Vastu Tips: ఇంట్లో ఇవి ఉంటే అప్పులు తీరిపోతాయి, డబ్బు సమస్యే ఉండదు
మనలో చాలా మంది అప్పుల బాధతో, డబ్బుల సమస్యతో బాధపడుతూ ఉంటారు.అలాంటివారు ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే చాలు. ఆ డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి.

ఆర్థిక సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉంటారు. ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు మిగలడం లేదని, అప్పులు పెరిగిపోతున్నాయని ఫీలౌతుంటారు. అయితే.. ఇలా ఆర్థిక సమస్యలు రావడానికి కూడా కారణాలు ఉండొచ్చు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా డబ్బు సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే.. వచ్చిన సమస్యలకు భయపడకుండా.. ఇంట్లో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. వాస్తు ప్రకారం.. ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే.. డబ్బు కొరత తీరి ఆ ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయట. మరి, ఆ వస్తువులేంటో చూసేద్దామా...

వెండి ఏనుగు విగ్రహం:
సాధారణంగా ఇల్లును అందంగా ఉంచడానికి చాలా రకాల వస్తువులు తెస్తాం. వాస్తు ప్రకారం ఇంట్లో వెండి ఏనుగు విగ్రహం ఉంచడం చాలా మంచిది. ఏనుగు శక్తి, అభివృద్ధి, సామర్థ్యానికి గుర్తు. విష్ణువు, లక్ష్మీదేవికి ఏనుగు అంటే చాలా ఇష్టం. ఏనుగును గణేశుడి రూపంగా భావిస్తారు. అందుకే వాస్తు ప్రకారం ఇంట్లో వెండి ఏనుగు విగ్రహం ఉంచితే రాహు గ్రహం అనుగ్రహం కలిగి సంపద పెరుగుతుంది.

చేప విగ్రహం
చేప విగ్రహం ఆరోగ్యం, శక్తి, సంపద, సంతోషానికి గుర్తు. అందుకే వాస్తు ప్రకారం వెండి లేదా ఇత్తడితో చేసిన చేప విగ్రహం ఇంట్లో ఉంచితే చాలా మంచిది. ముఖ్యంగా దాన్ని మీ ఇంటి ఉత్తరం లేదా తూర్పు దిక్కులో ఉంచాలి అని గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు లోహంతో చేసిన చేప విగ్రహం తేవడానికి వీలుకాకపోతే, ఇంట్లో ఒక జత చేపల బొమ్మనైనా తెచ్చి పెట్టండి. నిజం చేపలు పెంచుకున్నా కూడా ఇంటికి మంచిదే.

వేణువు
ఇంట్లో వేణువు ఉంచితే సంతోషం, సంపద పెరుగుతాయని వాస్తు శాస్త్రంలో చెప్పారు. ఎందుకంటే వేణువు సంపదను ఆకర్షిస్తుంది. అందుకే మీ ఇంటి తూర్పు లేదా ఉత్తర దిక్కులో వేణువు ఉంచండి.

ఒకే కన్ను ఉన్న కొబ్బరికాయ
సాధారణంగా మనం వాడే కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి. కానీ ఒకే కన్ను ఉన్న కొబ్బరికాయ అరుదు. ఇది దొరకడం కష్టం. వాస్తు ప్రకారం ఇంట్లో ఈ ఒకే కన్ను ఉన్న కొబ్బరికాయ ఉంచితే లక్ష్మీదేవి ఆశీర్వాదం దొరుకుతుంది. అంతేకాదు ఈ కొబ్బరికాయ ఉన్న ఇల్లు ఎప్పుడూ శుభంగా ఉంటుంది.