Jupiter Moon Conjunction: గజకేసరి రాజయోగం.. ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక వల్ల రాజయోగాలు ఏర్పడుతుంటాయి. మరో రెండు రోజుల్లో (జనవరి 17న) గురు, చంద్రుల కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం వల్ల 4 రాశులవారికి పట్టిందల్లా బంగారం కానుంది. ఆ 4 రాశుల్లో మీ రాశి ఉందో చెక్ చేసుకోండి.

గజకేసరి రాజయోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు, గురువు కేంద్ర స్థానాల్లో కలిసినప్పుడు 'గజకేసరి రాజయోగం' ఏర్పడుతుంది. ఈ యోగం అదృష్టం, సంపద, శ్రేయస్సుకు చిహ్నం. జనవరి 17న చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల 4 రాశుల వారికి ప్రయోజనం చేకూరనుంది. వారు పట్టిందల్లా బంగారం కానుంది. మరి ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందామా..
మిథున రాశి
మిథున రాశిలోనే గజకేసరి రాజయోగం ఏర్పడటం వల్ల ఈ రాశివారికి విశేష లాభాలుంటాయి. ఈ సమయంలో వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులు మొదలు పెట్టి విజయం సాధిస్తారు. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు చకచకా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు ఉండదు.
వృషభ రాశి
వృషభ రాశి ధన స్థానంలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఈ రాశివారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సౌకర్యాలు పెరుగుతాయి. వ్యాపారంలో పురోగతి కలుగుతుంది. ఆకస్మిక లాభాలు ఉంటాయి. పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. దాంపత్య జీవితం మరింత సంతోషంగా మారుతుంది.
సింహ రాశి
సింహ రాశి లాభ స్థానంలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఈ రాశి వారి వ్యక్తిత్వంలో కొత్త మెరుపు తీసుకువస్తుంది. వీరి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. పనిలో పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో మీ కష్టానికి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పూర్వీకుల నుంచి ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి 7వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. గజకేసరి రాజయోగం ధనుస్సు రాశివారికి అద్భుతమైన ఫలితాలు ఇవ్వనుంది. పెళ్లి సంబంధాలు చూసేవారు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగాల్లో ఉన్నత పదువులు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్నదమ్ములతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారు తీసుకునే కొన్ని నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి.

