Sun Saturn Conjuction: రెండు శత్రు గ్రహాల కలయిక.. ఈ రాశులకు మాత్రం లాభమే..!
Sun Saturn Conjuction: గ్రహాలు తరచూ మారుతూనే ఉంటాయి. ఈ మారేక్రమంలో ఒకే రాశిలో రెండు, మూడు గ్రహాల అరుదైన కలయిక ఏర్పడుతూ ఉంటుంది. దీని ప్రభావం అన్ని రాశులపై పడుతుంది.

Sun -Saturn
జోతిష్యశాస్త్రం ప్రకారం ఫిబ్రవరిలో సూర్యుడు, శని దేవుడు మీన రాశిలో కలవబోతున్నారు. జోతిష్య శాస్త్రంలో సూర్య-శని కలయికను ఒక సంక్లిష్టమైన కలయికగా భావిస్తారు. ఎందుకంటే.. వీరిద్దరూ తండ్రీ కొడుకులైనప్పటికీ.. పరస్పర విరోధులు. సూర్యుడు అధికారాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తే., శని క్రమశిక్షణను, కర్మ ఫలాలను సూచిస్తాడు. ఈ రెండింటి కలయిక కొన్ని రాశుల వారికి కష్టపడే తత్వాన్ని పెంచి, దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. మరి, ఈ కలయిక కారణంగా లాభపడే రాశులేంటో చూద్దాం...
వృషభ రాశి...
శని, సూర్య కలయిక వృషభ రాశివారికి 11వ స్థానంలో( లాభ స్థానం) జరుగుతుంది. ఈ రాశివారికి ఈ సమయంలో చాలా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయ మార్గాలు అకస్మాత్తుగా పెరుగుతాయి. గతంలో ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి.ఆఫీసులో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. పై అధికారులు మీ పనితీరును ప్రశంసిస్తారు. అయితే.. ఈ సమయంలో సంపాదన ఎక్కువగా వస్తుంది కదా అని.. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
మిథున రాశి..
మిథున రాశి వారికి ఈ కలయిక 10వ స్థానంలో సంభవిస్తుంది. ఈ సమయంలో మిథున రాశివారికి ఉద్యోగ రీత్యా మీరు చేసే కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కెరీర్ పరంగా కూడా బాగుంటుంది. ప్రభుత్వ, లేదా పెద్ద సంస్థల నుండి కాంట్రాక్టులు వచ్చే అవకాశం ఉంది. మంచి హోదాకు వెళతారు. అయితే.. ఈ రాశివారు ఈ సమయంలో తండ్రితో లేదా పై అధికారులతో చిన్నపాటి వాదనలు రావచ్చు. కాబట్టి, వీలైనంత వరకు మౌనంగా ఉండాలి.
తుల రాశి...
తులా రాశి వారికి ఈ సంయోగం 6వ స్థానంలో (శతృ, రోగ స్థానం) జరుగుతుంది.దీని కారణంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. జ్యోతిష్య రీత్యా 6వ స్థానంలో సూర్య-శని కలయిక 'విజయానికి' సంకేతం. మీ శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి. అయితే.. ఈ సమయంలో ఎవరికైనా అప్పులు ఇచ్చే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు రాశి...
ధనుస్సు రాశి వారికి ఈ సంయోగం 4వ స్థానంలో (సుఖ స్థానం) జరుగుతుంది.
ప్రయోజనాలు: ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలు బలంగా ఉన్నాయి.
కుటుంబం: కుటుంబంలో ఉన్న గందరగోళం తొలగిపోయి క్రమశిక్షణ ఏర్పడుతుంది. తల్లిగారి వైపు నుండి లాభాలు పొందుతారు.
ముఖ్య గమనిక: మానసిక ప్రశాంతత కోసం యోగా చేయడం మంచిది.
ఈ సంయోగం వల్ల కలిగే సాధారణ మార్పులు
సూర్య-శని కలయిక వల్ల ఈ రాశుల వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి:
అహంకారం వద్దు: సూర్యుడి వల్ల వచ్చే అధికారాన్ని శని దేవుడు గమనిస్తుంటాడు, కాబట్టి వినయంగా ఉండటం ముఖ్యం.
శ్రమకు వెనకాడొద్దు: అదృష్టం కంటే మీ 'కర్మ' (పని) మీద శని దేవుడు ఎక్కువ దృష్టి పెడతాడు. మీరు ఎంత కష్టపడితే అంత గొప్ప ఫలితం ఉంటుంది.
సమయపాలన: పనులను వాయిదా వేసే అలవాటును వదులుకోవాలి.
పరిహారాలు (Remedies)
ఈ కాలంలో మరింత శుభ ఫలితాల కోసం:
ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించండి.
శని దేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి.
పేదలకు లేదా కష్టజీవులకు అన్నదానం చేయడం వల్ల సూర్య-శని దోషాలు తొలగిపోతాయి.

