Birth date: ఈ తేదీల్లో పుట్టిన వారిని సీక్రెట్ గా అభిమానించేవారు చాలా మందే ఉంటారు..!
ఈ తేదీల్లో జన్మించిన వారు సహజంగా సున్నితమైన, ప్రేమ పూర్వక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు ఎక్కడ ఉన్నా.. చాలా మంది మనసులను గెలుచుకోగలరు.

Birth Date
మన చుట్టూ ఉండే కొందరిలో తెలియని శక్తి ఏదో ఉంటుంది. వారిలో ఏదో అయస్కాంత ఆకర్షణ ఉంటుంది. వారి స్వభావం, ప్రవర్తన, మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. వీరికి తెలీకుండానే అందరి దృష్టి ఆకర్షిస్తారు. జోతిష్యశాస్త్రం, న్యూమరాలజీ ప్రకారం కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగినవారు కొందరు ఉన్నారు. కొన్ని ముఖ్యమైన తేదీల్లో జన్మించిన వారిని చాలా మంది సీక్రెట్ గా అభిమానిస్తారు. మరి, ఆ తేదీలేంటి? వారిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం....
2వ తేదీలో జన్మించిన వారు...
ఏ నెలలో అయినా 2వ తేదీలో జన్మించిన వారు శాంతి, అనురాగానికి మారుపేరుగా ఉంటారు. ఈ తేదీల్లో జన్మించిన వారు సహజంగా సున్నితమైన, ప్రేమ పూర్వక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు ఎక్కడ ఉన్నా.. చాలా మంది మనసులను గెలుచుకోగలరు. వీరు తమ చుట్టూ ఉన్నవారందరినీ గౌరవిస్తారు. అందుకే వీరికి అభిమానులు చాలా ఎక్కువ. చాలా మంది ఈ తేదీల్లో జన్మించే వారిని దూరం నుంచే అభిమానిస్తారు.
3వ తేదీన జన్మించినవారు..
ఏ నెలలో అయినా 3వ తేదీలో జన్మించినవారు చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తారు. ఎవరితో అయినా చాలా సులభంగా కలిసిపోతారు. ఈ తేదీన పుట్టిన వారు ఆనందంగా, చురుకుగా ఉంటారు. వారు మాట్లాడే తీరు, వ్యక్తీకరణ ఇతరులను ఆకర్షించకుండా ఉండదు. చుట్టూ ఉన్నవారికి ప్రేమను పంచే శక్తి వీరిలో ఉంటుంది. అందుకే.. వీరికి అభిమానులు చాలా ఎక్కువ. సీక్రెట్ గా చాలా మంది వీరిని ఆరాధిస్తూ ఉంటారు.
15వ తేదీలో జన్మించినవారు..
ఏ నెలలో అయినా 15వ తేదీలో జన్మించిన వారు కూడా ఇదే కోవలోకి వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు కుటుంబ సభ్యులతో పాటు.. తమ చుట్టూ ఉండేవారిపై కూడా అమితమైన ప్రేమ చూపిస్తారు. ఏదైనా మనసుతో ఆలోచిస్తారు. వీరిలో క్రియేటివిటీ చాలా ఎక్కువ. వినూత్నంగా ఆలోచిస్తారు. వీరి తెలివి, ఆలోచించే తీరుకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అందుకే.. వీరికి తెలీకుండానే సీక్రెట్ గా ఆరాధిస్తూ ఉంటారు.
17వ తేదీన జన్మించినవారు
17 అనే సంఖ్యను 1+7 = 8గా పరిగణిస్తారు. నెంబర్8 సామర్థ్యం,అధిక క్రమశిక్షణకు మారుపేరు. ఈ తేదీన పుట్టినవారు నిర్దేశిత లక్ష్యాల కోసం కృషి చేయగల శక్తివంతులై ఉంటారు. ఇతరులకు వీరి పనితీరు, నిర్ణయాలు, పట్టుదల ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. కొంతమంది వీరి బలాన్ని చూసి భయపడతారు కూడా. కానీ వీరు హుందాగా, గౌరవంగా, నాయకత్వ గుణాలతో ఎదుగుతారు.
మొత్తం మీద, ఈ ప్రత్యేక తేదీల్లో జన్మించినవారు 2, 3, 15, 17 సమాజంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించగలరు. వారు సహజంగా ఆకర్షణీయులు, శాంతిని పంచేవారు, మర్యాద పూర్వకంగా ఉండే వ్యక్తిత్వానికి ప్రతిరూపం. అందుకే, వారిని పలువురు రహస్యంగా అభిమానించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.