Birth Month: ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిలు... భర్తను మహారాజులా చూసుకుంటారు..!
Birth Month:జోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని నెలల్లో జన్మించిన మహిళలు తమ భర్తలను అత్యంత ప్రేమ, గౌరవంతో చూస్తారు. వారు తమ భాగస్వామి ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారిని మహారాజులా చూసుకుంటారు.

Birth Month
వివాహ జీవితం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన దశ. జీవితాంతం కలిసి ఉండాలనే పెళ్లి చేసుకుంటారు. అంతేకాదు.. భార్యాభర్తలకు ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంటేనే వారు సంతోషంగా ఉంటారు. మరీ ముఖ్యంగా భార్య సంతోషంగానే.. భర్త సంతోషంగా ఉండగలడు. వైవాహిక జీవితంలో తమ భార్యల నుంచి అపారమైన ప్రేమను ఆశిస్తారు. తాము చెప్పినట్లు భార్య రావాలని కోరుకుంటారు. అయితే.. అందరికీ అలాంటి భార్యలు రాకపోవచ్చు. కానీ.... జోతిష్యశాస్త్రం ప్రకారం... కొన్ని నెలల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే... ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిలు.. తమ భర్తలను జీవితాంతం సంతోషంగా ఉంచుతారు. ఒక మహారాజులా చూసుకుంటారు. మరి, ఆ నెలలు ఏంటో చూద్దామా...
1.మార్చి...
మార్చి నెలలో జన్మించిన మహిళలు కరుణ, ప్రేమతో నిండి ఉంటారు. ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిలు భర్తపై అమితమైన ప్రేమ కురిపిస్తారు. వారు తమ భర్త అవసరాలను అర్థం చేసుకోవడంలో నిష్ణాతులు. భర్తకు అన్ని విషయాల్లో పూర్తిగా మద్దతు ఇస్తారు. వీరికి సహనం చాలా ఎక్కువ. భర్త, భర్త కుటుంబాన్ని చాలా సంతోషంగా ఉంచుకుంటారు. తమ భాగస్వామి కలలను ప్రోత్సహిస్తారు. వారిని చాలా గౌరవిస్తారు.
2.జులై...
జులై నెలలో జన్మించిన మహిళలు అభిరుచి, విధేయతకు ప్రతి రూపం. ఆమె భర్త, కుటుంబం కోసం ఆనందం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు అంకిత భావం చాలా ఎక్కువ. కుటుంబానికి, భర్తకు ఎక్కువ విలువ ఇస్తారు. బాధ్యతగా ఉంటారు. భర్త ఏది చెబితే అదే చేస్తారు. జీవిత భాగస్వామిని వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంచాలని అనుకుంటారు. వారు తమ భర్త కోరికలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయనను మంచిగా రాజులా చూసుకుంటారు.
3.సెప్టెంబర్...
సెప్టెంబర్‌లో జన్మించిన మహిళలు చాలా ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు. వారు తమ భర్తలను సంతోషపెట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. వారి భర్తలు విఫలమైతే, ఆ సమయంలో వారిని ఓదార్చుతారు. ఈ నెలలో జన్మించిన మహిళలు తమ భాగస్వాములను గౌరవిస్తారు. వారి భర్తకు ఎటువంటి హానిని సహించరు. వారు తమ భర్తల కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు.
డిసెంబర్..
డిసెంబర్‌లో జన్మించిన మహిళలు ఉల్లాసంగా, ఆశాజనకంగా ఉంటారు. వారు ఎల్లప్పుడూ తమ భర్తలను సంతోషపెట్టడానికి కొత్త మార్గాలను వెతుకుతారు. వివాహం పవిత్రమైనదని , వారు ఓపికగా ఉంటే, కుటుంబం సంతోషంగా ఉంటుందని వారు అర్థం చేసుకుంటారు. వారు తమ భర్త కోరికలు, అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. మంచి సలహా ఇవ్వడంలో కూడా తెలివైనవారు.