Hanuman Jayanthi: హనుమాన్ జయంతి ఈ రాశులకు అదృష్టాన్ని మోసుకురావడం పక్కా..!
ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 12వ తేదీన వస్తోంది. ఈ రోజున హనుమంతుడితో పాటు శనిదేవుడిని కూడా పూజిస్తే, రెండు రాశుల వారికి ఊహించని లాభాలు కలగనున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
hanumanji
హిందూ సంప్రదాయంలో ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించడం ఒక పవిత్రమైన ఆచారం.ఈ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఆధ్యాత్మికంగా కాకుండా ఆర్థికంగా కూడా ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 12వ తేదీన వచ్చింది. ఈ పవిత్ర రోజున హనుమంతుడితో పాటు. శని దేవుడిని కూడా పూజించాలట. ఇలా పూజించడం వల్ల రెండు రాశుల వారికి చాలా శుభం జరుగుతుందట. మరి, ఆ రెండు రాశులేంటో చూద్దాం..
telugu astrology
1.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎదుర్కొంటున్న డబ్బు సమస్యలు తగ్గిపోతాయి. పొదుపు పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. పని పరిస్థితుల్లోనూ మెరుగుదల కనిపిస్తుంది. కోర్టు కేసులు వంటివి కూడా సానుకూలంగా పరిష్కారం కావచ్చు. వ్యాపారం చేస్తున్నవారికి పెట్టుబడులకు మంచి అవకాశాలు లభించొచ్చు. అనేక విధాలుగా వృశ్చిక రాశివారికి ఇది అనుకూల సమయంగా మారుతుంది.
telugu astrology
2.మేష రాశి..
ఇక మేష రాశి విషయానికి వస్తే, హనుమంతుడి అనుగ్రహంతో వారి ఆర్థిక పరిస్థితుల్లో స్పష్టమైన మెరుగుదల ఉంటుంది. ఇప్పటి వరకు నిరుత్సాహంగా ఉన్న వారు కొత్త శక్తిని, ధైర్యాన్ని పొందుతారు. ప్రతి పనిలో విజయాల దిశగా సాగిపోతారు. ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. కుటుంబంలో ఆనందం, శాంతి చేకూరుతుంది. కోరుకున్నవి అన్నీ నెరవేరే సూచనలు కనిపిస్తాయి.
ఇలాంటి పవిత్ర దినాల్లో హనుమంతుడి పూజతో పాటు శనిదేవునికి నైవేద్యం సమర్పించి, భక్తితో ప్రార్థనలు చేయడం వల్ల శుభఫలితాలు తప్పక వస్తాయని జ్యోతిష నిపుణుల సూచన.