కళాకారుడు నిద్ర లేస్తాడు. గొంతెత్తి పాడుతూ, డ్యాన్స్ చేస్తూ షవర్ చేస్తారు.
Capricorn Zodiac
మకరరాశి : మకరరాశివారు పెద్దగా ఏమీ ఆలోచించరు. వేడినీటితో గబగబా షవర్ ముగించి బయటపడాలని చూస్తారు. అంతే.. అంతకుమించి వేరే ఆలోచన ఉండదు.
Aquarius
కుంభరాశి : షవర్ కిందికి వెళ్లగానే ఏదో ధ్యానంలోకి వెళ్లిపోయినట్టుగా ఉంటుంది వీరికి... ఆలోచనల్లో దారి తప్పిపోతారు.
Pisces Zodiac
మీనరాశి : షవర్ కిందికి వెళ్లగానే వీరికి వీరి భాగస్వామి గుర్తుకువస్తారు. వారితో గడిపిన క్షణాలు గుర్తుకువస్తాయి. చిలిపి ఆలోచనలను ముప్పిరిగొంటాయి.