Father's day 2022 : ఏ రాశిచక్రానికి చెందిన తండ్రులు ఎలా ఉంటారంటే...
ప్రపంచాన్ని తన వెలుగుతో వెలిగించే సూర్యుడి ప్రతిబింబమే నాన్న... జ్యోతిషకారులు కూడా అదే చెబుతున్నారు. తండ్రి సూర్యునికి ప్రతీక అని వారు చెబుతున్నారు. "జీరో న్యూమరాలజీ" సూత్రాల ఆధారంగా రాశి చక్రాన్ని అనుసరించి.. ఏ తండ్రి ఎలా బిహేవ్ చేస్తారో చూడండి..

<p>fathers day</p>
పిల్లలకు అమ్మ తరువాత.. మొదటి స్నేహితుడు నాన్న. వేలుపట్టి నడిపిస్తూ భవిష్యత్తుకు చక్కటి మార్గనిర్దేశనం చేసే మార్గదర్శి నాన్న.. పిల్లల జీవితాల్లో వెలుగునింపే వేగు చుక్క నాన్న.. పిల్లల ఎదుగుదలలో ప్రతీ అడుగులోనూ తానుంటాడు.. వారి తప్పటడుగులను సరిచేస్తూ.. అడుగులు వేయిస్తాడు.. నాన్న.. చెప్పాలంటే నాన్న.. ఓ సూర్యుడు..
Aries Zodiac
మేషరాశి
మేషరాశి వారు సాధారణంగా, చాలా సీరియస్ వ్యక్తులు. ఈ రాశి తండ్రులూ దీనికి మినహాయింపు కాదు. వారు పూర్తిగా నిబద్ధత కలిగి ఉంటారు, పిల్లలు వారి అభిరుచిని అనుసరించడానికి, కళాత్మక నైపుణ్యంపై దృష్టి పెట్టడానికి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తారు. అయితే ఈ రాశి తండ్రులతో సమస్యలున్నాయి. పిల్లలతో ఓపికగా వ్యవహరించడంలో వీరు కాస్త ప్రాక్టీస్ చేయాలి. మరింత సహనం అలవరుచుకోవాలి. ఏదేమైనా వీరు చాలా కమిటెడ్ డాడ్స్.
Taurus Zodiac
వృషభం
వృషభరాశి తండ్రులు తమ పిల్లల పట్ల చాలా ఓపికగా ఉంటారు. బాలా బ్యాలెన్స్ డ్ గా ఉంటారు. పిల్లల ఎదుగుదలతో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వీరు చాలా గ్రౌండెడ్ గా ఉంటారు. చాలా స్టబర్న్ గా ఉంటారు. ఈ లక్షణాల వల్లే వీరికి కుటుంబం అంటే చాలా ఇష్టం, ప్రేమ ఉంటాయి. మిగతా రాశులన్నింటిలోనూ వృషభరాశి తండ్రులు ది బెస్ట్.
Gemini Zodiac
మిధునరాశి
మిథునరాశి వారు ద్విముఖులుగా ప్రసిద్ధి. వీరు ఒకసారి పిల్లలతో ఎంతో ప్రేమగా, ప్రశాంతంగా, కరుణతో ఉంటారు. మరు నిముషంలోనే.. ముఖ్యమైన ప్రాజెక్టు పనుల్లో బిజీ అయిపోయి గంటల తరబడి అందులో మునిగిపోయి.. లోకాన్నే మరిచిపోతారు. ఈ రెండు లక్షణాలను మిథునరాశి తండ్రులు సమన్వయం చేసుకోగలిగితే... మిగతారాశి తండ్రులకంటే ఒకడుగు ముందుంటారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి తండ్రులు అప్పుడప్పుడు ఒత్తిడికి గురవుతుంటారు. అయితే, మరోవైపు పిల్లలను ఎంతో బాగా చూసుకునే లక్షణం వీరి సొంతం. వీరు చాలా భావోద్వేగులు. వారి పిల్లలు ఏడ్చినప్పుడు వీరూ ఏడ్చేస్తారు. అది వారిని బాగా ప్రభావితం చేస్తుంది. వారు తమ పిల్లలకు ప్రేమ పంచడంతో, శ్రద్ధ చూపించడంలో మంచి తండ్రులుగా ఉండటానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు.
Leo Zodiac
సింహ రాశి
లియో రాశి తండ్రులు మస్తు మొండివారు. ఇతర రాశిచక్రాలకు చెందిన తండ్రులతో పోలిస్తే ఎక్కువ హెడ్ స్ట్రాంగ్ ఉన్న తండ్రులు. కానీ వీరి ప్రత్యేకత ఏమిటంటే, వారి పిల్లలతో చాలా ఉల్లాసంగా ఉండటానికి ఇష్టపడతారు. పిల్లలు వారు కోరుకున్నంత సమయం లియో రాశి తండ్రులతో ఆడుకోవడానికి ఇష్టపడతారు. తండ్రులు కూడా వారి పిల్లలతో కలిసి ఆడతారు. అంతేకాకుండా, లియో రాశి నాన్నలు పిల్లల లాంటి స్థితిలో ఉండటానికి ఇష్టపడతారు. పిల్లలతో ఉన్నప్పుడు బాగా ఆనందిస్తారు. లియో తండ్రులకుండే మొండితనం వారు పిల్లలతో ఎంత చనువుగా ఉన్నా...వారి పిల్లలను క్రమశిక్షణలో ఉంచడానికి వారిని ప్రోత్సహిస్తుంది.
కన్య
కన్య రాశి వారు దృఢ నిశ్చయం, అభిప్రాయాలు, దృఢ సంకల్పం గల తండ్రులు. వారు తప్పనిసరిగా తమ పిల్లల ఇష్టాలకు అంతగా అనుగుణంగా ఉండనప్పటికీ తమ పిల్లలతో చక్కటి అటాచ్ మెంట్ కలిగిఉంటారు. వారు పిల్లలనుంచి మంచి ప్రవర్తన మాత్రమే కోరుకుంటారు. దీనివల్ల చాలాసార్లు వీళ్లు బాధపడతారు. ఏడుస్తారు కూడా. అయితే, వీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే... పిల్లల్ని తాము అనుకున్నదే సాధించాలని బలవంతం చేయడం కంటే వారిని గమనిస్తూ ప్రోత్సహించాలి. అప్పుడే పిల్లలు జీవితంలో చాలా ఎదుగుతారు. జీవితంలో క్రమబద్ధంగా ఉంటారు.
Libra Zodiac
తులారాశి
తులారాశి వారు.. వారి పిల్లలకు గొప్ప తండ్రులుగా ఉంటారు. ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ మంది పిల్లలుంటారు వీరికి. అంతేకాకుండా, వారు తమ జీవితంలో ప్రతిదీ సజావుగా, న్యాయంగా ఉంచడానికి ఇష్టపడతారు. వారు అహంభావానికి విరుద్ధంగా ఉంటారు. ప్రజలు వారిని ఏమనుకుంటున్నారో అనేది పట్టించుకోరు. వారి ఈ మనస్తత్వమే ఇంటిని స్వర్గంగా మార్చేస్తుంది. అయితే, మతిమీరిన మంచితనం కూడా పనికిరాదన్నది గుర్తు పెట్టుకోవాలి.
Scorpio Zodiac
వృశ్చికరాశి
వృశ్చిక రాశి పురుషులు చాలా ఇంటెన్స్ గా ఉంటారు. దీని అర్థం వృశ్చికరాశి నాన్నలు చాలా గంభీరంగా ఉంటారు, దృఢంగా ఉంటారు. వారు పిల్లలతో ఆడటానికి ఇష్టపడరు. అయితే, పిల్లలతో దయగా ఉంటారు. ఒక ఆసక్తికరమైన వ్యక్తిగా, పిల్లల గురించి ప్రతిదీ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటారు.
Sagittarius Zodiac
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారి తండ్రులు సరదాలు, సాహసాలు చేస్తారు. ప్రయాణాలు ఇష్టపడతారు. బంధనాలను ఇష్టపడరు. కుటుంబ సమేతంగా సాహస యాత్రలను ఇష్టపడతారు. వారిని నిరంతరం తిప్పుతూనే ఉంటారు. వీరు ఫాదర్స్ గా ది బెస్ట్ అయితే ఇంట్లో ఉంటే మాత్రం ఆందోళన పడుతుంటారు.
Capricorn Zodiac
మకరరాశి
మకరరాశి తండ్రులు తమ పిల్లలను అనేక యాక్టివిటీల కోసం సిద్ధం చేయడానికి ప్లాన్ చేసేవారిలో మొదటివారుగా ఉంటారు. తండ్రిగా ప్రతి అంశం గురించి వారికి బోధించడంలో ఆనందిస్తారు. ఇంకా, మకర రాశి తండ్రులు విశ్వసనీయతను ఇష్టపడతారు. అతి ప్రేమతో పిల్లలను పాడుచేసే ప్రమాదమూ ఉంది.
Aquarius
కుంభ రాశి
కుంభ రాశి తండ్రులు జీవితంలో వారికంటూ రూల్స్ పెట్టుకుని ముందుకు సాగుతుంటారు. ఇది పిల్లలను ఇబ్బందుల్లో పడేస్తుంది. కుంభ రాశి తండ్రులు తమ పిల్లలను సృజనాత్మక ప్రపంచం, కళలను అన్వేషించమని ప్రోత్సహిస్తున్నప్పటికీ, ప్రాపర్ షెడ్యూల్‌కి కట్టుబడి ఉండరు.
Pisces Zodiac
మీనరాశి
మీనం రాశికి చెందిన తండ్రి కళాత్మకం, భావోద్వేగం, దయగలవారు, ఉదారంగా ఉంటాడు. కానీ వాటిని ఇతర రాశులవారి నుండి భిన్నంగా ఉంచే ఒక విషయం ఏమిటంటే, ఒకసారి ఒకే విషయంపై దృష్టి పెట్టలేకపోవడం. అయితే.. పిల్లలు పిల్లలే.. తమ తల్లిదండ్రుల మానసిక స్థితిగతులను పట్టించుకోరు. అయినా కూడా.. మీనరాశి తండ్రి పిల్లలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.