MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • Investment: ఇల్లు కొనాలా.? పిల్ల‌ల్ని చ‌దివించాలా.? సామాన్య ఉద్యోగి మ‌దిలో ప్ర‌శ్నకు బ‌దులేంటి..

Investment: ఇల్లు కొనాలా.? పిల్ల‌ల్ని చ‌దివించాలా.? సామాన్య ఉద్యోగి మ‌దిలో ప్ర‌శ్నకు బ‌దులేంటి..

Investment: ఉద్యోగం చేసే ప్ర‌తీ వ్య‌క్తికి జీవితంలో ఒక ప్ర‌శ్న ఎదుర‌వుతుంది. సొంతిల్లు నిర్మించుకోవాలా.? లేదా పిల్ల‌ల్ని ఉన్న‌త చ‌దువులు చ‌దివించాలా.? ఈ రెండు ప్ర‌శ్న‌లు వ‌చ్చిన‌ప్పుడు ఎలా ఆలోచించాలో ఒక ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ ద్వారా తెలుసుకుందాం. 

3 Min read
Author : Narender Vaitla
Published : Apr 11 2026, 01:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓ సాధార‌ణ ఉద్యోగి సందేహం
Image Credit : Gemini AI

ఓ సాధార‌ణ ఉద్యోగి సందేహం

జీవితంలో చాలా మందికి సొంతింటిని నిర్మించుకోవాల‌నే ఒక పెద్ద‌ ల‌క్ష్యం ఉంటుంది. మరోవైపు, పిల్లలకు మంచి చదువు ఇవ్వడం, భవిష్యత్తుకు డబ్బు దాచుకోవడం కూడా అంతే ముఖ్య‌మ‌ని భావిస్తుంటాడు. ముఖ్యంగా మధ్య తరగతి ఉద్యోగులకి ఈ రెండు లక్ష్యాలు ఒకేసారి నెరవేర్చడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి పరిస్థితిని తీసుకుందాం. అతనికి నెలకు రూ.50,000 జీతం వస్తోందని అనుకుందాం. ప్రస్తుతం అతని చేతిలో రూ.15 లక్షల పొదుపు ఉంది. ఇప్పుడు అతని ముందున్న ప్రశ్న ఈ డబ్బుతో ఇల్లు కొనాలా? లేక పెట్టుబడి పెట్టాలా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే రెండు మార్గాల్ని స్పష్టంగా విశ్లేషించాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇల్లు కొనాలంటే పరిస్థితి ఎలా ఉంటుంది?
Image Credit : PR

ఇల్లు కొనాలంటే పరిస్థితి ఎలా ఉంటుంది?

ప్రస్తుతం ఒక డ‌బుల్ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్ కొనాలంటే త‌క్కువ‌లో త‌క్కువ రూ. 40 ల‌క్ష‌లు పెట్టాల్సిందే. ఒక‌వేళ టైర్ టూ న‌గ‌రాల్లో కొనుగోలు చేసినా రూ. 35 ల‌క్ష‌ల వ‌ర‌కు చెల్లించాల్సిందే. ఆ ఉద్యోగి దగ్గర ఇప్పటికే రూ.15 లక్షలు ఉన్నాయని అనుకుందాం. అంటే ఇల్లు కొనాలంటే ఇంకా రూ.20 లక్షల హౌస్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ లోన్‌పై సాధారణంగా బ్యాంకులు 20 సంవత్సరాల కాలానికి EMI విధానంలో రుణం ఇస్తాయి. అలా తీసుకుంటే సుమారుగా నెలకు చెల్లించాల్సిన EMI రూ.20,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది. అంటే అతని జీతం రూ.50,000 అయితే… రూ.20,000 హౌస్ లోన్ EMIకి వెళ్తే అత‌నికి మిగిలేది రూ. 30,000. ప్రస్తుత ఖర్చులు పెరిగిన పరిస్థితిలో రూ.30,000తో కుటుంబాన్ని నిర్వహించడం చాలా కష్టమయ్యే అవకాశం ఉంది.

Related Articles

Related image1
డ‌బ్బులుంటేనే గొప్ప అనుకుంటున్నారా.? ఈ పుస్త‌కం చ‌దివితే మీ ఆలోచ‌న మార‌డం ఖాయం
Related image2
Cooler: రిమోట్ కంట్రోల్‌, ట‌చ్ ప్యాన‌ల్‌.. కూల‌ర్‌లో ఏసీలాంటి ఫీచ‌ర్లు ఏంటి భ‌య్యా.!
35
EMI భారంతో వచ్చే ఆర్థిక ఒత్తిడి
Image Credit : Getty

EMI భారంతో వచ్చే ఆర్థిక ఒత్తిడి

ఇల్లు కొనడం ఒక పెద్ద నిర్ణయం. కానీ దానికి వచ్చే EMI ఒత్తిడిని కూడా ఆలోచించాలి. నెలకు రూ.20,000 EMI అంటే జీతంలో 40% నేరుగా లోన్‌కే వెళ్తుంది. అత్యవసర ఖర్చుల కోసం పొదుపు చేయడం కష్టమవుతుంది. పిల్లల ఉన్నత విద్య కోసం డబ్బు దాచడం కూడా కష్టమవుతుంది. మరొక విషయం ఏమిటంటే, ఉద్యోగంలో అనిశ్చితి, ఆరోగ్య సమస్యలు, ఆకస్మిక ఖర్చులు వచ్చినప్పుడు EMI చెల్లించడం చాలా ఒత్తిడిగా మారుతుంది. ఇల్లు ఉంటే భద్రత ఉంటుంది కానీ నెలనెలా డబ్బు ఒత్తిడి మాత్రం పెరుగుతుంది.

45
అదే డబ్బును పోస్టాఫీస్ స్కీమ్‌లో పెట్టితే?
Image Credit : Getty

అదే డబ్బును పోస్టాఫీస్ స్కీమ్‌లో పెట్టితే?

ఇప్పుడు మరో మార్గాన్ని పరిశీలిద్దాం. ఆ ఉద్యోగి దగ్గర ఉన్న రూ.15 లక్షలను పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) లో పెట్టుబడి పెట్టినట్లయితే… ఈ స్కీమ్‌లో ప్రస్తుతం సుమారుగా నెలకు రూ.10,000 వరకు వడ్డీ రావచ్చు (సుమారు అంచనా). అంటే ప్రతి నెల స్థిరమైన ఆదాయం వస్తుంది. ఆ వడ్డీని కుటుంబ ఖర్చులకు ఉపయోగించవచ్చు. లేదా ఈ రూ. 10 వేల‌ను చిట్టీలు లేదా ఆర్డీ వంటి స్కీమ్స్‌లో పెట్టుబ‌డి పెట్టొచ్చు. అసలు పెట్టుబడి అలాగే సుర‌క్షితంగా ఉంటుంది. వ‌డ్డీ వస్తూనే ఉంటుంది. ఈ పరిస్థితిలో అతను అద్దె ఇంట్లో ఉంటూ కూడా ఆర్థికంగా కొంత స్థిరత్వాన్ని పొందవచ్చు. అదే కాకుండా భవిష్యత్తులో పిల్లల చదువుకు డబ్బు ఉపయోగించుకోవచ్చు. వారికి మంచి విద్య‌ను అందిస్తే పిల్ల‌ల జీవితంలో స్థిర‌త్వం కూడా వ‌స్తుంది. భ‌విష్య‌త్తులో మ‌రింత పొదుపు చేసి తర్వాత ఇల్లు కొనుగోలు చేయవచ్చు

55
చివరికి ఏది మంచిది? సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి
Image Credit : Gemini AI

చివరికి ఏది మంచిది? సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి

ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి ఇల్లు కొనడం తప్పు కాదు, పెట్టుబడి పెట్టడం కూడా తప్పు కాదు. కానీ పరిస్థితికి తగ్గట్టు నిర్ణయం తీసుకోవాలి. జీతం రూ.70,000 – రూ.80,000 కంటే ఎక్కువ ఉంటే ఇల్లు కొనడం మంచి నిర్ణ‌యం అవుతుంది. EMI చెల్లించిన తర్వాత కూడా పొదుపు చేయగలిగితే, స్థిరమైన ఉద్యోగం ఉంటే అప్పుడు ఇల్లు కొన‌డం మంచిది.

అదే విధంగా జీతం పరిమితంగా ఉండి, కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉండం, పిల్లల చదువు ప్రధాన లక్ష్యంగా ఉంటే మాత్రం పెట్టుబ‌డి పెట్ట‌డం బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. మ‌న తీసుకున్న ఉదాహరణలో చూస్తే రూ.50,000 జీతంతో రూ.20,000 EMI చాలా భారంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితిలో ముందుగా పెట్టుబడి పెట్టి ఆదాయం పెంచుకోవడం, తర్వాత ఆర్థిక స్థితి మెరుగుపడినప్పుడు ఇల్లు కొనడం మంచి నిర్ణయంగా భావించవచ్చు. మొత్తం మీద సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. కానీ ఆ కల కోసం ఆర్థిక భద్రతను కోల్పోవడం సరైన మార్గం కాదు.

ముందుగా పెట్టుబడులు పెంచి, ఆదాయ మార్గాలు పెంచుకుంటే భవిష్యత్తులో ఇల్లు కొనడం కూడా సులభం అవుతుంది, పిల్లల భవిష్యత్తు కూడా భద్రంగా ఉంటుంది. అందుకే నిర్ణయం తీసుకునే ముందు మిమ్మ‌ల్ని మీరు ఒక ప్ర‌శ్న వేసుకోండి. ఇప్పుడే ఇల్లు కొనాలా? లేక ముందుగా ఆర్థికంగా బలపడాలా? సరైన సమాధానం మీ పరిస్థితిని బ‌ట్టే ఉంటుంది.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. పెట్టుబ‌డికి సంబంధించి ఆర్థిక నిపుణుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: పాతాళానికి పసిడి ధరలు, కుప్పకూలిన వెండి.. ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసా?
Recommended image2
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image3
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Related Stories
Recommended image1
డ‌బ్బులుంటేనే గొప్ప అనుకుంటున్నారా.? ఈ పుస్త‌కం చ‌దివితే మీ ఆలోచ‌న మార‌డం ఖాయం
Recommended image2
Cooler: రిమోట్ కంట్రోల్‌, ట‌చ్ ప్యాన‌ల్‌.. కూల‌ర్‌లో ఏసీలాంటి ఫీచ‌ర్లు ఏంటి భ‌య్యా.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved