జాతకంలో ఈ దోషాలు ఉంటే విమాన ప్రయాణాలు చేయకపోవడమే బెటర్
అహ్మదాబాద్ విమాన ప్రయాణం తరువాత చాలా మంది విమాన ప్రయాణం చేయాలంటనే బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే విమాన ప్రయాణ భద్రతపై జాతకంలోని గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపుతాయో జ్యోతిష శాస్త్రం ద్వారా తెలుసుకుందాం.

శని (Saturn):
శని 7వ, 8వ, 9వ లేదా 12వ ఇంట్లో ఉంటే విదేశీ ప్రయాణ సూచన ఉంటుంది. అయితే, ఇది ప్రయాణంలో జాప్యం, ఇబ్బందులు, అపసవ్య పరిస్థితులను కూడా చూపుతుంది.
రాహువు (Rahu):
రాహువు ఉత్తర దిశను సూచించడంతో పాటు విమానయానం, వైమానిక సంబంధిత వ్యవహారాలకు సంకేతంగా భావిస్తారు. ఇది అనుకోని సంఘటనలకు సూచిక కావచ్చు.
శని 9వ, 12వ ఇళ్లు:
శని 9వ ఇల్లు – అంతర్జాతీయ ప్రయాణాలను సూచిస్తుంది.12వ ఇల్లు – విదేశాల్లో గడిపే సమయం, ప్రయాణ ఖర్చులు మరియు అనేకమార్లు వలస జీవితం. ఈ ఇళ్లలో దోషాలున్నా, దుష్ప్రభావ గ్రహాల ఉనికి వుంటే ప్రమాద సూచనలు కనిపించవచ్చు.
నిర్దిష్ట గ్రహ కలయికలు
12వ ఇంట్లో చంద్రుడు, శుక్రుడు, రాహువు వంటి గ్రహాల కలయికలు విదేశీ ప్రయాణ సూచిస్తాయి. అయితే అవి సవాళ్లు, ఇబ్బందులను సూచించగలవు.
ప్రమాద సూచించే ఇతర జాతక బిందువులు:
బుధుడు – ప్రయాణాలను సూచించే ముఖ్యమైన గ్రహం. దోషిత స్థితిలో ఉంటే ప్రయాణంలో ఆటంకాలు తలెత్తొచ్చు.3వ ఇల్లు – చిన్న ప్రయాణాలకు, వాయు సంబంధిత వాహనాలకు సంకేతం. మిథున రాశి దీనికి సంబంధించి ఉండటం వలన గాలి ప్రమాదాల ప్రభావం ఉంటుంది.కుజుడు – అగ్ని, పేలుళ్లు వంటి ప్రమాదాలకు సంకేతం.శని + బుధుడు లేదా చంద్రుడు కలయికలు – విమాన ప్రమాదాల సమయంలో చాలా సాధారణంగా కనిపిస్తాయి.నష్టకర నక్షత్రాలలో చంద్రుడు సంచారిస్తుండగా, బృహస్పతి యొక్క రక్షణ లేకపోతే, ఘోర ప్రమాదాలు సంభవించవచ్చు.
జాగ్రత్తలు & సూచనలు:
జాతకాన్ని విశ్లేషించి, ప్రయాణానికి అనుకూలమైన కాలం ఎంచుకోవడం ఉత్తమం.
శుభ ముహూర్తం ఎంచుకుని, వాస్తవిక పర్యవేక్షణతో పాటు జాగ్రత్తలతో ప్రయాణించండి.
భయం కాదు, అవగాహనతో ముందడుగు వేసే ధైర్యం కలిగి ఉండండి.
ప్రమాదాన్ని నిర్ధారించలేకపోయినా
జ్యోతిషశాస్త్రం పూర్తిగా ప్రమాదాన్ని నిర్ధారించలేకపోయినా, మన ఇంటర్నల్ సేఫ్టీ అలర్ట్‌గా, ముందస్తు జాగ్రత్తల కోసం మార్గదర్శకంగా ఉపయోగపడొచ్చు. భయం కాకుండా, అవగాహనతో ముందుకు సాగడమే మేలైన మార్గం.