Rahu Transit: నవంబర్ 25న మకర రాశిలోకి రాహువు.. ఈ 4 రాశులకు తిరుగులేని అదృష్టం
Rahu Transit: 2026 నవంబర్ 25వ తేదీన సాయంత్రం 4:34 గంటలకు మకర రాశిలోకి రాహువు ప్రవేశించబోతున్నాడు. ఈ మార్పు వల్ల 12 రాశుల్లో 4 రాశుల వారిక అనేక రకాలుగా కలిసివస్తుంది. ఆ నాలుగు రాశులు ఏవో తెలుసుకోండి.

మేష రాశి
రాహువు మకరరాశిలోకి ప్రవేశించడం అనేది మేష రాశి వారికి చాలా మేలు చేస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఇక వ్యాపారస్తులకు ఇది కలిసి వచ్చే సమయం. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు వస్తాయి. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి ఆఫీసులో మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ప్రమోషన్ లేదా స్థానచలనం ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో గొడవలు తగ్గి బంధాలు మెరుగుపడతాయి. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి.
సింహ రాశి
రాహువు రాశి మారడం అనేది సింహ రాశి వారికి కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. ఈ రాశి వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దీని వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు ఆఫీసులో ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారులకు పెద్ద ప్రాజెక్టులు దక్కే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి రాహు గోచారం బాగా కలిసి వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. పెద్ద డీల్స్ కుదురుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ఆఫీసు పనుల మీద చేసే ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి.
మీన రాశి
రాహువు మార్పు వల్ల మీన రాశి వారి జీవితంలో సుఖాలు, విలాసాలు పెరుగుతాయి. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఉద్యోగులకు మంచి ప్యాకేజీతో కొత్త అవకాశాలు వస్తాయి. మొత్తం మీద చూసుకుంటే, కెరీర్, డబ్బు విషయాల్లో వీరికి తిరుగుండదు.















