Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అప్పుల నుంచి విముక్తి.. నిరుద్యోగుల కలలు సాకారం!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 04.04.2026 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృషభ రాశి ఫలాలు
జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల శ్రమ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.
మిథున రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికర సమాచారం అందుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో సొంత నిర్ణయాలు కలిసివస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.
కర్కాటక రాశి ఫలాలు
ఒక ముఖ్యమైన విషయంలో మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణాలు శ్రమతో కూడుకుంటాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
సింహ రాశి ఫలాలు
ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
కన్య రాశి ఫలాలు
కొత్త అప్పులు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు ఉంటాయి. నూతన వ్యాపార పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.
తుల రాశి ఫలాలు
సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరుల నుంచి డబ్బు సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.ఆదాయం బాగుంటుంది.
వృశ్చిక రాశి ఫలాలు
దీర్ఘకాలిక అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. డబ్బు వ్యవహారాలు కలిసివస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం దక్కదు. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మకర రాశి ఫలాలు
వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు డబ్బు సహాయం చేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
కుంభ రాశి ఫలాలు
నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది.
మీన రాశి ఫలాలు
రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు.

