Holi: హోలీ రోజు ఈ పరిహారాలు పాటిస్తే.. దోషాలన్నీ తొలగిపోయి, అదృష్టం కలిసొస్తుంది
చెడుపై మంచి సాధించిన విజయాన్ని చిహ్నంగా జరుపుకునే పండుగ హోలీ. దేశవ్యాప్తంగా, ఆమాటకొస్తే విదేశాల్లో ఉండే హిందువులు కూడా ఎంతో ఘనంగా హోలీ పండుగను జరుపుకుంటారు. రంగులు జల్లుకుంటూ సరదాగా గడుపుతారు. శాస్త్రంలో కూడా హోలీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. హోలీ పండుగ రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షంతో పాటు ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు..

ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీ పండుగను నిర్వహిస్తారు. ఈ ఏడాది మార్చి 14వ తేదీన హోలీ పండుగను జరుపుకోనున్నారు. పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఫాల్గుణ మాసం పౌర్ణమి తిధి మార్చి 13వ తేదీన ఉదయం 10:35 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఈ తిధి మార్చి 14న మధ్యాహ్నం 12:23 గంటలకు ముగుస్తుంది. దీంతో మార్చి 13న హోలికా దహనం, ఆ తర్వాతి రోజు హోలీ పండుగను జరుపుకోనున్నారు. హోలీ పండుగ రోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల సమస్యలన్నీ దూరమవుతాయని పండితులు చెబుతున్నారు. అవేంటంటే..

ఉదయించే సూర్యూని ఫొటో ఏర్పాటు చేసుకోవాలి:
హోలీ రోజున ఉదయించే సూర్యుని ఫొటో ఏర్పాటు చేసుకుంటే మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఇంట్లో, వ్యాపార స్థలంలో లేదా ఆఫీసుల్లో తూర్పు దిశగా ఈ చిత్ర పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. అదే విధంగా ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆర్థికంగా కలిసొస్తుంది.
వెండి వస్తువులు కొనుగోలు చేయడం మంచిది:
హోలీ రోజున వెండి వస్తువులు లేదా నాణెం కొనుగోలు చేయడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవి ముందు వెండి నాణెన్ని ఉంచి పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా పూజించిన తర్వాత నాణెన్ని పర్సు లేదా మీ డబ్బులు ఉన్న చోట ఉంచితే లక్ష్మీ కాటాక్షం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి.
వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే:
వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే హోలీ పండుగ రోజు ఒక పరిహారం చేయాలని పండితులు చెబుతున్నారు. బెడ్ రూమ్‌లో రాధాకృష్ణుడి ఫొటోను ఏర్పాటు చేయాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో నెలకొన్ని సమస్యలు దూరమవుతాయి.
tulsi
తులసి మొక్క నాటితే చాలా మంచిది:
హోలీ రోజు ఇంట్లో తులసి మొక్కను నాటితే అదృష్టం కలిసొస్తుందని శాస్త్రం చెబుతోంది. హిందూ మతంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిసిందే. తులసిని లక్ష్మీదేవీతో సమానంగా పూజిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం హోలీ రోజున తులసి మొక్కను నాటడం వల్ల లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు దూరమై, సంతోషంగా ఉంటారు.
నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

