MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!

Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!

Weekly Horoscope: ఈ వార ఫలాలు 1.11.2026 నుంచి 7.11.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

4 Min read
Author : Kavitha G
Published : Nov 01 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఈ వారం రాశి ఫలాలు
Image Credit : AI

ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

మేష రాశివారికి ఈ వారం ఉద్యోగ, ఉపాధి, వృత్తి పరంగా ఆశాజనకంగా ఉంటుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న బదిలీకి సంబంధించిన శుభవార్త అందే అవకాశం ఉంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు ప్రయాణాల ద్వారా లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో సానుకూల పరిణామాలు చోటుచేసుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృషభ రాశివారికి ఈ వారం శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరిగినప్పటికీ పట్టుదలతో వ్యవహరిస్తే మంచి గుర్తింపు వస్తుంది. ప్రభుత్వ సంబంధిత పనులు, పెండింగ్‌లో ఉన్న వ్యవహారాలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. వ్యాపారులు కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవాలి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ వారం చివరలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

మిథున రాశివారికి ఈ వారం కొత్త అవకాశాలు, ఆర్థిక పురోగతికి సంబంధించిన సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు మంచి పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. మీ ప్రతిభను ఉన్నతాధికారులు గుర్తించే అవకాశం ఉంది. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలం. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. సంతానానికి సంబంధించిన పాత సమస్యలు పరిష్కారమై మానసిక ప్రశాంతత కలుగుతుంది.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న పొరపాటు కూడా ఇబ్బందులకు కారణం కావచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు ఓపిక పట్టాలి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తిస్థాయిలో పరిశీలించాలి. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థికంగా ఊహించని ఖర్చులు రావచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు రాకుండా స్పష్టంగా మాట్లాడాలి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సింహ రాశివారికి ఈ వారం కొన్ని విషయాల్లో అనుకూలత, మరికొన్ని విషయాల్లో సవాళ్లు ఎదురుకావచ్చు. ఉద్యోగాలలో ఎదురయ్యే సమస్యలను సహనంతో పరిష్కరించుకోవాలి. ఉద్యోగం మారాలనే ఆలోచన వచ్చినప్పటికీ తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. వ్యాపారాలలో పోటీ పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అన్ని వివరాలను రాతపూర్వకంగా ఉంచుకోవాలి. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. సోదరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కన్య రాశివారికి ఈ వారం అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. చాలా కాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు ముందుకు సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రేమికులకు అనుకూల సమయం. ఆర్థిక ఒప్పందాలు, పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

తుల రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం కొంత తగ్గవచ్చు. ఉద్యోగాలలో ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రణాళికలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. ఉన్నతాధికారులతో వాదనలకు పోవద్దు. వ్యాపారాలలో భాగస్వామ్య ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పాటించాలి. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు వచ్చినా పెద్దల జోక్యంతో పరిష్కారమవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశివారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ముందుగానే బడ్జెట్ రూపొందించుకోవాలి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. ఉద్యోగులకు పనిభారం పెరిగినా క్రమశిక్షణతో పనిచేస్తే మంచి గుర్తింపు లభిస్తుంది. వారం చివర్లో కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయభేదాలు రావచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. సంతానానికి సంబంధించిన విషయాల్లో ఓర్పుతో వ్యవహరించాలి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశివారికి ఈ వారం శుభపరిణామాలు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్నేహితులు, ఉన్నతాధికారుల సహకారం అందుతుంది. వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ప్రభుత్వ లేదా న్యాయపరమైన వ్యవహారాల్లో అనుకూల పరిణామాలు ఎదురవుతాయి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. దాంపత్య జీవితంలో సంతోషం ఉంటుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

మకర రాశివారికి ఈ వారం వృత్తి, ఉద్యోగ రంగాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు శాలరీ విషయంలో శుభవార్త అందుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు కొనసాగుతాయి. ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూల సమయం. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనులు సులభంగా పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దాంపత్య జీవితంలో సంతోషం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

కుంభ రాశి వారికి ఈ వారం కొంత ఒత్తిడితో కూడుకుంటుంది. ఉద్యోగులు లక్ష్యాలను చేరుకోవడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు అన్ని వివరాలను పరిశీలించాలి. ప్రభుత్వ, న్యాయపరమైన వ్యవహారాలు ఆలస్యమవుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కొత్త ఆలోచనలు వచ్చినప్పటికీ వాటిని అమలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థికంగా అనుకోని ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా అప్పులు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

మీన రాశివారికి ఈ వారం సృజనాత్మకత, కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. ఉద్యోగులకు తమ పనితీరుతో మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలలో కొత్త కస్టమర్లు పెరుగుతారు. ప్రయాణాలు లాభదాయకం. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది. దాంపత్య జీవితంలో పరస్పర సహకారం ఉంటుంది. పిల్లల విషయంలో, ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి మిత్రుల నుంచి శుభవార్తలు.. అనుకూలంగా డబ్బు వ్యవహారాలు!
Recommended image2
November 2026 Horoscope: నవంబర్ లో ఈ రాశులవారికి అదృష్టం! డబ్బు, ఉద్యోగం, పెళ్లి విషయంలో శుభవార్తలు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Related Stories
Recommended image1
Cashew Capital: మన దేశపు జీడిపప్పు రాజధాని ఏదో తెలుసా? ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకు ఎగుమతి!
Recommended image2
November 2026 Horoscope: నవంబర్ లో ఈ రాశులవారికి అదృష్టం! డబ్బు, ఉద్యోగం, పెళ్లి విషయంలో శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved