ఇలాంటి భయంకరమైన కలలు మీకు పడ్డాయా.. అయితే మీకు అదృష్టం కలిగినట్టే..!
కొంతమందికి ప్రతిరోజూ కలలు పడుతూ ఉంటాయి. మంచి, చెడు అంటూ ఏదో ఒక కల పడుతూనే ఉంటుంది. కలల శాస్త్రం ప్రకారం.. మనకు పడే కల ఏదో ఒక సంకేతం ఇస్తుంది. అది మంచైనా, చెడైనా కావొచ్చు.
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మనకు పడే కలలు మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో విషయాలను చెప్తాయి. మన కలలో కనిపించే సంఘటనలు మన భవిష్యత్తు గురించి తెలియజేస్తాయంటున్నారు జ్యోతిష్యులు. అంటే ఇవి శుభ లేదా అశుభ ఘటనలకు సంకేతాలను ఇస్తాయి. మనల్ని భయపెట్టే కొన్ని సంఘటనలు కూడా శుభ సంకేతాలను ఇస్తాయి. ఇలాంటి కలలను పవిత్రంగా కూడా భావిస్తారు. అవేంటంటే?
మరణంతో ముడిపడి ఉన్న కలలు
ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయినట్టు కలపడ్డప్పుడు ఎంతో భయపడుతుంటారు. ఇది అశుభంగా భావించేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇలాంటి కలలు పడ్డప్పుడు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఇలాంటి కలలను శుభప్రదంగా భావిస్తారు. ఇలాంటి కలలు మీకు కూడా పడ్డట్టైతే వారు ఆయురారోగ్యాలతో ఎక్కువ రోజులు బతకబోతున్నారని అర్థం. ఒకవేళ ఆత్మహత్య చేసుకున్న కలలు వస్తే మీ వయసు పెరిగిందని అర్థమొస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
మిమ్మల్ని మీరు పేదవాడిగా చూడటం
కలలో ఉన్న సంపద అంతా పోయి పేదవాళ్లం అయినట్టు కూడా కలలు వస్తుంటాయి. ఇలాంటి కలల వల్ల భవిష్యత్తులో ఉన్న డబ్బంతా పోవచ్చని చాలా మంది భయపడిపోతుంటారు. కానీ డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఇలాంటి కలలను శుభప్రదంగా భావిస్తారు. ఇలాంటి కలలు పడటం అంటే మీరు డబ్బును బాగా సంపాదించబోతున్నారని అర్థం. లేదా మీకు రావాల్సిన డబ్బు మీకు అందుతుందని అర్థం.
మంచి కలలు
కలలో పాములు కనిపిస్తే ఆ రాత్రి నిద్రకూడా పట్టదు చాలా మందికి. పాములంటే చాలా మంది తెగ భయపడిపోతుంటారు. కానీ కలలో పాములు కనిపిస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఈ కలలను శుభప్రదంగా భావిస్తారు. ఇలాంటి కలలు కంటే మీరు అతి త్వరలోనే ప్రభుత్వ రంగం నుండి ప్రయోజనాలను పొందబోతున్నారని ఇది సంకేతం ఇస్తుంది. అలాగే స్మశానవాటిక మీ కలలో కనిపిస్తే దానిని అశుభంగా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కల మీ గౌరవాన్ని పెంచబోతుందని అర్థం ఇస్తుంది.