January Born: జనవరిలో జన్మించిన వారికి శని దేవుడితో ఇబ్బందులు ఉంటాయా?
January Born: జనవరి నెలలో జన్మించిన వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. అయితే ఈ నెలలో జన్మించిన వారికి శనిదేవుడు వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.

జనవరిపై శని గ్రహ ప్రభావం
ప్రతి ఏటా జనవరిలో ఎంతోమంది జన్మిస్తారు. న్యూమరాలజీ ప్రకారం వేద జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం జనవరిలో జన్మించిన వారిపై శని గ్రహ ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ నెలలో జన్మించిన వారు వ్యక్తులు క్రమశిక్షణగా ఉన్న జీవితాన్ని గడుపుతారు. తమ బాధ్యతలను గుర్తించి దానికి తగ్గట్టు నడుచుకుంటారు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకుంటారు. కాకపోతే శని దేవుడి వల్ల వీరి జీవితాల్లో సక్సెస్ మాత్రం చాలా ఆలస్యంగా వస్తుంది. వచ్చిన తర్వాత మాత్రం మామూలుగా ఉండదు. ఒకేసారి వీరు హైలెట్ అయిపోతారు.
ద్వేషమే ఉండదు
జనవరిలో జన్మించిన వ్యక్తులు చాలా స్నేహంగా ఉంటారు. అయితే అంత తేలికగా స్నేహం చెయ్యరు. చాలా ఆలోచించాకే అడుగు ముందుకేస్తారు. ఒకరితో స్నేహం చేశాక వారిని విడిచి పెట్టేందుకు ఇష్టపడరు. మనసు విప్పి విషయాలు ఏవీ కూడా త్వరగా చెప్పరు. ఒక్కసారి నమ్మకం పెంచుకున్నారంటే అప్పుడే ఓపెన్ అవుతారు. వీరికి ఇతరులపై ఎలాంటి ద్వేషాలు ఉండవు. కానీ చాలా తెలివిగా మాట్లాడతారు. నిజాయితీగా ఉండేందుకు ఇష్టపడతారు.
దిష్టి తగులుతుందనే భయం
జీవితాన్ని చాలా రహస్యంగా ఉంచేందుకు వీరికి ఇష్టం. కాకపోతే దిష్టి తగలడం పై మాత్రం వీరికి నమ్మకాలు ఎక్కువ. చెడు కన్ను పడితే అంత నాశనం అవుతుందనే భయంతో ఉంటారు. అందుకే తమ వ్యక్తిగత జీవితాలను ఇతరులకు తెలియకుండా దాచిపెడుతూ ఉంటారు. తమ జీవితాల్లో శాంతి నిండుగా ఉండాలని కోరుకుంటారు. అందుకే ఇతరులతో వ్యక్తిగత జీవితాన్ని పంచుకోరు. దాదాపు దూరంగా ఉండేందుకే ప్రయత్నిస్తారు. ఇక జనవరిలో జన్మించిన వారు కష్టపడి పనిచేసేతత్వం ఉన్నవారు సానుకూలంగా దృక్పథంతో ముందుకు సాగేందుకు ఇష్టపడతారు.
లక్కీ నెంబర్స్ ఇవే
జనవరిలో జన్మించిన వ్యక్తుల్లో అతిపెద్ద లోపం ఒకటుంది. వారు తమలో తామే కుమిలిపోతారు. తమలో తామే మథనపడతారు. ఏ విషయాన్ని ఎవరితోను షేర్ చేసుకోరు. అవసరమైనప్పుడు కనీసం సాయం కూడా అడగరు. తమపై తమ శ్రద్ధ పెట్టుకోవడం కూడా ఒకసారి మానేస్తారు. వీటిని మీరు సరిదిద్దుకుంటే మంచి జీవితాన్ని గడుపుతారు. ఇక జనవరిలో జన్మించిన వారి అదృష్ట సంఖ్యలు 1,4, 8గా చెబుతారు. ఇక వీరికి కలిసి వచ్చే రంగులు నేవీ బ్లూ, నలుపు, బూడిద రంగు.

