Birth Month: ఈ 3 నెలల్లో పుట్టిన వారిని నమ్మకండి, అబద్ధాలు చెప్పడంలో నెంబర్ వన్
Birth Month: జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని నెలల్లో పుట్టిన వారు చాలా తెలివైన వారు. ఆ తెలివి తేటలను అబద్ధాలు ఆడడంలో చూపిస్తారు. వీరు అత్యంత నైపుణ్యంగా అబద్ధాలు చెప్పగలరు. ఏ నెలల పుట్టిన వారికి ఈ అలవాటు ఉంటుందో తెలుసుకోండి.

అబద్ధాల చెప్పడం ఒక కళ
మానవ స్వభావంలో అబద్ధాలు చెప్పడం కూడా భాగమే. కొందరు ఎలాంటి తడబాటు, భయం లేకుండా అబద్ధాలు అలవోకగా చెప్పేస్తారు. అబద్ధాల చెప్పడంలో వీరికి ఎంతో నైపుణ్యం ఉంది. అలాగని అందరూ ఈజీగా అబద్ధాలు చెప్పేస్తారు అని కాదు. కొన్ని నెలల్లో పుట్టిన వారికి ఈ టాలెంట్ అధికంగా ఉంటుంది. అబద్ధాలు చెప్పి గొడవలు ఆపి, బంధాలు కలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏ నెలలో పుట్టిన వారికి అబద్ధాలు చెప్పే టాలెంట్ అధికంగా ఉంటుందో తెలుసుకోండి.
మే నెల
మే నెలల పుట్టిన వారు చాలా తెలివైన వారు. చాలా సులువుగా అబద్ధాల చెబుతారు. పదునైన తెలివితో నిజం, అబద్ధం మధ్య తేడా తెలియకుండా చేస్తారు. ఎదుటివారు వీరు చెప్పింది నిజమేనని నమ్మేస్తారు. వీరికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. అలాగే తాము చెప్పిన అబద్ధాన్ని ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకుని స్థిరంగా ఉంటారు. ఆ అబద్ధంపైనే తరువాత రోజుల్లో చెప్పే విషయాలు కూడా ఆధారపడి ఉంటాయి.
అక్టోబర్
అక్టోబర్లో పుట్టిన వారు అబద్ధాలు బాగా చెబుతారు. వీరు చెప్పే అబద్ధాన్ని ఎవరైనా కూడా నిజమని నమ్ముతారు. అంతేకాదు వీరు కూడా తమ అబద్ధమే నిజమని నమ్మేస్తూ ఉంటారు. మానవ భావోద్వేగాలపై వీరికి పట్టు ఎక్కువ. ఎవరి దగ్గర ఎలాంటి అబద్ధం చెప్పాలో వీరికి బాగా తెలుసు. అందుకే నిజాలను అబద్ధాలు చేయడంలో, అబద్ధాలను నిజం చేయడంలో వీరు నిష్టాతులు.
డిసెంబర్
వీరు అబద్ధాలు ఆడిన కూడా మంచే చేస్తారు. వీరు ఎన్నో గొడవలు ఆపుతారు. అలా గొడవలను ఆపడానికి కొన్ని నిజాలను దాచిపెడతారు. ఎదుటివారు ఏమి వినాలనుకుంటున్నారో, ఏ విషయాలను సంతోషిస్తారో అలాంటి అబద్ధాలనే చెబుతారు. దీని వల్ల ఎన్నో గొడవలు ఆగుతాయి. కాబట్టి వీరు అబద్ధాలు చెప్పినా కూడా మంచే జరుగుతుంది.

