- Home
- Astrology
- Shani Devudu: శనివారం ఈ ఐదు వస్తువులను ఎవరి దగ్గర నుంచి తీసుకోకండి, పేదరికం వచ్చేస్తుంది
Shani Devudu: శనివారం ఈ ఐదు వస్తువులను ఎవరి దగ్గర నుంచి తీసుకోకండి, పేదరికం వచ్చేస్తుంది
Shani Devudu: శనివారం న్యాయదేవుడైన శని దేవుడికి అంకితం చేసిన రోజు. ఈ రోజున కొన్ని పనులు చేయడం ద్వారా మేలు జరుగుతుంది. అలాగే కొన్ని వస్తువులను ఇతరుల నుంచి తీసుకోకూడదు కూడా.

శనివారం వీటిని తీసుకోకండి
హిందూమతంలో న్యాయదేవుడైన శని దేవుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శనివారం ఆయనకే అంకితం చేసినది. ఈరోజున ఎన్నో ఆచారాలను పాటిస్తారు. అయితే కొన్ని పనులు కూడా చేయకూడదంటారు. చిన్న తప్పు కూడా ఒక్కోసారి పెద్ద ఫలితాన్ని అందిస్తుంది. అయితే శనివారం ఎవరి నుండి తీసుకోకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. అలా తీసుకుంటే అశుభ ఫలితాలు కలుగుతాయి. మీకు ప్రతికూల శక్తులు పెరిగిపోతాయి. శని దేవుడి కోపానికి కూడా గురి అవ్వాల్సి వస్తుంది. దీనివల్ల ఒక వ్యక్తి జీవితంలో ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు కలిగే అవకాశం ఉంది.
మినపప్పు
శనివారం నాడు ఎవరు ఇచ్చినా కూడా మినప్పప్పును తీసుకోకండి. ఇది శనిదేవుడితో సంబంధం ఉన్న వస్తువు మినప్పప్పును ఇతరుల నుంచి స్వీకరించడం వల్ల కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అయితే శనివారం మినుములు దానం చేయడం మాత్రం చాలా శుభప్రదం. దీనివల్ల ఏలిన నాటి శని, శని దెయ్యా ప్రభావాలను తగ్గించుకోవచ్చు.
ఇనుప వస్తువులు
ఇనుమును శని గ్రహానికి చెందిన లోహంగా భావిస్తారు. శనివారం ఎవరితో ఎవరి నుంచి కూడా ఇనుము తీసుకోకూడదు. అలా తీసుకుంటే శని దేవుని కోపానికి గురవుతారు. దీని వల్ల కెరియర్లో, అడ్డంకులు, వివాదాలు, ప్రమాదాలు, వంటలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు, ఉద్యోగస్తులకు శనివారం ఎవరి దగ్గర నుంచే ఇనుమును తీసుకోవడం చాలా హానికరం.
లవంగాలు
శనివారం ఎవరి నుంచి కూడా లవంగాలు తీసుకోకూడదు. శనివారం నాడు లవంగాలు దానంగా తీసుకోవడం వల్ల మీ గ్రహ స్థానాలపై ప్రభావం పడుతుంది. దీనివల్ల పనిలో తరుచూ అంతరాయాలు కడుగుతాయి. జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. అనుకోని కష్టాలు ఎదురవుతాయి. మీరే లవంగాలను కొని శనివారం నాడు హనుమంతుడికి, శనిదేవుడికి సమర్పిస్తే చాలా మంచిది.
ఆవ నూనె
జ్యోతిష శాస్త్రం చెబుతున్న ప్రకారం ఆవ నూనెతో శని దేవుడికి అనుబంధం ఉంది. శనివారం ఎవరి నుంచి కూడా ఆవనూనెను స్వీకరించకూడదు. ఇది అశుభకరం. దీనిని స్వీకరించడం వల్ల ఎదుటి వ్యక్తి బాధలు, ప్రతికూల శక్తి మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల ఖర్చులు, అప్పులు అకస్మాత్తుగా పెరిగిపోతాయి.

