Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది.. అప్పులు తీరుతాయి!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 09.06.2025 సోమవారానికి సంబంధించినవి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మేష రాశి ఫలాలు
స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో మంచి అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
వృషభ రాశి ఫలాలు
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఖర్చులను అదుపు చేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. క్రయ విక్రయాల్లో స్వల్ప నష్టాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలించవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
మిథున రాశి ఫలాలు
సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భూ సంభందిత వ్యవహారాలు కలిసివస్తాయి. అన్ని రంగాలవారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందుతారు. అప్పులు కొంతమేర తీరుతాయి.
కర్కాటక రాశి ఫలాలు
బంధు మిత్రులతో అనుకోని వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు కలిసిరావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో సమస్యలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.
సింహ రాశి ఫలాలు
ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. సన్నిహితుల సలహాలు కలిసివస్తాయి. వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పాత స్నేహితులతో విందు వినోదాదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో దీర్ఘ కాలిక సమస్యల నుంచి బయటపడతారు.
కన్య రాశి ఫలాలు
నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాల వల్ల సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు దక్కుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో వివాదాలు సర్దుమణుగుతాయి.
తుల రాశి ఫలాలు
ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. రుణ ప్రయత్నాలు అనుకూలించవు. దూర ప్రాంత బంధువులను కలుసుకుంటారు. వ్యాపారపరంగా పెట్టుబడులు లాభించవు. వృత్తి, ఉద్యోగాల్లో చేసే ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తాయి. అనారోగ్య సూచనలున్నాయి.
వృశ్చిక రాశి ఫలాలు
ప్రయాణాల్లో ప్రమాద సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపాటు పనికిరాదు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కలిసిరాదు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
ధనుస్సు రాశి ఫలాలు
వృథా ఖర్చులు చేస్తారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. విద్యారంగంలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగాల్లో మరింత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
మకర రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారుల ప్రశంసలు పొందుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అప్పులు తీరుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆదాయం పెరుగుతుంది.
కుంభ రాశి ఫలాలు
పిల్లల విషయంలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. పనుల్లో జాప్యం కలిగినా సమయానికి పూర్తిచేస్తారు. స్థిరాస్తి విక్రయాలకు అడ్డంకులు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలను అధిగమిస్తారు. నిరుద్యోగుల శ్రమకు ఫలితం లభిస్తుంది.
మీన రాశి ఫలాలు
అన్ని రంగాల వారికి సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాల గురించి పునరాలోచన చేయడం మంచిది. బంధు వర్గం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందలేరు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది.