MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • Name Starts with A: మీ పేరు A అక్షరంతో మొదలవుతుందా? మీరు ఏ వయసులో భారీగా సంపాదిస్తారంటే..

Name Starts with A: మీ పేరు A అక్షరంతో మొదలవుతుందా? మీరు ఏ వయసులో భారీగా సంపాదిస్తారంటే..

Name Starts with A: జ్యోతిషశాస్త్రంలో నేమ్ ఆస్ట్రాలజీకి ప్రాముఖ్యం ఉంది. ఆంగ్ల అక్షరం Aతో మొదలయ్యే వారి జీవితాన్ని జ్యోతిష్కులు, సంఖ్యా శాస్త్రవేత్తలు అంచనా వేసి చెప్పగలరు. ఆంగ్లంలో A అక్షరంతో మొదలయ్యే పేర్లు తెలుగులో ‘అ,ఆ’ అక్షరాలతో ప్రారంభమవుతాయి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 24 2026, 09:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
A అక్షరంతో పేరు మొదలైతే
Image Credit : Chat gpt

A అక్షరంతో పేరు మొదలైతే

మన చుట్టూ ప్రతిది శక్తి స్వరూపమే. కనిపించని ప్రకంపనలు ఉంటాయి. మన పేరులో కూడా శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తి నుంచి ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, వాస్తు వంటివన్నీ కూడా ఆ శక్తిని, ఆ ప్రకంపనలను, మనల్ని పాలించే గ్రహాలను, పుట్టిన తేదీలను, పెట్టిన పేరును బట్టి ముందే మన జీవితాన్ని అంచనా వేసి చెబుతాయి. పేరు మొదలయ్యే అక్షరం ఆ మనిషి వ్యక్తిత్వం పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. A అనేది ఆంగ్ల అక్షరమాలలో మొదటి అక్షరం. అంటే ఇది ఒకటవ సంఖ్యను సూచిస్తుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం 1 సంఖ్యకు అధిపతి సూర్యుడు. A అక్షరంతో మొదలయ్యే వారిపై సూర్యుడి ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే కుజుడు కూడా ఉంటుంది. సూర్య కుజులు ఇద్దరూ బలమైన స్వభావం గల అగ్ని తత్వ గ్రహాలు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎలాంటి లక్షణాలు ఉంటాయి?
Image Credit : Getty

ఎలాంటి లక్షణాలు ఉంటాయి?

సూర్యుడు నాయకత్వానికి, ఆశయాలకు, శక్తికి, అధికారానికి, హోదాకు ప్రతీకగా నిలుస్తాడు. ఇక కుజుడు యోధుడిలా పోరాడే శక్తికి ప్రతీక. కాబట్టి సూర్య కుజ గ్రహాలు తమ గుణాలను A అక్షరంతో మొదలయ్యే వ్యక్తి పై ప్రభావం చూపిస్తాయి. A అక్షరంతో పేరు కలవారు చాలా తెలివైనవారిగా ఉంటారు. వీరిని నమ్మవచ్చు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. అలాగే క్రమశిక్షణగా ఉంటారు. ధైర్యం కూడా ఎక్కువ ముక్కుసూటిగా, నిజాయితీగా ఉండేందుకు ఇష్టపడతారు. ఇక ప్రతికూలతలు చూసుకుంటే.. వీరికి కొంచెం అహంకారం ఎక్కువ. ఆధిపత్యం చెలాయించడానికి చూస్తారు. మొండి వారిగా కూడా ప్రవర్తిస్తారు. ఆకస్మికంగా కోపం వచ్చే అవకాశం ఉంటుంది. వీరి ముక్కుసూటి వైఖరి కొంతమందిని బాధపెడుతుంది.

33
ఏ వయసులో డబ్బు సంపాదిస్తారు?
Image Credit : Getty

ఏ వయసులో డబ్బు సంపాదిస్తారు?

A అక్షరంతో పేరు మొదలయ్యే వారు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య కొంత కష్టాలు పడవచ్చు. కెరీర్లో స్థిరపడడానికి ఇదే మంచిదశ. ఇక 26 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉద్యోగం లేదా వ్యాపారంలో మంచి అవకాశాలు రావడం ప్రారంభమవుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక 33 నుంచి 42 ఏళ్ల మధ్య దశ వీరికి ఎంతో ముఖ్యమైనది. ఈ సమయంలోనే డబ్బు ఎక్కువగా సంపాదిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులు అన్నీ కలిసి వస్తాయి. ఇక 43 ఏళ్లు దాటిన తర్వాత సంపద స్థిరంగా ఉంటుంది. జీవితంలో స్థిరత్వం వస్తుంది. వీరి అదృష్ట తేదీలు 1, 10, 19, 28.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పు.. ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Recommended image3
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Related Stories
Recommended image1
Ravana Age: రాముడు చేతిలో మరణించే సమయానికి రావణుడి వయసు ఎంత?
Recommended image2
Name Starts with S: ఎస్ అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు ఏ వయసులో ధనవంతులవుతారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved