Gajakesari Yoga: నవంబర్ 12 తర్వాత ఈ రాశులకు చుక్కలే... డబ్బులన్నీ పోయినట్లే..!
Gajakesari Yoga: బృహస్పతి, చంద్రుల కలయిక కారణంగా.. కొన్ని రాశుల వారు ఆర్థిక సమస్యలన్నీ ఎదుర్కోవలసి ఉంటుంది. గ్రహాల మార్పులు ఈ రాశులకు చుక్కలు చూపించనున్నాయి.

గజకేసరి యోగం..
జోతిష్యశాస్త్రంలో చంద్రుడిని వేగంగా కదిలే గ్రహంగా పరిగణిస్తారు. ఇది ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది. ఈ సమయంలో ఇది ఇతర గ్రహాలతో కూడా కలుస్తుంది. దీని వల్ల.. కొన్నిసార్లు శుభ యోగాలు, మరికొన్ని సార్లు అశుభ యోగాలను ఏర్పరుస్తాయి.చంద్రుడు నవంబర్ 12వ తేదీన తన సొంత రాశి అయిన కర్కాటకంలో కి ప్రవేశిస్తాడు. బృహస్పతి ఇప్పటికే అక్కడ ఉన్నాడు. ఈ కలయిక చాలా ప్రత్యేకంగా.. దీని వల్ల అరుదైన యోగం ఏర్పడుతుంది. దీనినే గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీని వల్ల మూడు రాశులకు ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దామా....
1.మేష రాశి....
గజకేసరి యోగం మేష రాశివారికి పెద్దగా అనుకూలంగా ఏమీ ఉండదు. ఈ సమయంలో మీకు ఏ పని చేసినా పెద్దగా కలిసి రాదు. పనిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కెరీర్ లో పురోగతి ఉండదు. రావాల్సిన డబ్బు ఆగిపోతుంది. వైవాహిక జీవితంలో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం తగ్గుతుంది. ఎక్కువగా గొడవలు జరిగే అవకాశం ఉంది. నవంబర్ 12న మేష రాశి 4వ ఇంట్లో గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు చాలా ప్రశాంతంగా ప్రవర్తించాలి. తొందరపాటు నిర్ణయాలు దీర్ఘకాలిక సమస్యలను సృష్టిస్తాయి. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదు. పేదవారిని అవమానించవద్దు. లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించాలి.
2.కుంభ రాశి...
నవంబర్ 12న, కుంభ రాశి 6వ ఇంట్లో గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కుంభ రాశి వారికి అంత లాభదాయకం కాదు. కొత్త ఆదాయ మార్గాలను కనుగొనడం మీకు కష్టంగా అనిపించవచ్చు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు వ్యాపారం, పెట్టుబడి నుండి నష్టాలను చవిచూడవచ్చు. నిరుద్యోగులకు ఇది నిరాశపరిచే సమయం. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు కోల్పోయే అవకాశం ఉంది. చాలా కాలంగా ఆదాయం పెరుగుదల కోసం ఎదురుచూస్తున్న వారు నిరాశ చెందుతారు. పనిలో ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా క్షీణించవచ్చు. ఈ సమయంలో ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. ఎవరితోనైనా వాదించడం వల్ల సమస్యలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు సంపాదించే మార్గాలు క్రమంగా తగ్గుతాయి.
తుల రాశి...
గజకేసరి యోగం కారణంగా తులారాశి వారికి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. లాభాలు , ఆదాయం ఆశించిన విధంగా ఉండవు. మీ కష్టానికి తగ్గట్టుగా ప్రయోజనాలు పొందడం మీకు కష్టంగా ఉంటుంది. పదోన్నతికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మతపరమైన, ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి తగ్గుతుంది. వ్యాపారంలో ఎక్కువ లాభం పొందడం మీకు కష్టంగా అనిపించవచ్చు. నవంబర్ 12న తులారాశి 10వ ఇంట్లో గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అన్ని సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఓపికగా ఉండటం ముఖ్యం. అలాగే, ఆర్థిక నష్టాలను నివారించడానికి లక్ష్మీదేవి మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.