RajaYoga:నాలుగు గ్రహాల అరుదైన కలయిక... ఏలినాటి శని కూడా ఈ రాశులను ఏమీ చేయలేదు..!
RajaYoga: ఏలినాటి శని కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న మూడు రాశులకు అనుకూల సమయం మొదలైంది. మకర రాశిలో ఏక కాలంలో నాలుగు గ్రహాల శుభ కలయిక ఏర్పడింది. దీని కారణంగా.. మూడు రాశుల వారికి మహర్దశ మొదలైంది. ఏలినాటి శని ఉన్నా... అనేక ప్రయోజనాలు పొందుతారు.

Planets
జనవరి 17న చాలా అరుదైన, శుభప్రదమైన గ్రహాల కలయిక ఏర్పడింది. బుధుడు మకర రాశిలోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే సూర్యుడు, శుక్రుడు, కుజుడు ఇదే రాశిలో ఉండగా...బుధుడు కూడా వచ్చి చేరాడు. ఈ నాలుగు గ్రహాల ఏకకాల సంచారం మూడు రాజయోగాలను ఏర్పరుస్తుంది. సూర్యుడు, బుధుని కలయిక బుధాదిత్య రాయోగం, శుక్రుడు, బుధుని కలయిక లక్ష్మీ నారాయణ రాజయోగం, కుజుడు కారణంగా పంచ మహారుష రాజయోగం ఏర్పరస్తుంది.దీని కారణంగా.. మూడు రాశుల వారికి గోల్డెన్ టైమ్ మొదలైంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దాం...
1.మేష రాశి...
ఈ రాజయోగాల కలయిక మేష రాశివారికి చాలా అనుకూలంగా మారుతుంది. దీని కారణంగా, మేష రాశివారు ఎదుర్కొంటున్న పనికి సంబంధించిన సమస్యలు, ఇబ్బందుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ రాశివారు ఈ సమయంలో తమ వృత్తిలో గౌరవ, మర్యాదలు పొందుతారు. అంతేకాకుండా.. వారు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గి.. ప్రశాంతంగా అనిపిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది, పని చేసే చోట విలువ పెరుగుతుంది.
2.కుంభ రాశి..
ప్రస్తుతం కుంభ రాశివారు ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు. కానీ, ఈ సమయం మాత్రం ఈ రాశివారికి చాలా అనుకూలంగా మారనుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు. శుభ కార్యాల కోసం డబ్బు కూడా ఖర్చు చేస్తారు. ఇది వారికి చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. అదనంగా, మీ వ్యక్తిగత సౌకర్యాలు పెరుగుతాయి, ఇది వారికి గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. మతపరమైన ప్రయాణాలకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు వాహనం కొనాలని ఆలోచిస్తుంటే, అది మీకు లాభదాయకంగా ఉండవచ్చు. మీరు ఒక వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు
3.మీన రాశి..
మీన రాశి వారికి 11వ ఇంట్లో నాలుగు గ్రహాల కలయిక జరుగుతోంది. దీని ఫలితంగా, మీన రాశి వారికి సంపద పెరుగుతుంది. నెరవేరని కోరిక ఒకటి ఇప్పుడు నెరవేరవచ్చు. ఇప్పుడు మీకు మీ స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వృత్తిలో పురోగతికి కూడా అవకాశం ఉంటుంది. మీ తోబుట్టువులతో మీకు ఏవైనా విభేదాలు ఉంటే, అవి ఇప్పుడు పరిష్కారమౌతాయి.

