Garuda Puranam: మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా.? నరకానికి వెళ్తారు జాగ్రత్తా..
Garuda Puranam: హిందూ శాస్త్రాల్లో స్వర్గం, నరకం అనే భావనలు స్పష్టంగా వివరించారు. గరుడ పురాణం ప్రకారం కొన్ని పనులు చేసే వారు నరకానికి వెళ్తారని విశ్వాసం. ఇంతకీ ఆ తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కోపానికి బానిసవ్వడం
ఎప్పుడూ చిన్న విషయానికే కోపం తెచ్చుకుని, పెద్దా – చిన్నా అనే తేడా లేకుండా అందరితో ఆగ్రహంగా ప్రవర్తించే వ్యక్తి నరకానికి చేరుకుంటాడని గరుడ పురాణం చెబుతోంది. కోపం మనుషుల మధ్య సంబంధాలను చెడగొడుతుంది. కాబట్టి మనసు శాంతిగా ఉంచుకోవడం అత్యంత అవసరం.
కఠినమైన మాటలు మాట్లాడటం
కఠినంగా, ఎగతాళిగా లేదా ఇతరుల మనసు నొప్పించేలా మాట్లాడే వ్యక్తులు మరణానంతరం నరకంలో శిక్ష అనుభవిస్తారని పురాణం చెబుతోంది. మాటల్లో మాధుర్యం ఉండాలి. ఇతరులను అవమానించడం కంటే, సత్సంగతితో మాటల్ని మలచుకోవాలి.
స్వార్థం, దురాశతో జీవించడం
ఎప్పుడూ తమ గురించి మాత్రమే ఆలోచిస్తూ, ఇతరుల మంచిని పట్టించుకోని వారు నరకంలో బాధపడతారని శాస్త్రాలు చెబుతున్నాయి. స్వార్థం, దురాశ మనిషిని క్రూరంగా మార్చుతాయి. అందుకే పరుల సంక్షేమం గురించి ఆలోచించే మనసు కలిగి ఉండాలి.
చెడు సహవాసం
తానే పాపం చేయకపోయినా, చెడు అలవాట్లు కలిగినవారితో స్నేహం చేస్తే అదే నరకానికి కారణమవుతుంది. మిత్రబంధువులను ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సత్సంగతే మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది.
తల్లిదండ్రులను అవమానించడం
జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించని వారు శాంతిని కోల్పోతారని గరుడ పురాణం హెచ్చరిస్తోంది. పెద్దలను తక్కువగా చూడటం, వారితో కోపంగా ప్రవర్తించడం పాపంగా పరిగణిస్తారు. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం అంటే దేవుళ్లను పూజించడం లాంటిదే.
కృతజ్ఞత లేకపోవడం
తమకు సహాయం చేసిన వారిని గుర్తుపట్టకుండా, కృతజ్ఞత చూపకపోవడం కూడా నరకానికి దారి తీస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కృతజ్ఞత మనిషి జీవితాన్ని పవిత్రంగా నిలుపుతుంది.