Devotional: గురుపౌర్ణమి సందర్భంగా ఇలా చేయండి.. సమస్యలు దూరమై అదృష్టం మీ వెంటే?
Devotional: పండగలలో గురు పౌర్ణమి కి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. మన పాపాలు తొలగటానికి ఆరోజు చేయవలసిన దానాలు, పఠించవలసిన శ్లోకాలు ఏంటో చూద్దాం.

నేడు గురు పౌర్ణమి అంటే సాయిబాబా ఆరాధనకి ప్రత్యేకమైన దినముగా భావిస్తున్నారు. కానీ గురు పౌర్ణమి వేదాలను రచించిన మహర్షి వేద వ్యాసుని యొక్క జన్మదినం. ఆయన 4 వేదాలను రచించిన మహర్షి అందుకే ఆయనను వేద గురువుగా భావించి ప్రత్యేకంగా ఈ రోజున ఆయనని ప్రత్యేకంగా కొలుచుకునే సాంప్రదాయం ఎప్పటినుంచో వస్తుంది.
అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు.అయితే ఈరోజు కొన్ని శ్లోకాలు పట్టించడం వల్ల మరికొన్ని దానాలను చేయటం వలన మనకున్న సకల పాపాలు నశించడంతోపాటు అపారమైన ధన లాభం కలుగుతుంది. అవేంటో చూద్దాం. గురుపూర్ణిమ తిరిగి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది.
మీరు మీ జీవితంలో బృహస్పతి గ్రహం యొక్క చెడు దృష్టి మీ జాతకం పై పడినట్లు అయితే అప్పుడు గురుపూర్ణిమనాడు భృహస్పతి స్తోత్రాన్ని పఠించండి. శుక్రుడు జీవితంలో ప్రేమ విలాసానికి నియంత్రికా అని చెప్పబడింది మీకు మీ జీవితంలో ఆర్థిక సమస్యలు లేదా మీ ప్రేమ జీవితంలో ఉద్రిక్తత ఉంటే..
ఈ రోజున శుక్ర మంత్రాన్ని జపించడం వలన అపారమైన పుణ్యం లభిస్తుంది. అలాగే రాత్రివేళ చంద్రుడిని దర్శించిన తరువాత చంద్రుడికి పాలు నీటితో అర్గ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేయటం వలన మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఈరోజు నా పేదలకి వీలైనంత సాయం చేయండి.
వస్త్రాలను, స్వీట్స్ దానం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి దీని వలన గురుదోషం కూడా పోతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వ్యక్తులు బియ్యంతో పాయసం చేసి పేద ప్రజలకి పౌర్ణమి రోజు పంచాలి దీని వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.
guru purnima 2022
ఇంకా ముఖ్యమైనది మీ గురువు యొక్క ఆశీర్వచనం తీసుకోవడం ఇది అన్నింటికీ మించిన పుణ్యఫలం. ఇంకా ఈరోజు మహాలక్ష్మిని అలాగే షిరిడి సాయినాధుడిని పూజించటానికి కూడా దివ్యమైన రోజు.