MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Shani Sade Sati: సంక్రాంతికి ఈ ఒక్క పని పనిచేస్తే.. ఏలినాటి శని కష్టాలు తీరినట్లే..!

Shani Sade Sati: సంక్రాంతికి ఈ ఒక్క పని పనిచేస్తే.. ఏలినాటి శని కష్టాలు తీరినట్లే..!

Shani Sade Sati: మకర సంక్రాంతి రోజున సూర్యుడు శని గ్రహానికి చెందిన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. జోతిష్యశాస్త్రం ప్రకారం, ఏలినాటి శని ప్రభవాలను తగ్గించుకోవడానికి ఈరోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటిస్తే చాలు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 13 2026, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏలినాటి శని..
Image Credit : others

ఏలినాటి శని..

మకర సంక్రాంతి పండగ వచ్చేసింది. ఈ రోజున గ్రహాలకు రాజు అయిన సూర్యుడు శని రాశి అయిన మకర రాశిలోకి అడుగుపెడతాడు. ఈ శుభ సమయం మూడు రాశుల వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. 2026 సంవత్సరంలో మూడు రాశుల వారు ఏలినాటి శని ప్రభావంలో ఉంటారు. ఈ మూడు రాశులకు ఎక్కువ కష్టాలు కూడా ఉండనున్నాయి. అందుకే , వీరు ఆ కష్టాల నుంచి బయటపడటానికి చిన్న పరిహారం పాటిస్తే చాలు.. ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడొచ్చు. మరి, ఆ రాశులేంటి? సంక్రాంతి రోజున ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.మేష రాశి...
Image Credit : Asianet News

1.మేష రాశి...

ఈ ఏడాది మేష రాశివారు ఏలినాటి శని దశ మొదటి దశ ప్రభావాన్ని చూస్తారు. అందువల్ల, మేష రాశి వారు కెరీర్, వ్యాపారం, ఆర్థిక విషయాలకు సంబంధించి అనేక సవాళ్లు ఎదుర్కుంటారు. ఈ కాలంలో మీరు అద్భుతమైన అవకాశాలను కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా, శని ప్రభావం వల్ల మేష రాశివారు అపార్థాల కారణంగా సంబంధాలలో అడ్డంకులు, మనస్పర్థలను ఎదుర్కోవలసిరావచ్చు. మీరు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మేష రాశివారు శని ఆలయానికి వెళ్లి ఆవాల నూనెలో నల్ల నువ్వులు కలిపి శని దేవునికి సమర్పించి..ఆలయంలో దీపం వెలిగించాలి. తర్వాత 'ఓం ప్రం ప్రిం ప్రౌం సహ శనైశ్చరాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి. దీని తర్వాత, మేష రాశి వారు నల్ల నువ్వులు, ఆవాల నూనె లేదా మినపప్పును దానం చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.

Related Articles

Related image1
Zodiac signs: ఈ రాశుల వారు తక్కువ సంపాదనతో కూడా కోట్లు సంపాదించగలరు..!
Related image2
Birth Date:ఈ తేదీల్లో పుట్టినవారి గుండె నిండా సీక్రెట్సే.. ఒక్కటి కూడా బయటపెట్టరు..!
34
2.కుంభ రాశి...
Image Credit : Asianet News

2.కుంభ రాశి...

ఈ సంవత్సరం కుంభ రాశివారికి ఏలినాటి శని చివరి దశ నడుస్తోంది. అలాగే, ఈ కాలంలో రాహువు కూడా కుంభ రాశి వారి జాతకంలో సంచరిస్తున్నాడు. కాబట్టి, ఈ కాలంలో కుంభ రాశివారికి వారి వృత్తి జీవితంలో పెద్ద సమస్యలు ఎదురౌతాయి. ఆర్థికంగా కూడా ఎక్కువగా సమస్యలు రావచ్చు. శని ప్రభావం కుంభ రాశివారి ఆదాయ మార్గాలపై ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడటానికి సంక్రాంతి రోజున ఈ కుంభ రాశివారు ఆవనూనెలో మీ నీడను చూడాలి. తర్వాత ఆ నూనెను ఎవరైనా పేదలకు దానం చేయాలి. శని చాలీసా పఠించడం కూడా చాలా శుభప్రదం.

44
3.మీన రాశి...
Image Credit : Asianet News

3.మీన రాశి...

ఈ సంవత్సరం మీన రాశి వారు ఏలినాటి శని రెండవ దశ ప్రభావానికి లోనవుతారు. అందువల్ల, ఏలినాటి శని దశ మీన రాశి వారికి మానసిక ఒత్తిడిని, సమస్యలను, గొడవలను పెంచే పరిస్థితిని సృష్టించవచ్చు. ఈ కాలంలో మీరు ఆర్థిక సంబంధిత సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు. ఈ కాలంలో మీన రాశి వారు ఆరోగ్య విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఏదైనా పాత వ్యాధి మీ సమస్యలను మరింత పెంచే అవకాశం ఉంది. కాబట్టి మీరు మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఈ రాశివారు సంక్రాంతి రోజున ఉదయం స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయండి. తర్వాత సూర్య భగవానుడికి నీటిని సమర్పించి.. ఓం ఆదిత్యాయ నమ: అనే మంత్రం పఠించాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image3
Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ మంగళసూత్రం డిజైన్లు
Related Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల వారు తక్కువ సంపాదనతో కూడా కోట్లు సంపాదించగలరు..!
Recommended image2
Birth Date:ఈ తేదీల్లో పుట్టినవారి గుండె నిండా సీక్రెట్సే.. ఒక్కటి కూడా బయటపెట్టరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved